కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. మొన్నటి వరకు యుద్ధ వాహనాలు, ట్యాంకర్‌ల ద్వారానే కాల్పులు జరిపిన రష్యా బలగాలు తాజాగా వైమానిక దాళాలతో దాడులను వేగవంతం చేశాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్, ఖర్కీవ్‌లో భయాంకర దాడులు జరుగుతున్నాయి. ఇరు దేశాల సైనికులు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా యుద్దభూమిలో పోరును కొనసాగిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. రష్యా బాంబు దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ ప్రజలు, విదేశీయులు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు బంకర్లలో, భద్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లోనే తల దాచుకుంటున్నారు. మరోవైపు విద్యార్థుల తరలింపు కోసం మంత్రి వీకే సింగ్ పోలాండ్ వెళ్లారు. ఈ సందర్బంగా ఆయన శుక‍్రవారం మీడియాతో మాట్లాడారు. కీవ్ నగరంలో భారత విద్యార్థిపై కాల్పులు జరిగినట్టు కేంద్ర మంత్రి వీకే సింగ్ చెప్పారు. కీవ్‌లో రష్యా సైనికులు జరుపుతున్న కాల్పుల నుంచి తప్పించుకునే క్రమంలో విద్యార్థిపై ఫైరింగ్ జరిగినట్టు మంత్రి వెల్లడించారు. కాల్పుల్లో గాయపడిన వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారని.. ప‍్రస్తుతం అతడికి వైద్య చికిత్సలు జరుగుతున్నట్టు చెప్పారు. మరోవైపు మంగళవారం రష్యా దాడుల్లో భారత విద్యార్థి నవీన్ శేఖరప్ప మృతి చెందిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌లో ఇంకా 1700 మంది భారతీయ విద్యార్థులు చిక్కున్నారని, వారిని భారత్‌కు తరలించేందుకు అన్ని ప్రయాత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఉక్రెయిన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా కారణంగా కేంద్రం అడ్వైజరీ జారీ చేసిన తర్వాత ఇప్పటి వరకు 17 వేల మంది భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్‌ను వదిలి స్వదేశానికి వచ్చారని స్పష్టం చేశారు. అయితే, భారత్ నుండి ఉక్రెయిన్‌లో దాదాపు 20 మంది విద్యార్ధులు విద్యను అభ్యసిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment