శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ వేర్పాటు వాద గెరిల్లాలు విధ్వంసానికి పాల్పడ్డారు. ఆదివారం కాశ్మీర్ లోయలోని పుల్వామా జిల్లాలో నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు యవర్ మసూదిన్ ఇంటివద్ద భద్రత సిబ్బందిపై కాల్పులకు దిగారు. ఈ ఘటనలో ఇద్దరు సిబ్బంది మరణించారు. వారిని మసూదిన్కు భద్రతగా నియమించారు. ఉగ్రవాద వేర్పాటు వాదులు దాడి చేసిన అనంతరం భద్రత సిబ్బంది వారి కోసం గాలిస్తున్నారు. శ్రీనగర్ 20 కిలోమీటర్ల దూరంలో గల ఖ్రేవ్ గ్రామంలో ఈ సంఘటన జరిగింది.