Amritsar: ఆలయంపై గ్రనేడ్‌ విసిరిన వ్యక్తి ఎన్‌కౌంటర్‌ | Who Carried Out Grenade Attack on Temple in Amritsar was killed in an Encounter | Sakshi
Sakshi News home page

Amritsar: ఆలయంపై గ్రనేడ్‌ విసిరిన వ్యక్తి ఎన్‌కౌంటర్‌

Published Mon, Mar 17 2025 1:24 PM | Last Updated on Mon, Mar 17 2025 1:24 PM

Who Carried Out Grenade Attack on Temple in Amritsar was killed in an Encounter

అమృత్‌సర్‌: పంజాబ్‌లోని అమృత్‌సర్‌(Amritsar) జిల్లాలో ఠాకుర్‌ద్వారా ఆలయంపై గ్రనేడ్‌తో దాడి చేసిన ఇద్దరు యువకులలో ఒకరిని పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. పంజాబ్‌ పోలీసులకు నిందితుల స్థావరానికి సంబంధించిన సమాచారం  అందగానే వారు రంగంలోకి దిగారు. ఘటన జరిగిన 24 గంటల్లో ఒక నిందితుడిని ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు.

ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన వివరాలను డీజీపీ గౌరవ్‌ యాదవ్‌ మీడియాకు తెలియజేశారు. నిఘా వర్గాల(Intelligence agencies) నుంచి అందిన సమాచారం మేరకు అమృత్‌సర్‌ పోలీసులు ఘటన జరిగిన అనంతరం నిందితులను ట్రాక్‌ చేస్తూ వచ్చారన్నారు. ఈ నేపధ్యంలోనే వారిని గుర్తించగలిగారని, వారు రాజాసాంసీలో ప్రాంతంలో ఉన్నారని తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారని, వారిని చూడగానే నిందితులు తుపాకీతో కాల్పులు జరిపారన్నారు. ఈ ఘటనలో హెడ్‌ కానిస్టేబుల్‌ గురుప్రీత్‌ సింగ్‌కు గాయాలయ్యారన్నారు.
 

ఆత్మరణక్షణకు పోలీసులు(Police) ఎదురు కాల్పులు జరిపారని ఈ నేపధ్యంలో ఒక నిందితునికి గాయాలయ్యాయని, అతనిని ఆస్పత్రికి తరలించామని, అక్కడ అతను మృతిచెందాడని గౌరవ్‌ యాదవ్‌ తెలిపారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడన్నారు. అతనిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారన్నారు.

ఇది కూడా చదవండి: రాజధానిలో మహిళల రక్షణకు యాంటీ ఈవ్‌ టీజింగ్‌ స్క్వాడ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement