జమ్మూలోని కిష్ట్వార్ పట్టణంలో నిన్న జరిగిన అల్లర్లలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి శనివారం ఉదయం మరణించాడు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు శనివారం జమ్మూలో వెల్లడించారు. అయితే మరణించిన వ్యక్తికి సంబంధించిన వివరాలు ఏవి తమ వద్ద లేదని వారు తెలిపారు. శుక్రవారం పట్టణంలో ఇరు మతాలకు మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో ఓ వ్యక్తి మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు.
క్షతగాత్రులును జమ్మూలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఓ వ్యక్తి చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మరణించాడని పేర్కొన్నారు. ఆ ఘర్షణలో భాగంగా ఇరు మతాలకు చెందని ఆందోళనకారులు పట్టణంలో దుకాణాలు, కార్యాలయాలు, పెట్రోల్ పంపులను తగుల బెట్టారు. ఆ నేపథ్యంలో ఉన్నతాధికారులు పట్టణంలో నిరవధిక కర్ప్యూ ను విధించారు.
రెండో రోజు కూడా ఆ కర్ప్యూ కొనసాగుతుంది. ఘర్షణలో నిన్న మరణించిన మృతుడు అరవింద కుమార్ కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. పట్టణంలో శాంతిభద్రతలు అదుపు తప్పడంతో జిల్లా ఉన్నతాధికారులను బదిలీ చేస్తు జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం శనివారం ఉత్తుర్వులు జారీ చేసింది.
కిష్ట్వార్ అల్లర్ల ఘటనలో మరొకరు మృతి
Published Sat, Aug 10 2013 9:56 AM | Last Updated on Fri, Sep 1 2017 9:46 PM
Advertisement
Advertisement