‘సాగరికా ఘోష్‌నూ చంపేయాలి’ | Case lodged after complaint by Journalist Sagarika Ghose over FB post | Sakshi
Sakshi News home page

‘సాగరికా ఘోష్‌నూ చంపేయాలి’

Published Fri, Sep 8 2017 1:24 AM | Last Updated on Sun, Sep 17 2017 6:32 PM

‘సాగరికా ఘోష్‌నూ చంపేయాలి’

‘సాగరికా ఘోష్‌నూ చంపేయాలి’

న్యూఢిల్లీ: గౌరీ లంకేశ్‌ లాగానే ప్రముఖ జర్నలిస్టు సాగరికా ఘోష్‌ను కూడా చంపేయాలంటూ ఫేస్‌బుక్‌లో ఓ వ్యక్తి పోస్ట్‌ చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. విక్రమాదిత్య రాణా పేరుతో ఉన్న ఓ ప్రొఫైల్‌ నుంచి ఈ పోస్ట్‌ వచ్చిందని, ఐపీసీ, ఐటీ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టామని పోలీసులు చెప్పారు.

‘పాత్రికేయులుగా, సామాజిక కార్యకర్తలుగా ముసుగులు ధరించి జాతివ్యతిరేక కార్యకలాపాల్లో పాలుపంచుకునే వారినందరినీ చంపేయాలి. అలాంటివారికి గౌరీ లంకేశ్‌ హత్య హెచ్చరికగా నిలవాలి. ఇది ఇక్కడితో ఆగకూడదు. శోభా డే, అరుంధతీ రాయ్, సాగరికా ఘోష్, కవితా క్రిష్ణన్, షెహ్లా రషీద్‌లాంటి వారినందరినీ చంపేయాలి. జాతి వ్యతిరేక, మోసకారులైన రాజకీయ నేతలనూ హతమార్చాలి. ఇందుకోసం ఓ హిట్‌ లిస్ట్‌ తయారుచేయాలి’ అంటూ ఆ వ్యక్తి పోస్ట్‌ చేశాడు. దీనిని సాగరిక ట్వీటర్‌లో పోస్ట్‌ చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement