ఇస్లామాబాద్ : మాజీ క్రికెటర్, పాకిస్తాన్ తెహ్రీక్ ఇ- ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ సహా పలువురు ప్రముఖులపై జులై 25న జరగనున్న పాక్ సార్వత్రిక ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ఉగ్రవాదులు దాడులకు తెగబడవచ్చని నేషనల్ కౌంటర్ టెర్రరిజం అథారిటీ (నాక్టా) హెచ్చరించింది. ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉన్న జాబితాలో ఇమ్రాన్ ఖాన్‌తో పాటు అవామీ నేషనల్ పార్టీ అధ్యక్షుడు అఫ్సన్‌దర్ వలి, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ కుమారుడు, పాక్ సార్వత్రిక ఎన్నికల్లో తలపడుతున్న తల్హా సయీద్ తదితరలున్నారని నాక్టా వెల్లడించింది.
ఉగ్రవాదుల హిట్‌లిస్ట్‌లో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్‌కు చెందిన పలువురు నేతలు సైతం ఉన్నారని పేర్కొంది. ఈ మేరకు నాక్టా పాక్ దేశీయాంగ మంత్రిత్వ శాఖకు నివేదిక సమర్పించింది. ఉగ్రవాదుల హిట్ లిస్ట్‌లో ఉన్న నేతలందరికీ కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని మంత్రిత్వ శాఖకు నాక్టా చీఫ్ రెహమాన్ మాలిక్ సూచించినట్టు పాక్ పత్రిక డాన్ న్యూస్ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment