శ్రీనగర్‌లో భద్రతా దళాలపై ఆదివారం ఉగ్రవాదులు జరిపిన గ్రనేడ్ దాడిలో ఇద్దరు సీఆర్‌పీఎఫ్ సిబ్బంది మరణించగా, ఇద్దరు పౌరులు గాయపడ్డారు. లాల్‌చౌక్‌లోని ప్రతాప్ పార్క్ వద్ద విధులు నిర్వహిస్తున్న భద్రతా దళాలపై టెర్రరిస్టులు గ్రనేడ్లు విసిరారు. ఉగ్ర దాడితో అప్రమత్తమైన భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నాయి. ఉగ్ర ఘటనపై విచారణను చేపట్టాయి. గ్రనేడ్ దాడికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రాథమిక దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.