Ukraine Army Doctor Removed Live Grenade From Soldier Chest, Saved His Life - Sakshi
Sakshi News home page

ఛాతీలో లైవ్‌ గ్రనేడ్‌.. ఏమాత్రం తేడాలొచ్చినా అంతే! కానీ.. ఎలా కాపాడావయ్యా?!

Published Wed, Jan 11 2023 4:56 PM | Last Updated on Wed, Jan 11 2023 7:28 PM

Ukraine Army Doc Saved Soldier Life Remove Live Grenade  - Sakshi

కీవ్‌: తమపై దురాక్రమణలో రష్యా బలగాల అకృత్యాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందని ఉక్రెయిన్‌ వాపోతోంది. ఏడాదికి సమయం దగ్గరపడుతున్నా.. ప్రాణ, ఆస్తి నష్టం కొనసాగుతుండడం యావత్‌ ప్రపంచాన్ని కలవరపాటుకు గురి చేస్తోంది. ఈ క్రమంలో ఉక్రెయిన్‌ ఆర్మీ  డాక్టర్‌ ఒకాయన చేసిన పని సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. లైవ్‌ గ్రనేడ్‌ ఒకటి ఓ సైనికుడి ఛాతీలో ఇరక్కుపోవడంతో..  ఆయన చాకచక్యంగా వ్యవహరించి దానిని బయటకు తీశాడు. 

ఉక్రెయిన్‌ యుద్ధంలో భాగంగా.. బక్‌ముట్‌ వద్ద భీకర పోరాటం జరుగుతోంది. ఆ సమయంలో  వీవోజీ గ్రనేడ్‌ లాంఛర్‌ ద్వారా దూసుకెళ్లాల్సిన ఓ లైవ్‌ గ్రనేడ్‌.. సైనికుడి ఛాతీలోకి వెళ్లిందట. అది ఏ క్షణమైనా అది పేలి అతను చనిపోవచ్చు. ఆ టైంలో మేజర్‌ జనరల్‌ డాక్టర్‌ అండ్రి విల్లో, సర్జరీకి దిగారు.  తన ప్రాణాలకు తెగించి మరీ ఆపరేషన్‌ చేసి దానిని తొలగించి అతని పాలిట దేవుడిగా నిలిచాడు.

ఆ డేరింగ్‌ ఆపరేషన్‌ను ఆయన ఇద్దరు సైనికుల సహకారంతో నిర్వర్తించడం విశేషం. వీవోజీ గ్రనేడ్‌ బాడీలోకి వెళ్లాక ఏమాత్రం చెదరలేదట. ఛాతీలో అలాగే చిక్కుకుపోయిందట. ఏమాత్రం పొరపాటు జరిగినా అది పేలిపోయి ఆ సైనికుడు ముక్కలు ముక్కలు అయిపోతాడు. అతనితో పాటు సర్జరీకి దిగిన వైద్యుడు కూడా హరీమంటాడు. ఆ సమయంలో ఎలెక్ట్రో కోగ్యులేషన్‌ చర్యకు దిగి ఉంటే.. కచ్చితంగా ఆ గ్రనేడ్‌ పేలిపోయేది. కానీ, మేజర్‌ ఆండ్రి విల్లో ఆ పని చేయలేదు. సర్జరీని విజయవంతంగా పూర్తి చేసి.. ఆ సైనికుడి ప్రాణాలు నిలబెట్టాడు. ఈ విషయాన్ని ఉక్రెయిన్‌ సైన్యం ధృవీకరించింది కూడా. 

అయితే సైనికుడి ఛాతీలోకి ఆ గ్రనేడ్‌ ఎలా వెళ్లిందనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఎక్స్‌రే ద్వారా ఛాతీలో గ్రనేడ్‌ ఇరుక్కున ఫొటో, ఆపరేషన్‌ చేశాక ఆ గ్రనేడ్‌ను తొలగించిన ఫొటోలను మాత్రం రిలీజ్‌ చేసింది ఉక్రెయిన్‌ సైన్యం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement