
శ్రీనగర్ : భారత్, పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు సమసిపోయినా ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎన్‌కౌంటర్లు కొనసాగుతున్నాయి. సరిహద్దు వెంబడి కాల్పుల విరమణ ఉల్లంఘనతో పాక్ దళాలు కవ్వింపు చర్యలకు దిగుతున్నాయి. దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో మంగళవారం ఉదయం ఉగ్రవాదులు తలదాచుకున్న ఇంటిపై భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. గంటకు పైగా కాల్పులు జరిగాయని, ఉగ్రవాది తలదాచుకున్న గృహాన్ని భద్రతాదళాలు పేల్చివేశాయని అధికారులు వెల్లడించారు.
పుల్వామా జిల్లాలోని త్రాల్‌లో ఓ ఇంటిలో ఇద్దరు ఉగ్రవాదులు దాక్కున్నారని అందిన సమాచారంతో భద్రతా దళాలు మంగళవారం తెల్లవారుజామున ఇంటిని చుట్టుముట్టాయి. భద్రతా దళాల దాడిలో ఓ ఉగ్రవాది మరణించగా మరో టెర్రరిస్ట్ కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం కాల్పులు నిలిచిపోయాయని, ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment