హిట్ లిస్టులో ఉన్నా.. జంగల్ మహల్లో పర్యటిస్తా: మమత | Mamata Banerjee unafraid of her name on top of Maoist hit-list | Sakshi
Sakshi News home page

హిట్ లిస్టులో ఉన్నా.. జంగల్ మహల్లో పర్యటిస్తా: మమత

Published Wed, Sep 25 2013 6:32 PM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM

హిట్ లిస్టులో ఉన్నా.. జంగల్ మహల్లో పర్యటిస్తా: మమత - Sakshi

హిట్ లిస్టులో ఉన్నా.. జంగల్ మహల్లో పర్యటిస్తా: మమత

తన పేరు మావోయిస్టుల హిట్లిస్టులో అగ్రస్థానంలో్ ఉన్నా కూడా తాను భయపడేది లేదని, మావోయిస్టుల కంచుకోట లాంటి జంగల్మహల్ ప్రాంతంలో తాను పర్యటిస్తూనే ఉంటానని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ''నా పేరు వాళ్ల హిట్లిస్టులో అగ్రస్థానంలో ఉన్నట్లు తెలిసింది. వాళ్లకు దైర్యముంటే రమ్మనండి. నాకు వాళ్లంటే భయం లేఉద. జంగల్మహల్లో పర్యటించకుండా నన్నెవరూ ఆపలేరు'' అని ఆమె సిల్డా ప్రాంతంలో జరిగిన ఓ బహిరంగ సభలో చెప్పారు.

అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు తాను వెయ్యిసార్లు జంగల్మహల్లో పర్యటిస్తానని ఆమె అన్నారు. ప్రజలను చంపడానికి రాత్రిపూట చీకటినే ఎంచుకునే మావోయిస్టులు.. పిరికివాళ్లని ఆమె ఎద్దేవా చేశారు. శాంతిని భంగపరచకుండా మావోయిస్టులను అడ్డుకోవాలని ఆమె ప్రజలను కోరారు. పశ్చిమ మిడ్నపూర్ జిల్లాలో 2010లో మావోయిస్టుల చేతిలో మరణించిన 24 తూర్పు సరిహద్దు రైఫిల్స్ దళ సభ్యుల గౌరవార్థం తాము ఓ స్మారక చిహ్నం నిర్మిస్తామని మమత చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement