ఇరాక్‌ ప్రధాని నివాసంపై డ్రోన్‌ దాడి | Drone Attack targets Iraq Pm, Who Escapes Unhurt: Iraq Military | Sakshi
Sakshi News home page

Iraq Pm: ఇరాక్‌ ప్రధాని ముస్తఫా అల్‌ కధిమి నివాసంపై డ్రోన్‌ దాడి

Published Sun, Nov 7 2021 7:40 AM | Last Updated on Sun, Nov 7 2021 8:07 AM

Drone Attack targets Iraq Pm, Who Escapes Unhurt: Iraq Military - Sakshi

బాగ్దాద్‌: ఇరాక్‌ ప్రధాని ముస్తఫా అల్‌ కధిమి నివాసంపై డ్రోన్‌ దాడి జరిగింది. పేలుడు పదార్థాలతో కూడిన డ్రోన్‌ ఆదివారం తెల్లవారుజామున బాగ్దాద్‌లోని ప్రధాని నివాసాన్ని లక్ష్యంగా చేసుకొని దాడి చేసింది. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ఇరాక్‌ ప్రధాని కధిమి ఈ డ్రోన్‌ దాడి నుంచి తప్పించుకున్నారు. ఇరాక్‌ మిలటరీ దీన్ని హత్యాప్రయత్నమని పేర్కొంది.

బాగ్దాద్‌లోని పటిష్టమైన గ్రీన్‌జోన్‌లో ఉన్న కధిమి నివాసమే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు ఇరాక్‌ మిలిటరీ ఓ ప్రకటనలో తెలిపింది. 'నేను క్షేమంగా ఉన్నాను, అంతా ప్రశాంతంగా ఉండాలని' కధిమి తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు దాడికి తామే బాధ్యులమని ఏ సంస్థ ప్రకటించలేదు. 

చదవండి: (పునీత్‌ రాజ్‌కుమార్‌కు మొదట వైద్యం చేసిన డాక్టర్‌ ఇంటికి భారీ బందోబస్తు) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement