మరొకరిని పొట్టనబెట్టుకున్న ఉగ్రమూకలు | Man Shot Dead By Terrorists In Srinagar Bohri Kadal Area | Sakshi
Sakshi News home page

మరొకరిని పొట్టనబెట్టుకున్న ఉగ్రమూకలు

Published Tue, Nov 9 2021 8:18 AM | Last Updated on Tue, Nov 9 2021 8:19 AM

Man Shot Dead By Terrorists In Srinagar Bohri Kadal Area - Sakshi

శ్రీనగర్‌: శ్రీనగర్‌లో 24 గంటల వ్యవధిలో ఉగ్రవాదులు మరొకరిని పొట్టనబెట్టుకున్నారు. బొహ్రి కదల్‌ ప్రాంతంలో సోమవారం రాత్రి 8 గంటల సమయంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో మొహమ్మద్‌ ఇబ్రహీం అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారని పోలీసులు తెలిపారు. 

బందిపొర జిల్లాకు చెందిన మొహమ్మద్‌ ఇబ్రహీం మహరాజ్‌గంజ్‌లో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ఘటన నేపథ్యంలో భద్రతాబలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి గాలింపు చేపట్టాయి. ఆదివారం సాయంత్రం బాటామాలూ ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో పోలీసు కానిస్టేబుల్‌ ఒకరు చనిపోయిన విషయం తెలిసిందే.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement