మాస్కో: ఉక్రెయిన్‌పై భీకర దాడులకు పాల్పడుతున్న రష్యాకు ఊహించని షాక్ తగిలింది. ఉక్రెయిన్ సరిహద్దులోని బెల్గొరోడ్ ప్రాంతంలో రష్యా సైనిక శిక్షణ కేంద్రంపై టెర్రరిస్ట్‌లు దాడి చేశారు. ఇద్దరు దుండగులు కాల్పులు జరపటంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. మాజీ సోవియేట్ స్టేట్‌కు చెందిన ఇద్దరు పౌరులు.. సైనికులకు శిక్షణ ఇస్తున్న క్రమంలో కాల్పులు చేపట్టారు. ఇరువురు దుండగులను బలగాలు మట్టుబెట్టినట్లు రష్యా మిలిటరీ వెల్లడించింది.
‘బెల్గొరోడ్ ప్రాంతం పశ్చిమ మిలిటరీ డిస్ట్రిక్ట్‌లోని సైనిక శిక్షణ కేంద్రంపై సీఐఎస్ దేశం పౌరులు ఇద్దరు అక్టోబర్ 15న కాల్పులు జరిపారు. ఉక్రెయిన్‌లో ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్ కోసం వలంటీర్లకు శిక్షణ ఇస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. దీంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.’ అని రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. మరోవైపు.. సైనిక చేరికలను పెంచుతున్నట్లు సెప్టెంబర్ 21న ప్రకటించిన తర్వాత.. ఇప్పటి వరకు 2 లక్షలకుపైగా చేరినట్లు తెలుస్తోంది. సైనిక బలగాల నియామకాలపై నిరసనలు వ‍్యక్తమవుతున్నాయి.
ఇదీ చదవండి: 'నాటో యుద్ధానికి దిగితే ప్రపంచ విపత్తు తప్పదు': పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్
Comments
Please login to add a commentAdd a comment