కశ్మీర్: జమ్ము కశ్మీర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు బీజేపీ నేతను కాల్చి చంపుతూ దారుణానికి తెగబడ్డారు. బుధవారం రాత్రి బీజేపీ నేత షేక్ వసీమ్‌తోపాటు అతని తండ్రిని, సోదరుడిని ముష్కరులు పొట్టన పెట్టుకున్నారు. జమ్ము కశ్మీర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బందీపోర్‌లో బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో వసీమ్ బరి కుటుంబం పోలీస్ స్టేషన్‌కు దగ్గరలోని ఓ దుకాణం దగ్గర కూర్చుంది. సరిగ్గా అదే సమయంలో అదును చూసి అక్కడకు చొరబడ్డ ఉగ్రవాదులు బీజేపీ నేతతో సహా అతని తండ్రి బషీర్ అహ్మద్, సోదరుడు ఉమర్ బషీర్‌పై కాల్పులు జరిపారు. (తెలంగాణ సైనికుడి వీరమరణం)
వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు వీరిని జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నిజానికి వసీమ్‌కు భద్రత సౌకర్యం ఉంది. కానీ ప్రమాదం జరిగే సమయంలో అతనికి భద్రతగా ఉండే ఎనిమిదిమంది గార్డుల్లో ఏ ఒక్కరూ సంఘటనా స్థలంలో లేరు. దీంతో నిర్లక్ష్యంగా వ్యవహరించిన గార్డులపై కఠిన చర్యలను తీసుకోనున్నట్లు కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న ప్రధాని నరేంద్ర మోదీ బాధితుడి కుటుంబసభ్యులకు ఫోన్ ద్వారా ప్రగాఢ సానుభూతి తెలిపారు. వసీమ్ మరణం పార్టీకి తీరని లోటని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆవేదన వ్యక్తం చేశారు. (హిజ్బుల్ కమాండర్ హతం)
Comments
Please login to add a commentAdd a comment