సాక్షి, బెంగళూర్ : జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్యలో పాల్గొన్న గ్యాంగ్ హిట్ లిస్ట్‌లో మరికొందరి పేర్లు ఉండవచ్చని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అనుమానిస్తోంది. గౌరీ లంకేష్ కేసులో అనుమానితుడిగా భావిస్తున్న మరొకరిని సిట్ బృందం శుక్రవారం అరెస్ట్ చేసిన నేపథ్యంలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. హిందుత్వ వ్యతిరేక వైఖరితో వ్యవహరించే మరికొందరి పేర్లను కూడా ఈ బృందం కీలక టార్గెట్స్‌గా హిట్ లిస్ట్‌లో పొందుపరిచిందని సిట్ అధికారులు అంచనా వేస్తున్నారు.
సిట్ అదుపులోకి తీసుకున్న సుజిత్ కుమార్ అలియాస్ ప్రవీణ్ నుంచి స్వాధీనం చేసుకున్న డైరీ ఆధారంగా హిందుత్వ వ్యతిరేక వైఖరి అవలంభిస్తున్న ప్రముఖ కన్నడ రచయిత ప్రొఫెసర్ కేఎస్ భగవాన్, నటుడు గిరీష్ కర్నాడ్, మాజీ మంత్రి బీటీ లలితా నాయక్, హేతువాది సీఎస్ ద్వారకానాథ్, నిదుమామిడి మఠం గురువు వీరభద్ర చన్నమల స్వామి తదితరుల పేర్లు ఈ జాబితాలో ఉన్నట్టు గుర్తించారు.
కాగా గౌరీలంకేష్‌ను కాల్చిచంపిన కేసులో షూటర్ పరశురామ్ వాగ్మరేను సిట్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. గౌరీ లంకేష్‌పై కాల్పులు జరిపిన తుపాకినే గతంలో హేతువాది గోవింద్ పన్సారే, ఎంఎం కల్బుర్గిలను హత్యచేసేందుకు వాడినట్టు సిట్ విచారణలో వెల్లడైన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment