hit list
-
తమిళ డైరెక్టర్ కొడుకు హీరోగా ‘ హిట్ లిస్ట్’
తమిళ స్టార్ డైరెక్టర్ విక్రమన్ కొడుకు విజయ్ కనిష్క హీరోగా నటించిన చిత్రం ‘హిట్ లిస్ట్’. సముద్రఖని, శరత్ కుమార్, గౌతమ్ వాసుదేవ మీనన్ ముఖ్యపాత్రలు పోషించారు. సూర్య కతిర్ కాకల్లార్, కే. కార్తికేయన్ దర్శకత్వంలో ఆర్. కె. సెల్యులాయిడ్స్ పై డైరెక్టర్ కె. ఎస్. రవికుమార్ గారు నిర్మిస్తున్న సినిమా. గతంలో ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమా పైన అంచనాలను పెంచగా. నేడు ఈ సినిమాకి సంబంధించిన టీజర్ వెర్సటైల్ హీరో సూర్య చేతుల మీదగా లాంచ్ చేశారు.యాక్షన్, సస్పెన్స్, క్రైమ్ జోనర్ లో వస్తున్న ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదలై ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. కాగా నేడు ఈ సినిమా సంబంధించిన ట్రైలర్ లాంచ్ మరియు ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా శ్రీ మురళీమోహన్ గారు, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు విచ్చేశారు. వీరితోపాటు నిర్మాత, దర్శకుడు కె. ఎస్. రవికుమార్ గారు, హీరో విజయ్ కనిష్క, దర్శకులు సూర్య కతిర్ కాకల్లార్, కే. కార్తికేయన్, తెలుగు రిలీజ్ నిర్మాతలు శ్రీనివాస్ గౌడ్ గారు మరియు బెక్కం రవీంద్ర గారు పాల్గొన్నారు.శ్రీ మురళీమోహన్ గారు మాట్లాడుతూ : హీరో విజయ్ కనిష్క నాన్నగారు విక్రమన్ గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉండి మొదటి సినిమా అయినా చాలా అద్భుతంగా నటించాడు. నాకు బాగా సన్నిహితుడు కె. ఎస్. రవికుమార్ గారు ఈ సినిమాకి నిర్మాతక వ్యవహరించడం మంచి విషయం. ట్రైలర్ చాలా బాగుంది సినిమా ఖచ్చితంగా మన సక్సెస్ అవ్వాలని అవుతుందని కోరుకుంటున్నాను అన్నారు.తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు మాట్లాడుతూ : నన్ను ఈ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు కె. ఎస్. రవికుమార్ గారికి టీం కి నా అభినందనలు తెలుపుతున్నాను. మంచి నిర్మాత దర్శకులు కె. ఎస్. రవికుమార్ గారు. విజయ్ కనిష్కకి ఈ సినిమా మంచి విజయం అవుతుందని టీమ్ అందరికీ మంచి సక్సెస్ అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు. మే 31న ఈ చిత్రం విడుదల కానుంది. -
'హిట్ లిస్ట్' ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన సూర్య
దర్శక నటుడు కేఎస్.రవికుమార్ నిర్మిస్తున్న మూడో చిత్రం హిట్‌లిస్ట్. ఈ సంస్థలో ఇంతకు ముందు కమలహాసన్ 'తెనాలి', ఈ మధ్య 'గూగుల్ కుట్టప్పా' అనే సినిమాల్ని నిర్మించారు. తాజాగా 'హిట్‌లిస్ట్' పేరుతో మూవీ చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు విక్రమన్ వారసుడు విజయ్ కినిష్కాను హీరోగా పరిచయం చేస్తున్నారు. సూర్య కథీర్, కే. కార్తీకేయన్ కలిసి దర్శకత్వం వహిస్తున్నారు. శరత్ కుమార్, కేఎస్ రవికుమార్, గౌతమ్‌మీనన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.(ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరో నాగచైతన్య తల్లి!)నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. ట్రైలర్ ఇటీవలే విడుదలై మంచి స్పందనను తెచ్చుకుందని, తాజాగా చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను నటుడు సూర్య ఆవిష్కరించి యూనిట్ వర్గాలకు శుభాకాంక్షలు అందించారు. అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా రెడీ చేశామని, త్వరలోనే థియేటర్లలో రిలీజ్ చేస్తామని నిర్మాత కేఎస్ రవికుమార్ చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: యాంకర్ శ్రీముఖికి త్వరలో పెళ్లి? రివీల్ చేసిన 'జబర్దస్త్' కమెడియన్) #I_Am_The_Danger first single from #HitList out now! 💥Song link - https://t.co/XxQoHVyKtpA @CSathyaOfficial Musical!@realsarathkumar @kanvikraman #RKCelluloids @ksravikumardir @menongautham @thondankani @smruthi_venkat @Aishwaryadutta6 @Abinakshatra @RIAZtheboss @V4umedia_ pic.twitter.com/8BTeyaGEzs— K.S.Ravikumar (@ksravikumardir) May 10, 2024 -
యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న 'హిట్ లిస్ట్'.. ఆసక్తి పెంచుతోన్న టీజర్!
దర్శకుడు కేఎస్ రవికుమార్ తన ఆర్కే సెల్యులాయిడ్స్ పతాకంపై నిర్మిస్తున్న తాజా చిత్రం 'హిట్ లిస్ట్'. నటుడు శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా దర్శకుడు విక్రమన్ వారసుడు విజయ్ కనిష్క హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మూవీకి రవికుమార్ శిష్యులు సూర్య, కార్తికేయన్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర టీజర్‌ను విజయ్ సేతుపతి చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ మేరకు చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. (ఇది చదవండి : ఆ కుటుంబం నుంచి కొత్త హీరో ఎంట్రీ.. ట్రైలర్ చూశారా?) పూర్తి యాక్షన్ ఎంటర్టైన్గా రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాత్మక కార్యక్రమాలను జరుపుకుంటోంది. టీజర్ చూస్తే ఇది మంచి యాక్షన్ ఓరియంటెడ్ కథా చిత్రంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ మూవీని త్వరలోనే తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర నిర్మాత కేఎస్ రవికుమార్ వెల్లడించారు. దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్, సముద్ర ఖని, మునీశ్కాంత్, నటి సితార, శతి వెంకట్, ఐశ్వర్య దత్త, బాలా సరవణన్, రెడిన్ కింగ్స్ లీ, అభినక్షత్ర, కేజీఎఫ్ చిత్రం ఫేమ్ గరుడ రామచంద్రా, అనుపమా కుమార్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సి. సత్య సంగీతాన్ని అందిస్తుండగా.. రాం చరణ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. (ఇది చదవండి : జబర్దస్త్ ఆర్టిస్ట్‌పై కేసు నమోదు) -
మావోల హిట్‌లిస్టులో ఎమ్మెల్యేలు.. టీఆర్ఎస్, బీజేపీ నేతలే టార్గెట్..!
సాక్షి , కరీంనగర్: ఒకప్పుడు మావోయిస్టు పార్టీకి కంచుకోటగా ఉన్న ఉమ్మడి కరీంనగర్లో రెండువారాలుగా కలకలం రేగుతోంది. మావో యిస్టు రాష్ట్ర కార్యదర్శి మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్, యాక్షన్ కమిటీ సభ్యుడు పాండు అలియాస్ మంగులు దళాలు ప్రవేశించాయని పోలీసులు అప్రమత్తమయ్యారు. గోదావరి నది దాటి వీరు పెద్దపల్లి జిల్లాలోనూ ప్రవేశించే ప్రమాదముందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో సోమవారం సీఎం పెద్దపల్లి పర్యటనలో ఆఖరు నిమిషాన రోడ్డు మార్గం వద్దని పోలీసులు కేసీఆర్‌ను ఆకాశమార్గం (హెలీక్యాప్టర్) ద్వారా రప్పించారు. 2005 తరువాత మావోయిస్టు పార్టీ పాత కరీంనగర్ జిల్లాలో దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. 2020 లాక్డౌన్ సమయంలో జిల్లాలో కార్యకలాపాలు సాగించేందుకు తిరిగి యత్నాలు ప్రారంభించింది. సిరిసిల్లలో ఓ కాంట్రాక్టరు వద్ద డబ్బులు వసూలు చేయడం, జగిత్యాలలోనూ రిక్రూట్మెంట్ కోసం ప్రయత్నించడం వంటి ఘటనలు వెలుగుచూశాయి. ఎక్కడికక్కడ అణిచివేత..! మావోలతో సంబంధాలున్న ఏ నెట్‌వర్క్‌నైనా ఉమ్మడి జిల్లా పోలీసులు ఎక్కడికక్కడ భగ్నం చేశారు. కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో గ్రానైట్ పరిశ్రమలలో పనిచేసే కొందరితో మావోలు కొంతకాలం రహస్య సంబంధాలు నెరిపారు. ఈ వ్యవహారంపై కన్నేసిన కరీంనగర్ సీపీ సత్యనారాయణ గంగాధర, చొప్పదండి, బావుపేట, హుస్నాబాద్‌లకు చెందిన పలువురిని అరెస్టు చేసి మావోల నెట్‌వర్క్‌ను తెంచారు. అలాగే.. జనశక్తి పేరిట కొందరు మాజీలు సిరిసిల్లలో కార్యకలాపాలకు పూనుకునేందుకు సిద్ధమైనా.. ఎస్పీ రాహుల్ హెగ్డే వీరిని ఆదిలోనే అణిచివేశారు. ఇదే జనశక్తికి చెందిన పలువురు ఆయుధాలతో జగిత్యాలలో సంచరిస్తుండగా.. ఎస్పీ సింధు శర్మ బృందం వీరిని అదుపులోకి తీసుకుంది. రామగుండం కమిషనరేట్ పరిధిలోని గోదావరి పరివాహక ప్రాంతంలో ఎలాంటి కదలికల్లేకుండా జాగ్రత్తపడుతున్నారు. సున్నిత ప్రాంతంగా పెద్దపల్లి జిల్లా.. తాజాగా పెద్దపల్లి జిల్లాలోని ఆర్ఎఫ్సీఎల్లో వెలుగుచూసిన కుంభకోణంలో మావోయిస్టు కార్యదర్శి వెంకటేశ్ పేరుతో విడుదలవుతున్న లేఖలపై పోలీసులు సీరియస్‌గా దృష్టి సారించారు. ఆ లేఖల్లో పలువురు నేతల పేర్లు ప్రస్తావించడంతో అవి ఎక్కడ నుంచి వచ్చాయన్న విషయంపై పోలీసులు కూపీ లాగుతున్నారు. అదే విధంగా మాజీ మావోలపైనా రహస్యంగా నిఘా కొనసాగిస్తున్నారు. ఈ లేఖలు తొలుత ఆగస్టు 25న, ఆ తరువాత 31న మావోయిస్టు పార్టీ జయశంకర్– మహబూబాబాద్– వరంగల్2– పెద్దపల్లి జిల్లాల డివిజన్ కమిటీ పేరుతో వచ్చాయి. తొలుత ఈ లేఖను కొందరు ఆకతాయిలు విడుదల చేశారని పోలీసులు భావించారు. కానీ.. వీటిని మావోయిస్టులే విడుదల చేశారని ఇటీవల పోలీసులు కూడా నిర్ధారించినట్లు సమాచారం. మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్ సరిహద్దులకు సమీపంలో ఉండటంతో ఈ ప్రాంతంలోని కొందరు నాయకులకు ముప్పు అధికంగా ఉందని, దీన్ని సున్నిత ప్రాంతంగా గుర్తించి ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. అనుమానితులు, కొత్త వ్యక్తుల సమాచారాన్ని నిరంతరం తెప్పించుకుంటున్నారు. జిల్లా సరిహద్దుల వద్ద సీసీ కెమెరాలు, ఇన్ఫార్మర్ల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు. చదవండి: Hyderabad: చూస్తుండగానే బాలుడిపైకి దూసుకెళ్లిన కారు.. భయానక దృశ్యాలు టీఆర్ఎస్, బీజేపీ నేతలే టార్గెట్..! విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీజేపీ నేతలను టార్గెట్‌గా చేసుకుని మావోలు దాడులకు పాల్పడతారన్న సమాచారం పోలీసుల వద్ద ఉంది. తద్వారా పాత జిల్లాలో తిరిగి ఉనికిని చాటుకోవాలన్నది మావోల వ్యూహమని పోలీసులు చెబుతున్నారు. దీంతో మావోల జాబితాలో ఉన్న సదరు నేతలను పోలీసులు ఇప్పటికే అప్రమత్తం చేశారు. తమకు సమాచారం ఇవ్వకుండా ఎక్కడా పర్యటించవద్దని స్పష్టంచేశారు. ముఖ్యంగా పెద్దపల్లి జిల్లా నేతలకు ముప్పు అధికంగా పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో నెట్వర్క్ నాశనమైందన్న ఆందోళనలో ఉన్న మావోలు దాన్ని పునరుద్ధరించుకోవాలన్నా.. పార్టీకి నిధులు సమకూర్చుకోవాలన్నా.. వారి ముందున్న ఏకైక మార్గం హింస. అందుకే.. పోలీసులు వీఐపీ నేతల రక్షణకు సంబంధించిన ప్రతీ అంశాన్ని చాలా పకడ్బందీగా పర్యవేక్షిస్తున్నారు. భద్రత విషయంలో చిన్న లోపమున్నా.. మావోలు హింసకు పాల్పడతారన్న సమాచారంతో అనునిత్యం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. -
లారెన్స్ బిష్ణోయ్ ముఠా హిట్ లిస్ట్‌లో కరణ్ జోహార్..
పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య బాలీవుడ్లో కలకలం రేపింది. ఈ మర్డర్‌ను గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా పనే అని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసులో అనేక మందిని అరెస్ట్ చేశారు. వీరిలో లారెన్స్ బిష్ణోయ్ అనుచరుడు సిద్ధేష్ కాంబ్లే కూడా ఉన్నాడు. అయితే సిద్ధేష్ను విచారించిన పోలీసులకు పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. హిందీ చిత్రపరిశ్రమలోని ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్‌ను కిడ్నాప్ చేయాలని ఈ ముఠా అనుకుందట. కరణ్ జోహార్‌ను అపహరించి ఆయన నుంచి రూ. 5 కోట్లకుపైగా డబ్బు రాబట్టాలని ప్లాన్ వేశారట. ప్రస్తుతం ఈ అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, ఆయన తండ్రి సలీమ్ ఖాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో సల్మాన్‌కు పోలీసులు భద్రత కూడా పెంచారు. ఇంతకుముందు కూడా 2018లో కృష్ణజింకను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్‌కు చంపేస్తామన్నా బెదిరింపులు వచ్చాయి. ఇదంతా చూస్తుంటే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాలీవుడ్‌ను టార్గెట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. చదవండి: 👇 రానున్న 'కాఫీ విత్ కరణ్' షో 7వ సీజన్.. టీజర్ రిలీజ్ మరో పెళ్లి చేసుకోబోతున్న సీనియర్ హీరో నరేష్ ! సినిమా సెట్లో ఇద్దరు నటులు మృతి.. ఆరుగురికి గాయాలు వికటించిన సర్జరీ.. గుర్తుపట్టలేని స్థితిలో హీరోయిన్ -
భారత్‌పై దావూద్ ఇబ్రహీం మళ్లీ గురి
న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మళ్లీ భారత్‌పై గురిపెట్టాడా? ప్రముఖ రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలను హత్య చేసేందుకు సిద్ధమయ్యాడా? ఈ ప్రశ్నలకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అవుననే సమాధానం చెబుతోంది. భారత్‌లో భీకర దాడులతో అల్లకల్లోలం సృష్టించేందుకు దావూద్ ఓ ప్రత్యేక యూనిట్‌ను ఏర్పాటు చేసినట్లు ఎన్ఐఏ బహిర్గతం చేయడం సంచలనాత్మకంగా మారింది. ‘ఇండియాటుడే’ కథనం ప్రకారం.. దావూద్‌పై ఎన్ఐఏ ఇటీవల ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దేశవ్యాప్తంగా పలు కీలక ప్రాంతాల్లో పేలుడు పదార్థాలు, మారణాయుధాలతో విరుచుకుపడేందుకు దావూద్ ముఠా ప్రణాళిక రూపొందించిందని ఎఫ్ఐఆర్లో ప్రస్తావించింది. ఢిల్లీ, ముంబై నగరాలపై దావూద్ ప్రధానంగా దృష్టి పెట్టినట్లు ఎన్ఐఆర్ వర్గాలు వెల్లడించాయి. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక సాయం అందించారన్న ఆరోపణలతో దావూద్ ఇబ్రహీంతోపాటు అతడి అనుచరులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఇటీవలే మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. మనీ లాండరింగ్ కేసులో దావూద్ సోదరుడు ఇక్బాల్ కస్కర్‌ను న్యాయస్థానం ఈ నెల 24వ తేదీ వరకు ఈడీ కస్టడీకి అప్పగించిన సంగతి తెలిసిందే. -
షాకింగ్ : లష్కరే లిస్ట్‌లో కోహ్లి, మోదీ, కోవింద్..
సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రసంస్థ లష్కరే తోయిబా హిట్‌లిస్ట్‌లో భారత క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లి, ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సహా పలు దిగ్గజ నేతలున్నారు. ఆల్ ఇండియా లష్కరే తోయిబాగా పేరుమార్చుకున్న ఉగ్రసంస్థ లష్కరే తోయిబా తమ టార్గెట్ జాబితాలో హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లను చేర్చినట్టు సమాచారం. జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు అనంతరం భారత్‌కు ప్రత్యేకంగా ఈ ఉగ్రసంస్థను నెలకొల్పిన లష్కరే ప్రముఖలను టార్గెట్ చేయడం ద్వారా ఉగ్రవాదులను సైన్యం హతమార్చినందుకు ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్నట్టు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు భారత్లోబంగ్లాదేశ్ క్రికెట్ జట్టు పర్యటిస్తున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. ఇరు జట్లు నవంబర్ 3న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో టీ20 మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఉగ్రవాదుల హిట్‌లిస్ట్‌తో కూడిన లేఖను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అందుకుంది. ఈ లేఖను ఆల్ ఇండియా లష్కరే తోయిబా హైపవర్కమిటీ, కోజికోడ్ నుంచి పంపినట్టు వెల్లడైంది. లష్కరే పంపిన హిట్‌లిస్ట్‌లో బీజేపీ దిగ్గజ నేత ఎల్కే అద్వానీ, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్, గోవా గవర్నర్ సత్య పాల్ మాలిక్ పేర్లు కూడా ఉన్నాయి. మరోవైపు ఎన్ఐఏ వర్గాలు ఈ లేఖను బీసీసీఐకి పంపడంతో ఢిల్లీ పోలీసులు టీం ఇండియా సభ్యులకు భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా బెదిరింపు లేఖ నకిలీదని ఎన్ఐఏ వర్గాలు భావిస్తున్నా పాక్ ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉన్న క్రమంలో రిస్క్‌కు తావివ్వకుండా భద్రతను ముమ్మరం చేయాలని అధికారులు భావిస్తున్నారు. 2008 ముంబై దాడులు సహా పలు ఉగ్రదాడులకు లష్కరే తోయిబా పాల్పడిన విషయం తెలిసిందే. -
ఉగ్రవాదుల హిట్ లిస్ట్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌లపై ఉగ్రవాదులు దాడికి వ్యూహం పన్నారన్న హెచ్చరికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు. అదేవిధంగా దేశంలోని జమ్మూ, అమృత్సర్, జైపూర్, గాంధీనగర్, కాన్పూర్, లక్నోలతో సహా 30 ప్రధాన నగరాలపై పేలుళ్లకు పథకం రచించినట్లు సమాచారం అందడంతో అన్ని రాష్ట్రాలను కేంద్ర హోం శాఖ అప్రమత్తం చేసింది. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్‌ను హిట్ లిస్ట్‌లో చేర్చామంటూ పౌర విమానయాన భద్రతా విభాగానికి జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ పేరుతో లేఖ అందింది. సెప్టెంబర్ 10వ తేదీన పంపినట్లు ఉన్న ఈ లేఖలో ఆర్టికల్ 370 రద్దుకు ప్రతీకారంగా దాడులకు పాల్పడనున్నట్లు ఉగ్రసంస్థ పేర్కొంది. అలాగే ఎయిర్ బేస్ కేంద్రాలు ఉన్న శ్రీనగర్, అవంతిపొర, జమ్మూ, పఠాన్ కోట్, హిందన్‌లపై దాడులు చేస్తామని హెచ్చరికలతో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ప్రస్తుతం న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలోనే ఉగ్రవాదులు దాడికి పాల్పడే అవకాశం ఉందని, అదీ ఎయిర్‌బేస్ కేంద్రంగా దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. -
హిట్ లిస్టులో దబోల్కర్ కుమార్తె
ముంబై: పుణేలో హత్యకు గురైన ప్రముఖ హేతువాది నరేంద్ర దబోల్కర్ కుమార్తె ముక్తా దబోల్కర్ హిందుత్వ తీవ్రవాదుల హిట్ లిస్టులో ఉన్నట్లు మహారాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక దళం (ఏటీఎస్) తెలిపింది. సామాజిక కార్యకర్త శ్యాం మానవ్, ఎన్సీపీ నేత జితేంద్ర అహ్వద్ తదితరుల పేర్లు హిట్ లిస్టులో ఉన్నట్లు ఏటీఎస్ పేర్కొంది. ఆయుధాలు, పేలుడు పదార్థాలు కలిగి ఉన్నాడన్న ఆరోపణలపై గత వారం ముంబై పోలీసులు అరెస్టు చేసిన హిందుత్వ తీవ్రవాది అవినాష్ పవార్‌పై కోర్టుకి సమర్పించిన డైరీలో ఏటీఎస్ ఈ విషయాలు తెలిపింది. హిందూ మతానికి వ్యతిరేకంగా మాట్లాడుతోన్న ముక్తాæ తదితరులపై అవినాష్ నిఘా పెట్టి, వెంబడించినట్టు స్థానిక సెషన్స్ కోర్టుకు సమర్పించిన రిపోర్టులో పేర్కొంది. -
హిందూత్వ తీవ్రవాదుల హిట్ లిస్టులో ముక్తా
ముంబై : పూణేలో హత్యకు గురైన ప్రముఖ హేతువాది నరేంద్ర దబోల్కర్ కుమార్తె ముక్తా దభోల్కర్ కూడా హిందూత్వ తీవ్రవాదుల హిట్ లిస్టులో ఉన్నట్టు మహారాష్ట్ర తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాల బృందం (ఏటీఎస్) తెలిపింది. సామాజిక కార్యకర్త శ్యాం మానవ్, ఎన్‌సిపి నాయకుడు జితేంద్ర అహ్వద్ తదితరుల పేర్లు సైతం హిట్ లిస్టులో ఉన్న విషయాన్ని ఏటీఎస్ వెల్లడించింది. ఆయుధాలు, పేలుడు పదార్థాలు కలిగి ఉన్నాడన్న ఆరోపణలపై గత వారం ముంబై పోలీసులు అరెస్టు చేసిన హిందూత్వ తీవ్రవాది అవినాష్ పవార్ పై ఏటీఎస్ కోర్టుకి సమర్పించిన డైరీలో ఈ విషయాలను ప్రస్తావించింది. హిందూ మతానికి వ్యతిరేకంగా మాట్లాడుతోన్న ముక్తా దభోల్కర్, శ్యాంమానవ్, జితేంద్ర అహ్వద్ తదిరులను అనుమానిత హిందూత్వ తీవ్రవాది అవినాష్ పవార్ నిఘా పెట్టి, వారిని వెంబడించినట్టు స్థానిక సెషన్స్ కోర్టుకి సమర్పించిన రిపోర్టులో ఏటీఎస్ పేర్కొన్నది. ప్రివెన్షన్ ఆఫ్ అన్ లాఫుల్ యాక్టివిటీస్ యాక్ట్ కింద అరెస్టయిన ఐదో వ్యక్తి అవినాష్ పవార్. అంతకు ముందు ఇదే కేసులో మరో నలుగురిని కూడా ముంబై పోలీసులు అరెస్టు చేసారు. -
లంకేశ్ హత్య: హిట్ లిస్ట్‌లో ప్రముఖ నటుడు
సాక్షి, బెంగళూరు : ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్య కేసు నిందితుడు అమోల్ కాలే నుంచి స్వాధీనం చేసుకున్న డైరీలో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. ఆ డైరీని పరిశీలించిన సిట్ అధికారులు హిట్ లిస్ట్‌లోని పేర్లను చూసి షాక్ తిన్నారు. హిందూత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న 37 మంది హిట్ లిస్ట్‌లో ఉన్నట్లు స్పెషల్ ఇన్వెష్టిగేషన్ టీం (సిట్) అధికారులు తెలిపారు. లిస్ట్‌లో మొదటి పేరు కన్నడ ప్రముఖ నటుడు గిరీష్ కర్నాడ్ ఉన్నట్లు సిట్ అధికారులు వెల్లడించారు. రెండో వ్యక్తిగా జర్నలిస్ట్ గౌరి లంకేశ్ ఉన్నట్లు గుర్తించారు. హిందూత్వ భావాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారన్న ఆరోపణలతో లంకేశ్‌ను గత ఏడాది సెప్టెంబర్ 5న తన ఇంటి సమీపంలోనే కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. రాడికల్ హిందూత్వ గ్రూప్ సభ్యులు ఆమెను హత్య చేసినట్లు పోలీసుల విచారణ తేలింది. అదే ముఠాకి చెందిన కొందరు సభ్యులు కర్ణాటక, మహారాష్ట్రాల్లో హిందుత్వ ధర్మనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న 37 మందిని టార్గెట్‌గా పెట్టుకున్నారు. 2016 నుంచి హిట్ లిస్ట్‌లో ఉన్న వారిపై హత్య ప్రయత్నాలు చేస్తున్నట్లు డైరీలో వారు పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ కోసం 50 మంది కరుడుగట్టిన హిందుత్వవాద షూటర్లను కూడా రిక్రూట్మెంట్ చేసుకున్నారు. ఈ విషయాలను డైరీలో కోడ్ భాషలో రాసుకున్నటు సిట్ అధికారులు వెల్లడించారు. హిట్ లిస్ట్‌లో నంబర్ వన్‌గా ఉన్న గిరీష్ కర్నాడ్‌కు కర్ణాటక పోలీసులు గట్టి భద్రత కల్పించారు. -
ఆ హిట్ లిస్ట్‌లో ఇమ్రాన్ ఖాన్
ఇస్లామాబాద్ : మాజీ క్రికెటర్, పాకిస్తాన్ తెహ్రీక్ ఇ- ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ సహా పలువురు ప్రముఖులపై జులై 25న జరగనున్న పాక్ సార్వత్రిక ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ఉగ్రవాదులు దాడులకు తెగబడవచ్చని నేషనల్ కౌంటర్ టెర్రరిజం అథారిటీ (నాక్టా) హెచ్చరించింది. ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉన్న జాబితాలో ఇమ్రాన్ ఖాన్‌తో పాటు అవామీ నేషనల్ పార్టీ అధ్యక్షుడు అఫ్సన్‌దర్ వలి, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ కుమారుడు, పాక్ సార్వత్రిక ఎన్నికల్లో తలపడుతున్న తల్హా సయీద్ తదితరలున్నారని నాక్టా వెల్లడించింది. ఉగ్రవాదుల హిట్‌లిస్ట్‌లో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్‌కు చెందిన పలువురు నేతలు సైతం ఉన్నారని పేర్కొంది. ఈ మేరకు నాక్టా పాక్ దేశీయాంగ మంత్రిత్వ శాఖకు నివేదిక సమర్పించింది. ఉగ్రవాదుల హిట్ లిస్ట్‌లో ఉన్న నేతలందరికీ కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని మంత్రిత్వ శాఖకు నాక్టా చీఫ్ రెహమాన్ మాలిక్ సూచించినట్టు పాక్ పత్రిక డాన్ న్యూస్ వెల్లడించింది. -
ఆ హిట్ లిస్ట్‌లో మరికొందరి పేర్లు..
సాక్షి, బెంగళూర్ : జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్యలో పాల్గొన్న గ్యాంగ్ హిట్ లిస్ట్‌లో మరికొందరి పేర్లు ఉండవచ్చని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అనుమానిస్తోంది. గౌరీ లంకేష్ కేసులో అనుమానితుడిగా భావిస్తున్న మరొకరిని సిట్ బృందం శుక్రవారం అరెస్ట్ చేసిన నేపథ్యంలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. హిందుత్వ వ్యతిరేక వైఖరితో వ్యవహరించే మరికొందరి పేర్లను కూడా ఈ బృందం కీలక టార్గెట్స్‌గా హిట్ లిస్ట్‌లో పొందుపరిచిందని సిట్ అధికారులు అంచనా వేస్తున్నారు. సిట్ అదుపులోకి తీసుకున్న సుజిత్ కుమార్ అలియాస్ ప్రవీణ్ నుంచి స్వాధీనం చేసుకున్న డైరీ ఆధారంగా హిందుత్వ వ్యతిరేక వైఖరి అవలంభిస్తున్న ప్రముఖ కన్నడ రచయిత ప్రొఫెసర్ కేఎస్ భగవాన్, నటుడు గిరీష్ కర్నాడ్, మాజీ మంత్రి బీటీ లలితా నాయక్, హేతువాది సీఎస్ ద్వారకానాథ్, నిదుమామిడి మఠం గురువు వీరభద్ర చన్నమల స్వామి తదితరుల పేర్లు ఈ జాబితాలో ఉన్నట్టు గుర్తించారు. కాగా గౌరీలంకేష్‌ను కాల్చిచంపిన కేసులో షూటర్ పరశురామ్ వాగ్మరేను సిట్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. గౌరీ లంకేష్‌పై కాల్పులు జరిపిన తుపాకినే గతంలో హేతువాది గోవింద్ పన్సారే, ఎంఎం కల్బుర్గిలను హత్యచేసేందుకు వాడినట్టు సిట్ విచారణలో వెల్లడైన సంగతి తెలిసిందే. -
కర్నాడ్కూ లంకేశ్ హంతకుల ముప్పు!
బెంగళూరు: ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్ హత్యకేసులోని నిందితుల హిట్‌లిస్టులో ప్రముఖ నటుడు, నిర్మాత గిరీశ్ కర్నాడ్ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇంకా, రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత లలితా నాయక్, నిదుమామిడి మఠం పీఠాధిపతి వీరభద్ర చన్నమల్లస్వామి, హేతువాది సీఎస్ ద్వారకనాథ్లకు కూడా వారి నుంచి ముప్పు ఉన్నట్లు తెలిపారు. నిందితుల నుంచి ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) స్వాధీనం చేసుకున్న ఓ డైరీలో ఈ వివరాలున్నట్లు పేర్కొన్నారు. హిందుత్వ భావజాలాన్ని వ్యతిరేకిస్తున్న ఈ ప్రముఖులను వారు లక్ష్యంగా చేసుకున్నారని తెలిపారు. డైరీలో కొంత సమాచారం సంకేత భాషలో ఉందని, దాని అర్థం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. మరోవైపు, సిట్ మంగళవారం అరెస్ట్ చేసిన 26 ఏళ్ల పరశురామ్ వాగ్మారే అనే యువకుడు లంకేశ్‌ను కాల్చి చంపాడని వార్తలు వచ్చాయి. అయితే వాటిని సిట్ అధిపతి బీకే సింగ్ కొట్టిపారేశారు. లంకేశ్‌ను వాగ్మారే హత్యచేసినట్లు తమ విచారణలో ఎలాంటి ఆధారాలూ లభించలేదని తెలిపారు. ఈ కేసులో ఇప్పటి వరకు సిట్ ఆరుగురిని అరెస్ట్ చేసింది. -
ఆపరేషన్ అపరాధి..
బరంపురం: బరంపురం, నగర పరిసర ప్రాంతాల్లో జరిగిన వివిధ నేరాలకు సంబంధించిన 30మంది కరుడుగట్టిన నేరస్తులు హిట్‌లిస్ట్‌లో ఉన్నారని ఎస్పీ పినాకి మిశ్రా తెలిపారు. జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఎస్పీ కార్యాలయంలో మండలి స్థాయి క్రైమ్ సమీక్ష సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎస్పీ పినాకి మిశ్రా మాట్లాడుతూ..బరంపురం నగరంలో ఇటీవల జరిగిన పలు నేరాలకు సంబంధించిన 30మంది కరుడుగట్టిన నేరస్తులు ఇతర రాష్ట్రలకు పారిపోయి తలదాచుకున్నట్లు తమ దగ్గర సమాచారం ఉందన్నారు. నగరంలో వివిధ హత్యలు, దాదా బట్టీలు, హత్యాయత్నాలు, దోపిడీలు చేసి పోలీసుల నుంచి తప్పించుకుని సూరత్, ముంబై, గుజరాత్, అహ్మదాబాద్, నాసిక్, పూణే, హైదరాబాద్‌లో ఉన్నట్లు తెలిపారు. ఇటువంటి నేరస్తులను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని తయారు చేసినట్లు చెప్పారు. నగరంలో ప్రజలు స్వేచ్ఛగా తిరిగే విధంగా నేరాలను అదుపు చేసేందుకు అపరాధి ముఖి అభియాన్ పేరుతో ఆపరేషన్ చేపట్టినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రజలకు, సమాజానికి పోలీసులు జవాబుదారీ తనంగా విధులు నిర్వహించి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని పోలీస్ అధికారులకు సూచించారు. పలు వేషాల్లో నేరస్తులు నగరంలో అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు వివిధ వేషాలలో తిరుగుతున్నారని, ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగినట్లు కనబడితే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలపై తగు చర్యలు చేపట్టాలని ట్రాఫిక్ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఏఎస్పీలు త్రినాథ్ పటేల్, సంతున్ దాస్, ఎస్డీపీఓ ప్రభాత్ చంద్ర రథ్, పెద్ద బజార్ పోలీస్ స్టేషన్ ఐఐసీ సురేష్ త్రిపాఠి, ట్రాఫిక్ ఐఐసీ సుమన్ కిషన్, టౌన్ పోలీస్‌స్టేషన్ ఐఐసీ అశోక్ కుమార్ మహంతి, బీఎన్‌పూర్ ఐఐసీ జె.కె.పట్నాయక్, గుసానినువగాం ఐఐసీ కులమణి శెట్టి తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
‘సాగరికా ఘోష్‌నూ చంపేయాలి’
న్యూఢిల్లీ: గౌరీ లంకేశ్ లాగానే ప్రముఖ జర్నలిస్టు సాగరికా ఘోష్‌ను కూడా చంపేయాలంటూ ఫేస్బుక్లో ఓ వ్యక్తి పోస్ట్ చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. విక్రమాదిత్య రాణా పేరుతో ఉన్న ఓ ప్రొఫైల్ నుంచి ఈ పోస్ట్ వచ్చిందని, ఐపీసీ, ఐటీ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టామని పోలీసులు చెప్పారు. ‘పాత్రికేయులుగా, సామాజిక కార్యకర్తలుగా ముసుగులు ధరించి జాతివ్యతిరేక కార్యకలాపాల్లో పాలుపంచుకునే వారినందరినీ చంపేయాలి. అలాంటివారికి గౌరీ లంకేశ్ హత్య హెచ్చరికగా నిలవాలి. ఇది ఇక్కడితో ఆగకూడదు. శోభా డే, అరుంధతీ రాయ్, సాగరికా ఘోష్, కవితా క్రిష్ణన్, షెహ్లా రషీద్లాంటి వారినందరినీ చంపేయాలి. జాతి వ్యతిరేక, మోసకారులైన రాజకీయ నేతలనూ హతమార్చాలి. ఇందుకోసం ఓ హిట్ లిస్ట్ తయారుచేయాలి’ అంటూ ఆ వ్యక్తి పోస్ట్ చేశాడు. దీనిని సాగరిక ట్వీటర్లో పోస్ట్ చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. -
హిట్ లిస్ట్ లో బంగారం..?
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల చెలామణీని రద్దుచేసి నల్ల కుబేరుల గుండెల్లో బాంబు పేల్చిన కేంద్రప్రభుత్వం మరో సంచలన ప్రకటనకు రడీ అవుతోంది. ఆపరేషన్ బ్లాక్ మనీలో భాగంగా మరో సంచలనానికి తెర తీయనున్నట్టు తెలుస్తోంది. బంగారం డొమెస్టిక్ హోల్డింగ్స్ పై కూడా ఆంక్షలు విధించే అవకాశం ఉందని సమాచారం. తద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ "బ్లాక్ మనీ" వ్యతిరేకంగా పోరాటాన్ని ముమ్మరం చేయనున్నట్టు సమాచారం. పేరు చెప్పడానికి ఇష్టపడని ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన అధికారి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించినట్టు న్యూస్ రైజ్ అనే వార్తా సంస్థ రిపోర్టు చేసింది. లెక్కల్లో చూపని ధనాన్ని అక్రమంగా బంగారం కొనుగోళ్లకు వినియోగిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనున్నట్టు భావిస్తున్నారు. అయితే డీమానిటైజేషన్, బంగారం దిగుమతులపై ప్రభుత్వం ఆంక్షలు విధించనుందనే అంచనాల నేపథ్యంలో ఇటీవల బంగారం కొనుగోళ్లు ఊపందకున్నాయి. గతనెలలో గోల్డ్ ప్రీమియం ధరలు రెండేళ్ల గరిష్టాన్ని నమోదుచేశాయి. భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద బంగారు కొనుగోలుదారుగా ఉంది. అయితే వార్షిక డిమాండ్ లో మొత్తం1,000 టన్నుల మేర బంగారం కొనుగోళ్లు సుమారు మూడోవంతు నల్లధనం ద్వారానే జరుగుతున్నట్టు మార్కెట్ వర్గాల అంచనా. మరోవైపు విదేశీ మార్కెట్లో బంగారం ధరలు వెలవెలబోతున్నాయి. న్యూయార్క్ కామెక్స్‌లో డిసెంబర్ ఫ్యూచర్స్ 1 శాతం(దాదాపు 12 డాలర్లు) క్షీణించి 1178 డాలర్ల దిగువన ట్రేడవుతోంది. ఇక వెండి కూడా ఔన్స్ 0.4 శాతం బలహీనపడి 16.43 డాలర్లకు చేరింది. దేశీ మార్కెట్లలోనూ ఇదే ధోరణి కనిపిస్తోంది. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం ఎంసీఎక్స్‌లో (డిసెంబర్ ఫ్యూచర్స్) 10 గ్రాముల ధర రూ. 316 క్షీణించి రూ. 28,430వద్ద, వెండి కేజీ (డిసెంబర్ ఫ్యూచర్స్) రూ. 261 తగ్గి రూ. 40,051 వద్ద కదులుతోంది. కాగా బంగారంపై ఆంక్షలకు సంబంధించిన పుకార్లు ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ప్రధాని మోదీ తరువాతి టార్గెట్ బంగారమే అనే పుకార్లు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. -
ఎక్కడ కనిపించినా ఆ 70 మందిని చంపేయండి!
'వారు ఎక్కడున్నా వెతికి మరీ చంపేయండి. వాళ్ల ఇంటికి వెళ్లి తలనరకండి. కత్తితో పొడవండి, లేదా నేరుగా తుపాకీతో కాల్చేయండి. అదీ కుదరకపోతే బాంబుపెట్టి లేపేయండి'.. ఇది తన మద్దతుదారులకు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద మూక ఇచ్చిన సందేశం. సిరియాలో తమ ఉగ్రవాద స్థావరాలపై డ్రోన్ దాడులు జరిపిన 70 మంది అమెరికా సైనిక సిబ్బంది లక్ష్యంగా ఐసిస్ హ్యాకర్లు ఈ ప్రకటన చేశారు. 70మంది అమెరికా సైనికులతో కూడిన ఓ హిట్ లిస్ట్‌ను ఆన్లైన్లో ప్రచారం చేస్తున్నారు. బ్రిటన్‌తో సంబంధాలు ఉన్న 'ఇస్లామిక్ స్టేట్ హ్యాకింగ్ డివిజన్'కు చెందిన హ్యాకర్లు ఈ హిట్ లిస్ట్‌ను తయారుచేశారు. ఇందులో అమెరికా సైనికుల పేర్లు, వారి ఇంటి చిరునామాలు, వారి ఫొటోలు ఉన్నాయి. ఐఎస్ఐఎస్ జెండాతో 'లక్ష్యం అమెరికా సైన్యమే' అనే పేరిట ఈ హిట్‌లిస్ట్‌ను ఐసిస్ హ్యాకర్లు ఇంటర్నెట్లో ప్రచారం చేస్తున్నారు. బ్రిటన్ రక్షణ శాఖలోనూ తమకు రహస్య వేగులు ఉన్నారని, సిరియాలో డ్రోన్ దాడులకు పాల్పడిన బ్రిటన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆపరేటర్ల జాబితాను కూడా సీక్రెట్ ఇంటెలిజెన్స్ సహాయంతో త్వరలోనే ప్రకటిస్తామని ఐసిస్ హ్యాకర్లు హెచ్చరించారు. -
బాంద్రా-వర్లీ సీలింక్‌కు భద్రతేదీ?
సాక్షి, ముంబై: బాంద్రా-వర్లీ సీలింక్ భద్రత గాల్లోని దీపం మాదిరిగానే ఉంది. ఉగ్రవాదుల హిట్‌లిస్ట్‌లో ఈ ప్రాజెక్ట్ ఉన్నా అధికారులు భద్రతా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ సీలింక్ వంతెన మీద పేలుడు పదార్థాల డిటెక్టర్లను అమర్చే కాం ట్రాక్ట్‌ను రెండేళ్ల క్రితం దక్కించుకున్న భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఇప్పటివరకు ఆ పనిని పూర్తి చెయ్యలేకపోయింది. నిబంధనల ప్రకారం ఆరు నెలల్లోనే డిటెక్టర్లను అమర్చే పనులు ముగించాల్సి ఉండగా, ఏళ్లు గడుస్తున్నా ముందుకు కదలడం లేదు. దీనిపై అన్ని వర్గాల నుంచి విమర్శలు రావడంతో మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎమ్మెస్సార్డీసీ) రూ.24 కోట్ల వ్యయంతో కూడిన ప్రాజెక్ట్ కాంట్రాక్ట్‌ను రద్దు చేసింది. ఈ విషయమై ఎమ్మెస్సార్డీసీ చీఫ్ ఇంజినీర్ అరుణ్ డియోధర్ మాట్లాడుతూ.. ఈ కాంట్రాక్ట్‌ను నెల క్రితమే రద్దు చేశామన్నారు. అయితే 2012 సెప్టెంబర్‌లో కాంట్రాక్ట్‌ను దక్కించుకున్న భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌కు డిటెక్టర్లను ఆరు నెలల్లోపు అమర్చాలని గడువు విధించామన్నారు. అప్పటివరకు పూర్తి కాకపోవడంతో మరో రెండుసార్లు కాంట్రాక్ట్‌ను పొడిగించామని తెలిపా రు. అయితే ఒప్పందం కుదుర్చుకొని 18 నెలలు పూర్తయినా ఎలాంటి ఫలితం కనిపించకపోవడంతో కాంట్రాక్ట్‌ను రద్దు చేశామన్నారు. ఈ ప్రదేశంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటుచేసేందుకు పోలీ సులతో పాటు ఇతర భద్రతా ఏజెన్సీల సలహాలను కూడా తీసుకొని ఓ పట్టికను రూపొందిస్తున్నామని తెలిపారు. పేలుడు పదార్థాలను కనిపెట్టే డిటెక్టర్లు, సీసీటీవీ కెమెరాలను కూడా ఇరు వైపులా అమరుస్తామన్నారు. 5.6 కి.మీ.మేర ఉన్న ఈ బాంద్రా-వర్లీ సీలింక్ వద్ద పైన, కింది భాగాల వద్ద ఆరు సీసీటీవీ కెమెరాలను అమర్చామని తెలిపారు. అయితే భద్రతను మరింత పెంచేందుకు కొత్త టెం డర్లను ఆహ్వానిస్తున్నామని, ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు ఆరు నెలల సమయం తీసుకుంటుం దని వివరించారు. భద్రత అవసరం... సీలింక్ని ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. 2008లో నగరంలో ఉగ్రవాదుల దాడి తర్వాత అప్పటి నగర పోలీస్ కమిషనర్ డి.శివానందన్ అత్యాధునిక పరికరాలతో భద్రతను కట్టుదిట్టం చేయమని ఎమ్మెస్సార్డీసీకి ఓ లేఖ కూడా రాశారని గుర్తు చేస్తున్నారు. ఈ ప్రదేశం ఉగ్రవాదుల హిట్‌లిస్టులో కూడా ఉందని అంటున్నారు. భద్రతను కట్టుదిట్టం చేయాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
హిట్ లిస్టులో ఉన్నా.. జంగల్ మహల్లో పర్యటిస్తా: మమత
తన పేరు మావోయిస్టుల హిట్‌లిస్టులో అగ్రస్థానంలో్ ఉన్నా కూడా తాను భయపడేది లేదని, మావోయిస్టుల కంచుకోట లాంటి జంగల్‌మహల్ ప్రాంతంలో తాను పర్యటిస్తూనే ఉంటానని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ''నా పేరు వాళ్ల హిట్‌లిస్టులో అగ్రస్థానంలో ఉన్నట్లు తెలిసింది. వాళ్లకు దైర్యముంటే రమ్మనండి. నాకు వాళ్లంటే భయం లేఉద. జంగల్మహల్లో పర్యటించకుండా నన్నెవరూ ఆపలేరు'' అని ఆమె సిల్డా ప్రాంతంలో జరిగిన ఓ బహిరంగ సభలో చెప్పారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు తాను వెయ్యిసార్లు జంగల్మహల్లో పర్యటిస్తానని ఆమె అన్నారు. ప్రజలను చంపడానికి రాత్రిపూట చీకటినే ఎంచుకునే మావోయిస్టులు.. పిరికివాళ్లని ఆమె ఎద్దేవా చేశారు. శాంతిని భంగపరచకుండా మావోయిస్టులను అడ్డుకోవాలని ఆమె ప్రజలను కోరారు. పశ్చిమ మిడ్నపూర్ జిల్లాలో 2010లో మావోయిస్టుల చేతిలో మరణించిన 24 తూర్పు సరిహద్దు రైఫిల్స్ దళ సభ్యుల గౌరవార్థం తాము ఓ స్మారక చిహ్నం నిర్మిస్తామని మమత చెప్పారు.