నేడు మొబైల్ ఇంటర్నెట్ సేవలు బంద్ | Mobile internet services suspended in Kashmir | Sakshi
Sakshi News home page

నేడు మొబైల్ ఇంటర్నెట్ సేవలు బంద్

Published Sat, Jul 9 2016 8:55 AM | Last Updated on Wed, Aug 29 2018 7:26 PM

నేడు మొబైల్ ఇంటర్నెట్ సేవలు బంద్ - Sakshi

నేడు మొబైల్ ఇంటర్నెట్ సేవలు బంద్

శ్రీనగర్: కశ్మీర్ లోయలో శనివారం మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. కశ్మీర్ లోయలో పలు ప్రాంతాల్లో ఈ రోజు ఆంక్షలు విధించారు. శుక్రవారం భద్రత దళాలు అనంతనాగ్లో మోస్ట్ వాంటెడ్ హిజ్బుల్ కమాండర్ బర్హణ్ వనీతో పాటు మరో ఇద్దరిని కాల్చిచంపారు. ఈ నేపథ్యంలో శాంతిభద్రలను కాపాడేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు. సంఘ విద్రోహశక్తులు వదంతులు ప్రచారం చేయకుండా అడ్డుకట్ట వేసేందుకు మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులను బంద్ చేశారు.

పుల్వామా జిల్లా వ్యాప్తంగా అధికారులు ఆంక్షలు విధించారు. అనంతనాగ్, షోపియన్, పుల్గాం, సొపొరె పట్టణాల్లో ఆంక్షలు అమల్లో ఉంటాయి. శ్రీనగర్లో ఏడు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆంక్షలు విధించారు. ఈ రోజు జరగాల్సిన స్కూలు బోర్డ్ పరీక్షలన్నింటినీ వాయిదా వేశారు. కశ్మీర్ ప్రాంతంలోని బారాముల్లా నుంచి జమ్ములోని బనిహాల్కు వెళ్లే రైలు సర్వీసులను కూడా రద్దు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement