granade
-
జమ్ము కశ్మీర్ శ్రీనగర్‌లో భారీ ఉగ్రదాడి
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి జరిగింది. ఆదివారం శ్రీనగర్ సండే మార్కెట్లోని టూరిస్ట్ సెంటర్ ఆఫీస్(TRC)పై ఉగ్రవాదులు గ్రనేడ్లు విసిరారు. ఈ దాడిలో పది మందికి(12 మంది) పైగా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది. శ్రీ నగర్ నగరానికి గుండెకాయగా చెప్పుకునే లాల్ చౌక్‌ను ఆనుకున్న రోడ్డులోనే సండే మార్కెట్ పేరిట వారాంతపు సంత నిర్వహిస్తారు. మార్కెట్ కారణంగా టీఆర్సీ గ్రౌండ్లో విపరీతమైన జన రద్దీ నెలకొంది. ఇదే అదనుగా భావించిన ఉగ్రవాదులు మైదానంలోకి గ్రనేడ్లు విసిరినట్లు స్థానిక మీడియా చానెల్స్ కథనాలు ఇస్తున్నాయి. దాడి జరిగిన వెంటనే పారామిలిటరీ బలగాలు ఆ ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నాయి. క్షతగాత్రుల్ని ఆస్పత్రులకు చేర్చాయి. ప్రస్తుతం అక్కడ ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతోంది. లష్కరే తాయిబా గ్రూప్‌కు చెందిన టాప్ కమాండర్ ఒకరిని.. ఖన్యార్ ప్రాంతంలో భారత సైన్యం మట్టుపెట్టింది. ఆ మరుసటి రోజే ఈ దాడి జరగడం గమనార్హం. #BREAKINGGrenade attack in Srinagar's busy Sunday market injures 5 civiliansIncident occurred near the heavily-guarded Tourist Reception Centre (TRC)Comes a day after security forces neutralized top Lashkar-e-Taiba commander in downtown #Srinagar. Security forces on site… pic.twitter.com/iaWl1NJNL9— Nabila Jamal (@nabilajamal_) November 3, 2024ఇదిలా ఉంటే.. ఈ మధ్యకాలంలో అక్కడ వరుసగా ఉగ్రవాద కదలికలు పెరిగాయి. గత వారం రోజులుగా మూడు ఎన్కౌంటర్లు జరిగాయి. అంతకు ముందు నుంచే సైనిక వాహనాలపైనా దాడులు జరుగుతున్నాయి. దీంతో భద్రతా బలగాలు కూంబింగ్ కట్టుదిట్టం చేశాయి. ఒకవైపు సైనికులు.. మరోవైపు అమాయక ప్రజలు సైతం ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో వరుస ఉగ్రదాడి ఘటనలపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. జమ్ము కశ్మీర్లో టెర్రరిస్టుల దాడులు దురదృష్టకరమని , సరిహద్దుల్లో ఎలాంటి భద్రతా లోపం లేదని.. ఉగ్రవాదులకు భద్రతా దళాలు తగిన సమాధానం ఇస్తున్నాయని చెప్పారు.ఇదీ చదవండి: కశ్మీర్ ఓటమి.. కమలం పార్టీ కీలక నిర్ణయం -
ఛాతీలోకి లైవ్ గ్రనేడ్.. ఎలా కాపాడావయ్యా?!
కీవ్: తమపై దురాక్రమణలో రష్యా బలగాల అకృత్యాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందని ఉక్రెయిన్ వాపోతోంది. ఏడాదికి సమయం దగ్గరపడుతున్నా.. ప్రాణ, ఆస్తి నష్టం కొనసాగుతుండడం యావత్ ప్రపంచాన్ని కలవరపాటుకు గురి చేస్తోంది. ఈ క్రమంలో ఉక్రెయిన్ ఆర్మీ డాక్టర్ ఒకాయన చేసిన పని సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. లైవ్ గ్రనేడ్ ఒకటి ఓ సైనికుడి ఛాతీలో ఇరక్కుపోవడంతో.. ఆయన చాకచక్యంగా వ్యవహరించి దానిని బయటకు తీశాడు. ఉక్రెయిన్ యుద్ధంలో భాగంగా.. బక్ముట్ వద్ద భీకర పోరాటం జరుగుతోంది. ఆ సమయంలో వీవోజీ గ్రనేడ్ లాంఛర్ ద్వారా దూసుకెళ్లాల్సిన ఓ లైవ్ గ్రనేడ్.. సైనికుడి ఛాతీలోకి వెళ్లిందట. అది ఏ క్షణమైనా అది పేలి అతను చనిపోవచ్చు. ఆ టైంలో మేజర్ జనరల్ డాక్టర్ అండ్రి విల్లో, సర్జరీకి దిగారు. తన ప్రాణాలకు తెగించి మరీ ఆపరేషన్ చేసి దానిని తొలగించి అతని పాలిట దేవుడిగా నిలిచాడు. ఆ డేరింగ్ ఆపరేషన్‌ను ఆయన ఇద్దరు సైనికుల సహకారంతో నిర్వర్తించడం విశేషం. వీవోజీ గ్రనేడ్ బాడీలోకి వెళ్లాక ఏమాత్రం చెదరలేదట. ఛాతీలో అలాగే చిక్కుకుపోయిందట. ఏమాత్రం పొరపాటు జరిగినా అది పేలిపోయి ఆ సైనికుడు ముక్కలు ముక్కలు అయిపోతాడు. అతనితో పాటు సర్జరీకి దిగిన వైద్యుడు కూడా హరీమంటాడు. ఆ సమయంలో ఎలెక్ట్రో కోగ్యులేషన్ చర్యకు దిగి ఉంటే.. కచ్చితంగా ఆ గ్రనేడ్ పేలిపోయేది. కానీ, మేజర్ ఆండ్రి విల్లో ఆ పని చేయలేదు. సర్జరీని విజయవంతంగా పూర్తి చేసి.. ఆ సైనికుడి ప్రాణాలు నిలబెట్టాడు. ఈ విషయాన్ని ఉక్రెయిన్ సైన్యం ధృవీకరించింది కూడా. అయితే సైనికుడి ఛాతీలోకి ఆ గ్రనేడ్ ఎలా వెళ్లిందనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఎక్స్‌రే ద్వారా ఛాతీలో గ్రనేడ్ ఇరుక్కున ఫొటో, ఆపరేషన్ చేశాక ఆ గ్రనేడ్‌ను తొలగించిన ఫొటోలను మాత్రం రిలీజ్ చేసింది ఉక్రెయిన్ సైన్యం. -
Targeted Attacks: కశ్మీర్లో నాలుగు రోజుల్లో ముగ్గురి హత్య
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో మళ్లీ ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. మైనార్టీలు, వలస కూలీలే లక్ష్యంగా దాడులు చేస్తుండటం కలకలం సృష్టిస్తోంది. నాలుగు రోజుల క్రితం ఓ కశ్మీరీ పండిట్‌ను టెర్రరిస్టులు ఇంట్లోకి చొరబడి కాల్చి చంపారు. తాజాగా మరో ఇద్దరు వలస కూలీలను పొట్టనబెట్టుకున్నారు. షోపియాన్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున కూలీలు నివాసం ఉంటున్న ప్రాంతంలో గ్రెనేడ్ దాడి చేయగా.. ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారు. గత నాలుగు రోజుల్లో రెండుసార్లు దాడులు జరగటం భయానక పరిస్థితులను తలపిస్తోంది. షోపియాన్‌లోని హర్మెన్ ప్రాంతంలో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వలస కూలీలు నివసిస్తున్న ఇంటిపైకి టెర్రరిస్టులు గ్రెనేడ్ విసిరారు. ఈ దాడిలో ఇద్దరు కూలీలు తీవ్రంగా గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వారు ప్రాణాలు కోల్పోయారు. మృతులిద్దరూ యూపీలోని కన్నౌజ్‌కు చెందిన రామ్‌సాగర్, మోనిశ్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. ఉగ్రదాడి నేపథ్యంలో హర్మెన్ ప్రాంతంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. లష్కరే తోయిబాకు చెందిన హైబ్రీడ్ ఉగ్రవాది ఇమ్రాన్ బషీర్ గనీని అరెస్టు చేశారు. పోలీసుల విచారణంలో కూలీలపైకి గ్రెనేడ్ విసిరింది ఇమ్రానే అని తేలింది. గత శనివారం ఇదే షోపియాన్ ప్రాంతంలో పురాన్ క్రిషన్ భట్(56) అనే కశ్మీరీ పండిట్ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. చౌధరీ గూండ్ గ్రామంలో పూరాన్ భట్ తన ఇంటి వద్ద ఉండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన భట్.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ దాడిని తామే చేసినట్లు కశ్మీర్ ఫ్రీడమ్ ఫైటర్స్ ప్రకటించింది. భట్ హత్యతో కశ్మీర్ లోయలో మరోసారి ఆందోళనలు మొదలయ్యాయి. అంతకు ముందు సెప్టెంబర్ 2న మునీర్ ఉల్ ఇస్లామ్ అనే పశ్చిమ బెంగాల్‌కు చెందిన వలస కూలీని ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఇదీ చదవండి: ఉప్పల్ తండ్రీకొడుకుల హత్య కేసు: కుంకుమ-పసుపు క్లూస్.. పూజలు వికటించడంతో కక్షగట్టి! -
గ్రనేడ్లతో రష్యా సైనికుడి బెదిరింపులు
Ukraine Conflict: ఉక్రెయిన్‌లోని దక్షిణ తీర నగరం కొనొటొప్ను గురువారం రష్యా సేనలు దిగ్బంధించాయి. నగరంలోకి ప్రవేశించిన పౌరులను లొంగిపోవాలంటూ హెచ్చరికలు జారీ చేశాయి. రష్యా సైనికుడొకరు నగరంలోని ఓ ప్రాంతంలో చేతుల్లో రెండు గ్రనేడ్లను పట్టుకుని, ప్రజల మధ్య తిరుగుతున్న వీడియో ఫుటేజీ ఒకటి బయటకు వచ్చింది. భయంతో కొందరు గ్రనేడ్ విసిరేయాలని అతడిని కోరగా, షేమ్ షేమ్ అని మరికొందరు అరుస్తున్నట్లుగా అందులో ఉంది. లొంగిపోతారా లేక పోరాడతారా అని నగర మేయర్ ఆర్టెమ్‌ను ఆ సైనికుడు హెచ్చరించాడు. ఈ విషయమై మేయర్ ఆర్టెమ్ స్పందిస్తూ.. ప్రస్తుతం బలగాలు నగరం బయటకు వెళ్లిపోయాయని చెప్పారు. తాము పోరాడటానికే నిశ్చయించుకున్నట్లు నగర ప్రజలు తెలిపారని అన్నారు. గురువారం ఉదయం నల్లసముద్ర తీర నగరం ఖెర్సన్‌పై పట్టుసాధించినట్లు రష్యా బలగాలు మొదటిసారిగా వెల్లడించాయి. (చదవండి: రష్యాకు కోలుకోలేని దెబ్బ.. ఇలా జరిగిందేంటి.. పుతిన్ తప్పు చేశారా..?) -
శ్రీనగర్‌లో గ్రెనేడ్ దాడి.. నలుగురికి తీవ్రగాయాలు
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్ రాష్ట్రంలోని శ్రీనగర్ సిటీలో ఉగ్రవాదులు గ్రెనేడ్ బాంబులతో దాడికి పాల్పడ్డారు. కాగా, వీరు స్థానికంగా ఉన్న హైస్ట్రీట్ వద్ద మంగళవారం సాయంత్రం బాంబు దాడికి తెగబడ్డారు. పోలీసుల ప్రకారం.. భద్రత సిబ్బందిని టార్గెట్‌గా చేసుకుని దాడి చేసినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదుల బాంబు దాడితో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా భయానకంగా మారిపోయింది. అక్కడి ప్రజలంతా భయంతో పరుగులు తీశారు. గ్రెనేడ్ దాడిలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒక భద్రత సిబ్బంది, ఇద్దరు మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, సమాచారం అందుకున్న అధికారులు ఘటన స్థలానికి భారీ ఎత్తున బలగాలను మోహరించారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యంకోసం ఆసుపత్రికి తరలించారు. భద్రత అధికారులు ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో ఏవైన పేలుడు పదార్థాలు ఉన్నాయా.. అన్న కోణంలో పరిశీలిస్తున్నారు. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, రిపబ్లిక్‌డే వేడుకలకు ఒక రోజు ముందు ఉగ్రవాదుల గ్రెనేడ్ దాడి ప్రస్తుతం తీవ్ర కలకలంగా మారింది. కాగా, ప్రస్తుతం ఈ ఘటనపై అధికారులు అన్నికోణాల్లో దర్యాప్తు చేపట్టారు. Jammu & Kashmir | Grenade attack at Hari Singh High Street in Srinagar Details awaited. pic.twitter.com/ioU2AQABgh — ANI (@ANI) January 25, 2022 చదవండి: రైతుకు ఘోర అవమానం.. స్పందించిన ఆనంద్ మహీంద్రా -
సీఆర్పీఎఫ్ శిబిరంపై గ్రనేడ్ దాడి
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలో సీఆర్పీఎఫ్ శిబిరంపై గుర్తుతెలియని ఉగ్రవాదులు శుక్రవారం గ్రనేడ్ దాడికి పాల్పడ్డారు. చదూర ప్రాంతంలో బైక్‌పై వచ్చిన ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్ పోస్ట్‌పై గ్రనేడ్ విసిరారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం లేదని, ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు పేర్కొన్నారు. గ్రనేడ్ దాడితో అప్రమత్తమైన భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నాయి. గ్రనేడ్ దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. దూనివారి చదూరలోని సీఆర్పీఎఫ్ క్యాంప్‌పై ఉగ్రవాదులు గ్రనేడ్ విసిరారని దాడికి పాల్పడిన వారి కోసం గాలిస్తున్నామని బుద్గాం ఎస్పీ పేర్కొన్నారు. చదవండి : గ్రనేడ్ దాడిలో ఇద్దరు జవాన్ల మృతి -
గ్రనేడ్ దాడిలో ఇద్దరు జవాన్ల మృతి
-
గ్రనేడ్ దాడిలో ఇద్దరు జవాన్ల మృతి
సాక్షి, న్యూఢిల్లీ : శ్రీనగర్‌లో భద్రతా దళాలపై ఆదివారం ఉగ్రవాదులు జరిపిన గ్రనేడ్ దాడిలో ఇద్దరు సీఆర్పీఎఫ్ సిబ్బంది మరణించగా, ఇద్దరు పౌరులు గాయపడ్డారు. లాల్‌చౌక్‌లోని ప్రతాప్ పార్క్ వద్ద విధులు నిర్వహిస్తున్న భద్రతా దళాలపై టెర్రరిస్టులు గ్రనేడ్లు విసిరారు. ఉగ్ర దాడితో అప్రమత్తమైన భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నాయి. ఉగ్ర ఘటనపై విచారణను చేపట్టాయి. గ్రనేడ్ దాడికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రాథమిక దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. చదవండి : జైషే మహ్మద్ కుట్ర భగ్నం -
కశ్మీర్లో గ్రనేడ్ దాడి : 15 మందికి పైగా గాయాలు
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సొపోర్‌లోని ఓ బస్‌స్టాండ్‌లో టెర్రరిస్టుల గ్రనేడ్ దాడిలో 15 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిని శ్రీనగర్‌కు తరలించారు. గ్రనేడ్ దాడితో అప్రమత్తమైన భద్రతా దళాలు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. సొపోర్‌లోని హోటల్ ప్లాజా వద్ద సోమవారం సాయంత్రం 4.15 గంటల ప్రాంతంలో గ్రనేడ్ పేలుడు సంభవించింది. ఈ దాడిలో ముగ్గురు వ్యక్తులకు తీవ్రగాయాలు కాగా, మిగిలిన వారి పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం. పేలుడు జరిగిన ప్రాంతాన్ని సీఆర్పీఎఫ్ దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. -
జమ్మూ పేలుడు : నిందితుడికి హిజ్బుల్ సాయం
శ్రీనగర్ : జమ్మూ బస్‌స్టాండ్‌లోని ఓ బస్సుపై జరిగిన గ్రనేడ్ దాడిలో అరెస్ట్ అయిన అనుమానితుడు యాసిర్ భట్‌కు నిషేధిత ఉగ్ర సంస్థ హిజ్బుల్ ముజహిదిన్ రూ 50,000 ఇచ్చినట్టు వెల్లడైంది. గురువారం జరిగిన ఈ దాడిలో ఇద్దరు మరణించగా, 30 మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే. కుల్గాం జిల్లాకు చెందిన అనుమానితుడు యాసిర్ భట్‌ను కశ్మీర్లోకి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా జమ్మూ నగరం వెలుపల నాగ్రోటా టో్‌ల్‌ప్లాజా వద్ద అరెస్ట్ చేశారు. నిందితుడి ఆధార్ కార్డు, స్కూల్ రికార్డులను పరిశీలించగా 16 ఏళ్ల మైనర్‌గా వెల్లడైందని పోలీసులు చెబుతున్నారు. తొమ్మిదవ తరగతి చదువుతున్న నిందితుడి తండ్రి వృత్తిరీత్యా పెయింటర్. కాగా యాసిర్ భట్‌ను ఈ దాడికి ప్రేరేపించేందుకు హిజ్బుల్ ముజహిదీన్‌కు చెందిన ముజమిల్ అనే అజ్ఞాత సానుభూతిపరుడు రూ 50,000 చెల్లించడంతో పాటు గ్రనేడ్‌ను సమకూర్చాడని నిందితుడు వెల్లడించినట్టు సమాచారం. వాస్తవంగా గ్రనేడ్ దాడిని ముజమిల్‌కు హిజ్బుల్ జిల్లా కమాండర్ ఫయాజ్ భట్ అప్పగించగా ఈ దాడిని చేపట్టంలో ముజమిల్ విఫలమయ్యాడని నిందితుడు విచారణలో భాగంగా తెలిపినట్టు పోలీసులు వెల్లడించారు. -
సైనికుడి ముఖం నుంచి గ్రనేడ్ తొలగించిన వైద్యులు!
అనుకోకుండా జరిగిన ప్రమాదంలో ఓ సైనికుడి ముఖంలోకి లైవ్ గ్రనేడ్ చొచ్చుకుపోయింది. వెంటనే అప్రమత్తమైన వైద్యులు తక్షణ వైద్యం అందించి అతడ్ని ప్రాణాలతో కాపాడటంతోపాటు, ముఖంలోకి చొచ్చుకు పోయిన లైవ్ గ్రనేడ్‌ను విజయవంతంగా బయటకు తీశారు. బాధితుడి ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం కలగకుండా గ్రనేడ్‌ను ముఖం నుంచి తొలగించి సఫలమయ్యారు. ఇందుకోసం కొలంబియా సర్జన్లు గంటల తరబడి కష్టపడ్డారు. ఆపరేషన్ కోసం సంఘటన స్థలం నుంచీ సైనికుడిని బొగోటా మిలటరీ ఆస్పత్రికి అంబులెన్స్ ద్వారా తరలించారు. ఇలా తరలించేందుకు దాదాపు 8 గంటల సమయం పట్టింది. అత్యవసర పరిస్థితుల్లో హెలికాప్టర్ ద్వారా తరలించాల్సిన బాధితుడిని, అతడి ముఖంలో ఉన్న గ్రనేడ్ పేలే ప్రమాదం ఉండటంతో ఆలస్యం అయినా రోడ్డు మార్గంలోనే తరలించాల్సి వచ్చిందని వైద్యాధికారులు తెలిపారు. ప్రమాద పరిస్థితుల్లో అప్రమత్తమై అత్యవసర చికిత్స అందించాల్సి ఉండగా... అతడి పరిస్థితిని బట్టి అలా జరగలేదని, ఆస్పత్రి సర్జన్ల సూచనల మేరకు వైద్యులంతా కష్టపడి ఆపరేషన్ చేయడంతో పేషెంట్ కోలుకున్నాడని ఆస్పత్రి చీఫ్ సర్జన్ ఓ ప్రకటనలో తెలిపారు. సదరు సైనికుడు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు లాంచర్ యాక్టివేట్ అవ్వడంతో గ్రనేడ్ అతడి కుడి దవడలోకి దూసుకుపోయిందని అధికారులు తెలిపారు.