ఫైల్ ఫోటో
బాగ్దాద్ : ఇరాక్‌పై ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పశ్చిమ బాగ్దాద్‌లోని ఇరాక్ ఆర్మీ స్థావరంపై సాయుధులైన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో11 మంది పౌరులు మరణించారు. సైన్యం సహా మొత్తం 8మంది గాయాలపాలయ్యారని పోలీసు, వైద్య వర్గాల నుంచి సమాచారం. అల్-రద్వానియా ప్రాంతంలోని ఆర్మీ స్థావరంపై జరిగిన దాడిలో దుండగులు గ్రేనెడ్, అధునాతన ఆయుధాలను వాడినట్టు తెలుస్తోంది. ఈ దాడి పాల్పడిన ఉగ్రవాదులు నాలుగు వాహనాల్లో వచ్చారని తెలుస్తోంది.
ఉగ్రదాడిపై స్పందించిన ‘ఇరాక్ మిలిటరీ దాడి జరిగింది. ప్రభుత‍్వ మద్దతు ఉన్న సున్నీ మిలిషియా ఆర్మీపైనా అని ఇందులో నలుగురు మరణించారు. ముగ్గురు గాయపడ్డార’ని అధికార వర్గాలు తెలిపాయి. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం ఆర్మీ, పోలీసు బృందాలు అపరేషన్ మొదలెట్టినట్టు పోలీసు వర్గాల సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment