
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలో సీఆర్‌పీఎఫ్ శిబిరంపై గుర్తుతెలియని ఉగ్రవాదులు శుక్రవారం గ్రనేడ్ దాడికి పాల్పడ్డారు. చదూర ప్రాంతంలో బైక్‌పై వచ్చిన ఉగ్రవాదులు సీఆర్‌పీఎఫ్ పోస్ట్‌పై గ్రనేడ్ విసిరారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం లేదని, ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు పేర్కొన్నారు. గ్రనేడ్ దాడితో అప్రమత్తమైన భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నాయి. గ్రనేడ్ దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. దూనివారి చదూరలోని సీఆర్‌పీఎఫ్ క్యాంప్‌పై ఉగ్రవాదులు గ్రనేడ్ విసిరారని దాడికి పాల్పడిన వారి కోసం గాలిస్తున్నామని బుద్గాం ఎస్పీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment