శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్‌లో గురువారం తెల్లవారుజామున ఎదురుకాల్పులు జరిగాయి. కథోహలెన్ ప్రాంతంలో ఉగ్రవాదికి భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరిగాయని సైన్యం తెలిపింది. భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమైనట్లు సమాచారం.
ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టిఆర్‌ఎఫ్)తో ఉగ్రవాది అనుబంధం కలిగి ఉన్నాడని అధికారులు తెలిపారు. హతమైన ఉగ్రవాదిని మైజర్ అహ్మద్ దార్‌గా గుర్తించినట్లు పేర్కొన్నారు. మరో ఘటనలో అంతర్జాతీయ సరిహద్దు వెంట పాక్ కాల్పుల విరమణను ఉల్లంఘించింది. రామ్‌ఘర్ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ఓ బీఎస్‌ఎఫ్ జవాను మృతి చెందాడు.
కశ్మీర్‌లోయలో అక్టోబర్ 30 నుంచి జరిగిన మూడు వరుస కాల్పుల ఘటనలకు పాల్పడిన ఉగ్రవాదుల జాడ తెలిపిన వారికి రూ.10 లక్షలను ఇస్తామని జమ్ముకశ్మీర్ పోలీసులు ప్రకటించారు. అక్టోబర్ 29న పోలీసు ఇన్‌స్పెక్టర్ మసూర్ అలీ వాని క్రికెట్ ఆడుతుండగా ఓ దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. మరుసటి రోజు యూపీ నుంచి వలసవచ్చిన కూలీ ముఖేష్ కుమార్‌ను దుండగులు కాల్చి చంపారు. ఆ మరుసటి రోజే హెడ్ కానిస్టేబుల్ గులామ్ మహ్మద్‌ని కాల్పి చంపారు.
ఇదీ చదవండి: దారుణం: 150సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయని భార్య.. అనుమానంతో 230 కి.మీ. వెళ్లి మరీ..
Comments
Please login to add a commentAdd a comment