సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మీదుగా కశ్మీర్ లోయకు మే 11న ప్రత్యేక రైల్వే సేవలు ప్రారంభిస్తున్నట్టు సౌత్ స్టార్ రైల్ ప్రతినిధులు తెలిపారు. భారతీయ రైల్వే ప్రారంభించిన భారత్ గౌరవ్ పథకంలో భాగంగా ‘సౌత్ స్టార్ రైల్’ నూతన రైల్వే సేవలు అందిస్తోంది. ఈ సందర్భంగా ‘సౌత్ స్టార్ రైల్’ ప్రాజెక్ట్ డైరెక్టర్ విఘ్నేశ్ ఆదివారం సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. వేసవి విడిది నేపథ్యంలో థీమ్ టూరిస్ట్ ప్యాకేజీలో భాగంగా కశ్మీర్‌కు ప్రత్యేక రైల్‌ను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు.
ఈ రైలు కోయంబత్తూర్ నుంచి ప్రారంభమై హైదరాబాద్, వరంగల్, ధర్మపురి, విజయవాడ, ఈరోడ్, సేలం, ఎలహంక, పెరంబుదూర్ మీదుగా ప్రయాణిస్తుందని చెప్పారు. భారత పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ టూర్ ఆపరేటర్లను పర్యవేక్షిస్తుందని పేర్కొన్నారు. ప్యాకేజీ వ్యవధి 12 రోజులని తెలిపారు. ఇందులో ప్రత్యేక సదుపాయాలతో పాటు ప్రయాణ బీమా, సైట్ సీయింగ్, భోజన వసతులు అందిస్తున్నామని రీజినల్ మేనేజర్ సంతోష్ వివరించారు. బుకింగ్ తదితర సమాచారం కోసం 7876101010 నంబర్ లేదా ఠీఠీఠీ.ట్చజీ ్టౌuటజీటఝ.ఛిౌఝలో సంప్రదించవచ్చని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment