జమ్మూ- శ్రీనగర్ హైవేలో శనివారం వన్ వేలోనే వాహనాలకు అనుమతించారు.
కశ్మీర్ లోయకు సరుకుల రవాణాకు ఉపయోగించే ఏకైక మార్గం ఇదే కావడంతో రోడ్డు మూసివేత ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. అక్కడ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. చలికాలంలో కొండచరియలు విరిగిపడటం, మంచు కారణంగా ఈ రోడ్డును అధికారులు మూసివేసి ఉంచారు. ఈ సమయంలో పర్యాటకులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.