Shopian encounter
-
జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్.. ఉగ్రవాది హతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్‌లో గురువారం తెల్లవారుజామున ఎదురుకాల్పులు జరిగాయి. కథోహలెన్ ప్రాంతంలో ఉగ్రవాదికి భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరిగాయని సైన్యం తెలిపింది. భద్రతా బలగాలతో జరిగిన ఎన్కౌంటర్లో ఓ ఉగ్రవాది హతమైనట్లు సమాచారం. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టిఆర్ఎఫ్)తో ఉగ్రవాది అనుబంధం కలిగి ఉన్నాడని అధికారులు తెలిపారు. హతమైన ఉగ్రవాదిని మైజర్ అహ్మద్ దార్గా గుర్తించినట్లు పేర్కొన్నారు. మరో ఘటనలో అంతర్జాతీయ సరిహద్దు వెంట పాక్ కాల్పుల విరమణను ఉల్లంఘించింది. రామ్‌ఘర్ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ఓ బీఎస్ఎఫ్ జవాను మృతి చెందాడు. కశ్మీర్‌లోయలో అక్టోబర్ 30 నుంచి జరిగిన మూడు వరుస కాల్పుల ఘటనలకు పాల్పడిన ఉగ్రవాదుల జాడ తెలిపిన వారికి రూ.10 లక్షలను ఇస్తామని జమ్ముకశ్మీర్ పోలీసులు ప్రకటించారు. అక్టోబర్ 29న పోలీసు ఇన్స్పెక్టర్ మసూర్ అలీ వాని క్రికెట్ ఆడుతుండగా ఓ దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. మరుసటి రోజు యూపీ నుంచి వలసవచ్చిన కూలీ ముఖేష్ కుమార్‌ను దుండగులు కాల్చి చంపారు. ఆ మరుసటి రోజే హెడ్ కానిస్టేబుల్ గులామ్ మహ్మద్‌ని కాల్పి చంపారు. ఇదీ చదవండి: దారుణం: 150సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయని భార్య.. అనుమానంతో 230 కి.మీ. వెళ్లి మరీ.. -
20 లక్షల కోసం ఆర్మీ కెప్టెన్ దురాగతం
శ్రీనగర్: గత ఏడాది జూలై 18న కశ్మీర్‌లోని అంషిపొరాలో జరిగిన ఎన్‌కౌంటర్‌పై సిట్ దర్యాప్తులో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగుచూశాయి. నగదు రివార్డు రూ.20 లక్షల కోసం ఆశపడిన 62–రాష్ట్రీయ రైఫిల్స్ రెజిమెంట్ కెప్టెన్ భూపేందర్ సింగ్ ముగ్గురు అమాయకులను బూటకపు ఎన్కౌంటర్లో చంపేసినట్లు తేలింది. ఈ ఘటనలో అతడికి ఇద్దరు స్థానికులు సాయపడినట్లు కూడా సిట్ గుర్తించింది. ఈ మేరకు 300 పేజీల చార్జిషీటును షోపియాన్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ సికందర్ అజామ్‌కు గత డిసెంబర్ 26న సమర్పించింది. ఇన్ఫార్మర్లుగా పనిచేస్తున్న షోపియాన్‌కు చెందిన తబిష్ నాజిర్, పుల్వామా వాసి బిలాల్ అహ్మద్‌లతో కలిసి కెప్టెన్ భూపేందర్ సింగ్ పథకం వేశాడు. ఉగ్రవాదులు సంచరిస్తున్నారంటూ మరో నలుగురు జవాన్లను తీసుకుని అంషిపొరా వెళ్లారు. నలుగురు జవాన్లు కార్డాన్ సెర్చ్ చేపడుతున్న సమయంలో తుపాకీ కాల్పుల శబ్దం వారికి వినిపించింది. ఆ ఉగ్రవాదులు తప్పించుకునేందుకు ప్రయత్నించగా కాల్చినట్లు అనంతరం సింగ్ వారితో నమ్మబలికాడు. ముగ్గురినీ కాల్చి చంపిన అనంతరం వారిని గుర్తు పట్టకుండా చేసి, ఆయుధాలు ఉంచాడు. మృతులు అబ్రార్ అహ్మద్(25), ఇంతియాజ్ అహ్మద్(20), మొహమ్మద్ ఇబ్రార్(16)ల ఫొటోలు ఆన్లైన్లో వైరల్ అయ్యాయి. ఆపిల్ తోటల్లో పనిచేసేందుకు వచ్చిన కూలీలుగా వారిని గుర్తించారు. ఖననం చేసిన మృతదేహాలను అక్టోబర్ 3వ తేదీన కుటుంబసభ్యులకు అందజేశారు. తీవ్ర ఆరోపణల నేపథ్యంలో ఆర్మీ కోర్ట్ ఆఫ్ ఎంక్వయిరీ చేపట్టింది. దీనిపై ఏర్పాటైన సిట్ 75 మందిని ప్రశ్నించింది. అనుమానితుల కాల్ రికార్డును పరిశీలించింది. నగదు రివార్డు కోసమే భూపేందర్ సింగ్, స్థానిక ఇన్ఫార్మర్లు కలిసి ఈ దారుణానికి పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇందుకు గాను వారికి కొన్ని వేల రూపాయలు ముట్టినట్లు కూడా తేలింది. రూ.20 లక్షల రివార్డు కోసం తమ అధికారి బూటకపు ఎన్‌కౌంటర్‌కు పాల్పడినట్లు వస్తున్న వార్తలపై సైన్యం స్పందించింది. అవి సైనిక వ్యవస్థలోని వాస్తవాల ఆధారంగా వస్తున్న వార్తలు కావని పేర్కొంది. ‘యుద్ధ క్షేత్రంలో గానీ, ఇతర విధుల్లో గానీ పాల్గొన్న అధికారులు, సిబ్బందికి ఎటువంటి నగదు రివార్డులు అందజేసే విధానం లేదని శ్రీనగర్‌లోని రక్షణ శాఖ ప్రతినిధి కల్నల్ రాజేశ్ కాలియా తెలిపారు. -
షోపియాన్ ఎన్‌కౌంటర్‌పై ఆర్మీ సీరియస్
శ్రీనగర్ : కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లా అంశీపుర గ్రామంలో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని ఉల్లంఘించి, జూలై 18న ఎన్కౌంటర్లో ముగ్గురు పౌరులను కాల్చి చంపి, మిలిటెంట్లను చంపినట్లు సైన్యం ప్రకటించడం వివాదాస్పదంగా మారింది. సామాజిక మాధ్యమాల్లో వార్తలు వెల్లువెత్తడంతో సైన్యం దీనిపై విచారణ చేపట్టింది. లెఫ్టినెంట్ జనరల్ డీఎస్ రాజు నేతృత్వంలో విచారణ సాగింది. దీంతో సైనికులు చంపింది సాధారణ పౌరులనే అనడానికి ఆధారాలు దొరికాయని సైనిక ప్రతినిధి కల్నల్ రాజేష్ కాలియా చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశించినట్లు సైన్యం పాటించాల్సిన నియమాలు ఉల్లంఘనకు గురయ్యాయని సైనికాధికారులు తెలిపారు. బాధ్యులైన వారిపై ఆయుధ చట్టం కింద క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సంబంధిత క్రమశిక్షణాధికారి ఆదేశాలిచ్చారు. నిబంధనల ప్రకారం తప్పు చేసిన సైనికాధికారులపై, త్వరలోనే కోర్టు మార్షల్ ప్రొసీడింగ్స్ ప్రారంభం అవుతాయి. (మోదీకి బర్త్‌డే గిఫ్ట్‌గా ఇవి కావాలట!) -
జమ్మూ కశ్మీర్లో ఐదుగురు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్ : భద్రతా బలగాల కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ సంఘటన జమ్మూకశ్మీర్‌లోని షోషియాన్ జిల్లాలోని కిలోరా గ్రామంలో చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టగా, శనివారం జరిగిన కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమైనట్లు సైనికాధికారులు తెలిపారు. దీంతో నిన్నటి నుంచి జరుగుతున్న ఎదురుకాల్పుల్లో మృతి చెందిన ఉగ్రవాదుల సంఖ్య ఐదుకు చేరింది. ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందడంతో కిలోరా గ్రామంలో భద్రతాబలగాలు గాలింపు చేపట్టాయి. అయితే ముష్కరులు కాల్పులకు దిగడంతో ఈ ఎన్కౌంటర్ చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. శుక్రవారం రాత్రి మట్టుబెట్టిన ఉగ్రవాదిని లష్కరే తోయిబాకు చెందిన ఉమర్‌మాలిక్‌గా గుర్తించారు. ఘటనాస్థలిలో ఏకే 47ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా ఇంట్లోకి ప్రవేశించాలని చూసిన ఓ ఆగంతకున్ని బటిండిలో భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. -
జమ్మూకశ్మీర్ సోఫియాన్‌లో ఎన్కౌంటర్