కశ్మీర్ లోయలో శనివారం మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. కశ్మీర్ లోయలో పలు ప్రాంతాల్లో ఈ రోజు ఆంక్షలు విధించారు. శుక్రవారం భద్రత దళాలు అనంతనాగ్లో మోస్ట్ వాంటెడ్ హిజ్బుల్ కమాండర్ బర్హణ్ వనీతో పాటు మరో ఇద్దరిని కాల్చిచంపారు. ఈ నేపథ్యంలో శాంతిభద్రలను కాపాడేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు. సంఘ విద్రోహశక్తులు వదంతులు ప్రచారం చేయకుండా అడ్డుకట్ట వేసేందుకు మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులను బంద్ చేశారు.