
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సొపోర్‌లోని ఓ బస్‌స్టాండ్‌లో టెర్రరిస్టుల గ్రనేడ్ దాడిలో 15 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిని శ్రీనగర్‌కు తరలించారు. గ్రనేడ్ దాడితో అప్రమత్తమైన భద్రతా దళాలు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. సొపోర్‌లోని హోటల్ ప్లాజా వద్ద సోమవారం సాయంత్రం 4.15 గంటల ప్రాంతంలో గ్రనేడ్ పేలుడు సంభవించింది. ఈ దాడిలో ముగ్గురు వ్యక్తులకు తీవ్రగాయాలు కాగా, మిగిలిన వారి పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం. పేలుడు జరిగిన ప్రాంతాన్ని సీఆర్‌పీఎఫ్ దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment