శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌లో ఎలాహి దేహతి బ్యాంక్ మేనేజర్‌ను ఉగ్రవాదులు కాల్చిచంపిన ఘటన కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. మేనేజర్ క్యాబిన్‌లో ఉన్న విజయ్ కుమార్‌ను ఓ ఉగ్రవాది తన చేతుల్లోని తుపాకీతో కాల్చేశాడు. రెండు రౌండ్ల కాల్పులు జరపడంతో మేనేజర్ అక్కడే కుప్పకూలిపోయాడు. దీనికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు తాజాగా బయటకు వచ్చాయి. విజువల్స్‌లో ఉగ్రవాది రెండు బ్యాంక్ తలుపుల నుంచి చూస్తూ వెనక్కి వెళ్తూ కనిపించాడు. తరువాత మరోసారి బ్యాంక్‌లోకి వచ్చి మేనేజర్‌పై అంత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యాడు.
రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్‌కు చెందిన విజయ్ కుమార్ కుల్గామ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో బ్యాంక్‌లోకి చొరబడిన టెర్రరిస్ట్ తుపాకీతో మేనేజర్ విజయ్‌ను కల్చి చంపాడు. కాల్పుల అనంతరం విజయ్ కుమార్‌ను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు. కాగా కశ్మీర్‌లో కొన్ని రోజులుగా హిందువులపై ఉగ్రవాదులు విరుచుకుపడుతున్నారు. రెండు రోజుల ముందు ఇదే కుల్గామ్‌లోనే రజనీ బాలా అనే ప్రభుత్వం టీచర్‌ను కూడా చంపేశారు. అంతేగాక ఒక్క మే నెలలోనే అయిదుగురుప్రభుత్వ ఉద్యోగులను హతమార్చారు. మరోవైపు ఈ హత్యలను కాశ్మీరీ పండిట్లు తీవ్రంగా నిరసిస్తున్నారు.
చదవండి: కోవిడ్ బారిన సోనియా.. ట్వీట్ చేసిన ప్రధాని
#WATCH | J&K: Terrorist fires at bank manager at Ellaqie Dehati Bank at Areh Mohanpora in Kulgam district.
— ANI (@ANI) June 2, 2022
The bank manager later succumbed to his injuries.
(CCTV visuals) pic.twitter.com/uIxVS29KVI
Comments
Please login to add a commentAdd a comment