కాశ్మీర్ లోయలో చిక్కుకున్న తెలంగాణాకు చెందిన సుమారు 1000 మంది అమర్‌నాథ్ యాత్రికులను సురక్షితంగా వెనక్కి రప్పించడంపై చర్యలు తీసుకోవాలంటూ సీఎస్ రాజీవ్‌శర్మకు టీ కాంగ్రెస్ నేతలు లేఖ రాశారు.
కాశ్మీర్ లోయలో చిక్కుకున్న తెలంగాణాకు చెందిన సుమారు 1000 మంది అమర్‌నాథ్ యాత్రికులను సురక్షితంగా వెనక్కి రప్పించడంపై చర్యలు తీసుకోవాలంటూ సీఎస్ రాజీవ్‌శర్మకు టీ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డిలు లేఖ రాశారు. తక్షణమే కాశ్మీర్‌కు ప్రత్యేక టీంను పంపించి యాత్రికులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కోరారు. కాశ్మీర్ అల్లర్ల నేపథ్యంలో మూడు రోజుల నుంచి యాత్రికులు ఇబ్బందులు పడుతోన్నారు.