military camps
-
రష్యాకు ఊహించని షాక్.. మిలిటరీ క్యాంప్‌పై కాల్పులు.. 11 మంది మృతి
మాస్కో: ఉక్రెయిన్‌పై భీకర దాడులకు పాల్పడుతున్న రష్యాకు ఊహించని షాక్ తగిలింది. ఉక్రెయిన్ సరిహద్దులోని బెల్గొరోడ్ ప్రాంతంలో రష్యా సైనిక శిక్షణ కేంద్రంపై టెర్రరిస్ట్‌లు దాడి చేశారు. ఇద్దరు దుండగులు కాల్పులు జరపటంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. మాజీ సోవియేట్ స్టేట్‌కు చెందిన ఇద్దరు పౌరులు.. సైనికులకు శిక్షణ ఇస్తున్న క్రమంలో కాల్పులు చేపట్టారు. ఇరువురు దుండగులను బలగాలు మట్టుబెట్టినట్లు రష్యా మిలిటరీ వెల్లడించింది. ‘బెల్గొరోడ్ ప్రాంతం పశ్చిమ మిలిటరీ డిస్ట్రిక్ట్‌లోని సైనిక శిక్షణ కేంద్రంపై సీఐఎస్ దేశం పౌరులు ఇద్దరు అక్టోబర్ 15న కాల్పులు జరిపారు. ఉక్రెయిన్‌లో ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్ కోసం వలంటీర్లకు శిక్షణ ఇస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. దీంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.’ అని రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. మరోవైపు.. సైనిక చేరికలను పెంచుతున్నట్లు సెప్టెంబర్ 21న ప్రకటించిన తర్వాత.. ఇప్పటి వరకు 2 లక్షలకుపైగా చేరినట్లు తెలుస్తోంది. సైనిక బలగాల నియామకాలపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇదీ చదవండి: 'నాటో యుద్ధానికి దిగితే ప్రపంచ విపత్తు తప్పదు': పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్ -
Russia-Ukraine war: రష్యా భీకర దాడులు
కీవ్/మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులకు పాల్పడుతోంది. సోమవారం నిర్దేశిత లక్ష్యాలపై లాంగ్–రేంజ్ మిస్సైళ్లు ప్రయోగించింది. ఖర్కీవ్ రీజియన్‌లోని లొజోవాలో ఉక్రెయిన్ సైనిక వాహనాల మరమ్మతు కేంద్రాన్ని ధ్వంసం చేశామని రష్యా రక్షణ శాఖ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఇగోర్ కొనాషెంకోవ్ ప్రకటించారు. అలాగే మరో 73 ఉక్రెయిన్ సైనిక శిబిరాలు, ఆయుధాగారాలు, మిలటరీ టార్గెట్లపై తమ సేనలు విరుచుకుపడినట్లు తెలిపారు. సెవెరోడొనెట్స్క్లో ఇరు పక్షాల నడుమ హోరాహోరీ పోరాటం సాగుతోందని లుహాన్స్క్ గవర్నర్ సెర్హీవ్ హైడై చెప్పారు. నగరంలో పరిస్థితి నానాటికీ దిగజారుతోందన్నారు. అయినప్పటికీ ఉక్రెయిన్ దళాలు శక్తివంచన లేకుండా పోరాడుతున్నాయని ప్రశంసించారు. సెవెరో డొనెట్స్క్ను కాపాడేందుకు కృషి చేస్తున్నాయని అన్నారు. సెవెరోడొనెట్స్క్తో పాటు సమీపంలోని లీసిచాన్‌స్క్‌పై రష్యా వైమానిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రెండు నగరాలను త్వరగా స్వాధీనం చేసుకోవాలన్న ఆరాటం రష్యాలో కనిపిస్తోంది. లీసిచాన్‌స్క్‌లో రష్యా దాడుల్లో ఓ బేకరీ ధ్వంసమయ్యింది. ఇక స్లొవియాన్స్క్, బఖ్ముత్ పట్టణాల్లోకి రష్యా దళాలు అడుగు పెట్టాయి. ఇక్కడి నుంచి సాధారణ ప్రజలకు బయటకు తరలిస్తున్నారు. మారియూపోల్‌లోని అజోవ్‌స్టల్ స్టీల్‌ప్లాంట్ నుంచి తమ సైనికుల మృతదేహాలను వెలికితీసే ప్రక్రియను ఉక్రెయిన్ ప్రారంభించింది. -
ఈ సైనిక శిబిరాలు స్మార్ట్
న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ వెంబడి తూర్పు లద్దాఖ్‌లో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ సైనికులు సమర్థంగా పనిచేయడానికి వీలుగా అత్యంత ఆధునిక వసతి సౌకర్యాలను కల్పించారు. కొద్ది రోజులుగా చైనాతో ఉద్రిక్తతలు నెలకొని ఉండడంతో శీతాకాలంలో సైనికుల ఆరోగ్యానికి పూర్తిగా రక్షణ కల్పించేలా స్మార్ట్ శిబిరాలను ఏర్పాటు చేశారు. నవంబర్ నుంచి ఈ ప్రాంతంలో రక్తం గడ్డకట్టే చలి మొదలవుతుంది. ఉష్ణోగ్రతలు దాదాపు మైనస్ 40 డిగ్రీ సెల్సియస్‌కు పడిపోతాయి. 40 అడుగుల ఎత్తున మంచు పేరుకుపోతుంది. ఇలాంటి కఠినమైన వాతావరణ పరిస్థితుల్ని తట్టుకుంటూ దేశ రక్షణ కోసం కంటి మీద రెప్ప వేయకుండా కాపలా కాసే మన జవాన్ల కోసం నిర్మించిన ఈ స్మార్ట్ క్యాంపుల్లో అన్ని రకాల సదుపాయాలున్నాయి. చలిని తట్టుకోవడానికి శిబిరాల్లో హీటర్లు, 24 గంటలు వేడి నీళ్ల సదుపాయం, విద్యుత్, బెడ్లు, కబోర్డులు ఇలా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు. ‘లద్దాఖ్‌లో గస్తీ ఉండే సైనికులకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశాం. వారు చలిని తట్టుకునేలా స్మార్ట్ శిబిరాల నిర్మాణం పూర్తయింది. దేశ రక్షణ కోసం పాటు పడే జవాన్లు శీతాకాలంలో సమర్థమంతంగా విధులు నిర్వహించడం కోసం మెరుగైన వసతి సదుపాయాలు కల్పించాం’అని భారత సైన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. స్మార్ట్ శిబిరాలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ట్విట్టర్లో షేర్ చేయడంతో అవి విస్తృతప్రచారం పొందాయి. గత నెలలోనే చైనా కూడా ఈ ప్రాంతంలో ఆధునిక సదుపాయాలతో సైనిక శిబిరాలు ఏర్పాటు చేసి, వాటి వీడియోల్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. చైనా శిబిరాలకు ఏమాత్రం తీసిపోకుండా భారత్‌కి చెందిన స్మార్ట్ శిబిరాలు కూడా ఉండడం గమనార్హం. -
సరిహద్దు శిబిరాలకు ఆర్మీ చీఫ్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి రద్దు అనంతరం పాక్‌తో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులు, ఆ దేశ నాయకుల రెచ్చగొట్టే ప్రకటనల నేపథ్యంలో భారత్ అప్రమత్తమయింది. ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం శ్రీనగర్‌కు చేరుకున్నారు. నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి సైనిక పోస్టులను సందర్శించారు. బలగాల కార్యాచరణ సన్నద్ధత, ముఖ్యంగా ఎల్వోసీ వెంట వాస్తవ పరిస్థితులపై సైనిక కమాండర్ల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాదామీబాగ్‌లోని ప్రధాన కార్యాలయంలో జరిగే సమావేశంలో రాష్ట్రంలో అంతర్గత పరిస్థితులపైనా ఆయన సమీక్షించనున్నారు. కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న అనంతరం ఆర్మీ చీఫ్ రాష్ట్రంలో పర్యటించడం ఇదే ప్రథమం. ఇలా ఉండగా, కశ్మీర్ లోయతోపాటు శ్రీనగర్‌లో శుక్రవారం ప్రార్థనల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా నిషేధాజ్ఞలు విధించారు. కశ్మీర్లో సాధారణ పరిస్థితులను నెలకొల్పేందుకు కేంద్రం కృతనిశ్చయంతో ఉందని సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. మలయాళ మనోరమ న్యూస్ కాంక్లేవ్‌లో ఆయన మాట్లాడారు. -
జమ్ము కశ్మీర్లో మరో విషాదం
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో మంచు చరియలు విరిగిపడిన ఘటనలో మరో ఐదుగురు సైనికులు మరణించారు. సోమవారం మచిల్ సెక్టార్లో ఐదుగురి మృతదేహాలను వెలికితీశారు. సైనికుల మృతదేహాలను మంగళవారం వారి స్వస్థలాలకు పంపుతామని ఉన్నతాధికారులు చెప్పారు. ఈ నెల 28న మచిల్ సెక్టార్లో మంచు చరియలు విరిగిపడటంతో సైనికులు గల్లంతయ్యారు. వీరి కోసం సైన్యం గాలింపు చర్యలు చేపట్టగా, ఈ రోజు మృతదేహాలు లభ్యమయ్యాయి. కశ్మీర్లో ఇటీవల పలు ప్రాంతాల్లో మంచు చరియలు విరిగిపడిన ఘటనలో 20 మంది మరణించిన సంగతి తెలిసిందే. వీరిలో 14 మంది సైనికులు ఉన్నారు. మరికొంత మంది సైనికులు గాయపడ్డారు. -
20కి చేరిన హిమపాత మృతుల సంఖ్య
-
హిమపాత మృతులు 20
కశ్మీర్లో మంచు బీభత్సం శ్రీనగర్: కశ్మీర్లో హిమపాతం, కొండచరియలు పడి మరణించిన వారి సంఖ్య ఇరవైకి చేరింది. వారిలో 14 మంది సైనికులే. శుక్రవారం కూడా హిమపాత బీభత్సం కొనసాగింది. సహాయక బృందాలు మరో నలుగురు సైనికుల మృతదేహాలను గుర్తించాయి. నాలుగు రోజులుగా కురుస్తున్న హిమపాతం కారణంగా సైనికులు, సాధారణ ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. వాతావరణం మెరుగైన తరువాత జవాన్ల మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపుతామని రక్షణశాఖ అధికారి తెలిపారు. హిమపాతాల్లో మరణించిన సైనికులకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతాపం ప్రకటిస్తూ ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్‌కు లేఖ రాశారు. గాయపడిన జవాన్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కర్ణాటక జవాన్ మృతి: జమ్మూకశ్మీర్‌లోని సోనామార్గ్ లో సైనిక శిబిరాలపై గురువారం మంచు చరియలు విరిగిపడిన ఘటనలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన సైనికుడు సందీప్‌శెట్టి(28) మరణించారు. అలాగే మేజర్ శ్రీహరి గాయపడ్డారు. హసన్ జిల్లా శాంతిహోబళి దేవిహళ్లి గ్రామానికి చెందిన సందీప్‌శెట్టి ఏడేళ్ల క్రితం సైన్యంలో చేరారు. ఫిబ్రవరి 22న ఆయన వివాహం జరగాల్సి ఉంది. అయితే శెట్టి మరణంపై ఆర్మీ నుంచి జిల్లా అధికారులకు ఇంకా ఎలాంటి సమాచారం అందలేదని తెలిసింది. కొండచరియల కింద చిక్కుకున్న బెళగావికి చెందిన మేజర్ శ్రీహరి తృటిలో ప్రాణాపాయం తప్పించుకున్నారు. -
పాక్ కాల్పుల్లో ఇద్దరి మృతి
జమ్మూ: జమ్మూ కాశ్మీర్‌లోని ఆరెస్ పురా, ఆర్నియాల్లో శనివారం పాక్ రేంజర్లు 22 సరిహద్దు సైనిక శిబిరాలు, 13 గ్రామాలపై కవ్వింపు లేకుండానే భారీగా కాల్పులు జరిపి, బాంబులు పేల్చారు. ఇద్దరు భారత పౌరులు మృతిచెందగా ఒక బీఎస్ఎఫ్ జవాను సహా ఆరుగురు గాయపడ్డారు. బీఎస్ఎఫ్ బలగాలు పాక్ కాల్పులకు దీటుగా బదులు చెప్పాయి. పాక్ జమ్మూ సెక్టార్లో ఈ ఏడాది భారీగా కాల్పులకు దిగడం ఇదే తొలిసారి. గత పక్షం రోజుల్లో కాల్పుల విరమణకు గండికొట్టడం 16వ సారి. ఈ నేపథ్యంలో సరిహద్దు గ్రామాలకు చెందిన మూడు వేలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.