20కి చేరిన హిమపాత మృతుల సంఖ్య | 20 dead by snowfall | Sakshi
Sakshi News home page

Published Sat, Jan 28 2017 7:36 AM | Last Updated on Thu, Mar 21 2024 8:43 PM

కశ్మీర్‌లో హిమపాతం, కొండచరియలు పడి మరణించిన వారి సంఖ్య ఇరవైకి చేరింది. వారిలో 14 మంది సైనికులే. శుక్రవారం కూడా హిమపాత బీభత్సం కొనసాగింది. సహాయక బృందాలు మరో నలుగురు సైనికుల మృతదేహాలను గుర్తించాయి. నాలుగు రోజులుగా కురుస్తున్న హిమపాతం కారణంగా సైనికులు, సాధారణ ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. వాతావరణం మెరుగైన తరువాత జవాన్ల మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపుతామని రక్షణశాఖ అధికారి తెలిపారు. హిమపాతాల్లో మరణించిన సైనికులకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ సంతాపం ప్రకటిస్తూ ఆర్మీ చీఫ్‌ బిపిన్ రావత్‌కు లేఖ రాశారు. గాయపడిన జవాన్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement