vk singh comments
-
ఉక్రెయిన్‌లో భారత విద్యార్థిపై కాల్పులు.. పరిస్థితి విషమం!
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. మొన్నటి వరకు యుద్ధ వాహనాలు, ట్యాంకర్ల ద్వారానే కాల్పులు జరిపిన రష్యా బలగాలు తాజాగా వైమానిక దాళాలతో దాడులను వేగవంతం చేశాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్, ఖర్కీవ్‌లో భయాంకర దాడులు జరుగుతున్నాయి. ఇరు దేశాల సైనికులు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా యుద్దభూమిలో పోరును కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా.. రష్యా బాంబు దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ ప్రజలు, విదేశీయులు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు బంకర్లలో, భద్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లోనే తల దాచుకుంటున్నారు. మరోవైపు విద్యార్థుల తరలింపు కోసం మంత్రి వీకే సింగ్ పోలాండ్ వెళ్లారు. ఈ సందర్బంగా ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. కీవ్ నగరంలో భారత విద్యార్థిపై కాల్పులు జరిగినట్టు కేంద్ర మంత్రి వీకే సింగ్ చెప్పారు. కీవ్‌లో రష్యా సైనికులు జరుపుతున్న కాల్పుల నుంచి తప్పించుకునే క్రమంలో విద్యార్థిపై ఫైరింగ్ జరిగినట్టు మంత్రి వెల్లడించారు. కాల్పుల్లో గాయపడిన వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారని.. ప్రస్తుతం అతడికి వైద్య చికిత్సలు జరుగుతున్నట్టు చెప్పారు. మరోవైపు మంగళవారం రష్యా దాడుల్లో భారత విద్యార్థి నవీన్ శేఖరప్ప మృతి చెందిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌లో ఇంకా 1700 మంది భారతీయ విద్యార్థులు చిక్కున్నారని, వారిని భారత్‌కు తరలించేందుకు అన్ని ప్రయాత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఉక్రెయిన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా కారణంగా కేంద్రం అడ్వైజరీ జారీ చేసిన తర్వాత ఇప్పటి వరకు 17 వేల మంది భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్ను వదిలి స్వదేశానికి వచ్చారని స్పష్టం చేశారు. అయితే, భారత్ నుండి ఉక్రెయిన్‌లో దాదాపు 20 మంది విద్యార్ధులు విద్యను అభ్యసిస్తున్నారు. -
పాక్ ఆర్మీ చీఫ్‌కు కేంద్రమంత్రి గట్టి కౌంటర్
సాక్షి, న్యూఢిల్లీ : కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370 రద్దు తర్వాత దాయాది దేశాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జావేద్ బజ్వా శుక్రవారం మరోసారి రెచ్చగొట్టే ప్రకటన చేశాడు. కశ్మీర్ ప్రజలకు పాక్ ఎప్పుడూ తోడుగా ఉంటుందని, అవసరమైతే యుద్ధానికి సైతం వెనుకాడబోమని చెప్పారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి, మాజీ సైన్యాధిపతి వి.కె. సింగ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. భారత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసి పాక్ ఆర్మీ పబ్బం గడుపుకోవాలని చూస్తోందని చురకలంటించారు. తినడానికి తిండి, కార్యాలయాలు నిర్వహించేందుకు స్తోమత లేనప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి డబ్బులు గుంజడానికి ఆ దేశ ఆర్మీ ఇలా ప్రేలాపనలు చేస్తుందని ఎద్దేవా చేశారు. కశ్మీర్ అంశాన్ని చూపెడుతూ పాక్ సైన్యం తరచూ అవినీతికి పాల్పడుతుందని విమర్శించారు. ఎల్వోసీ వెంబడి రెండు వేల మందిని పాకిస్తాన్ భారత్‌లోకి పంపించడానికి యత్నిస్తోందన్న వార్తలపై ఆయన స్పందిస్తూ.. ‘వారిని వారి (పాక్ ఆర్మీ) డ్యూటీ చేయనీయండి. వారిని పైకి పంపించే డ్యూటీ మన ఆర్మీ చేస్తుంది’అని వ్యాఖ్యానించారు. (చదవండి : కశ్మీర్ కోసం యుద్ధానికి సిద్ధం: పాక్ ఆర్మీ చీఫ్) -
విపక్షం లక్ష్యంగా కేంద్ర మంత్రి ‘దోమల’ ట్వీట్
సాక్షి, న్యూఢిల్లీ : పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత్ చేపట్టిన మెరుపు దాడులలో ఎంతమంది ఉగ్రవాదులు మరణించారనే దానిపై పాలక, విపక్షాల మధ్య వాగ్వాదం జరుగుతున్న క్రమంలో కేంద్ర మంత్రి వీకే సింగ్ విపక్షాలపై ఎదురుదాడికి దిగారు. ‘దోమల’ ట్వీట్‌తో విపక్షాన్ని ఎండగట్టే ప్రయత్నం చేశారు. గత రాత్రి తాను దోమలతో ఇబ్బంది పడుతూ హిట్ వాడానని..తానిప్పుడు ఎన్ని దోమలను చంపానో లెక్కించాలా..? లేక తిరిగి నిద్రపోవాలా..? అంటూ ఆర్మీ మాజీ చీఫ్ సింగ్ ట్వీట్ చేశారు. కాగా, పాక్‌లో జైషే శిబిరాలపై చేపట్టిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్యపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న విపక్షాలే లక్ష్యంగా ఆయన దోమల ట్వీట్ చేసినట్టు స్పష్టమవుతోంది. మరోవైపు పాక్‌లోని బాలాకోట్‌లో భారత్ చేపట్టిన వైమానిక దాడుల్లో ఎంత మంది ఉగ్రవాదులు మరణించారో స్పష్టంగా వెల్లడించాలని విపక్షాలు మోదీ సర్కార్‌ను డిమాండ్ చేస్తుండగా, విపక్షాలు సేనల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని పాలక పక్ష నేతలు పేర్కొంటున్నారు. -
సాయంత్రంలోగా మంత్రిపదవి పీకేయండి
ఎవరో కుక్కను రాళ్లతో కొడితే దానికి ప్రభుత్వాన్ని నిందించాల్సిన అవసరం లేదంటూ కేంద్ర సహాయ మంత్రి వీకే సింగ్ చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. వీకే సింగ్ ప్రకటన చాలా సిగ్గుచేటని, ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధ చట్టం కింద శిక్షార్హ మని ఆయన అన్నారు. ఆయనపై వెంటనే కేసు పెట్టాలన్నారు. అసలు ఈరోజు సాయంత్రంలోగా ఆయనను మంత్రివర్గం నుంచి బయటకు లాగిపారెయ్యాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు అరవింద్ కేజ్రీవాల్ తన ట్విట్టర్ ఖాతాలో స్పందించి ట్వీట్లు పెట్టారు. ఈరోజు దసరా అని, చెడ్డతనం, అహంకారాల మీద మంచి సాధించిన విజయానికి ప్రతీక అని ఆయన చెప్పారు. నరేంద్ర మోదీ నిజంగా దసరాను నమ్మేవాల్ఏల అయితే ఆయనకు తన మంత్రివర్గంలో ఉన్న చెడు, అహంకారం నుంచి ముక్తి పొందాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే ఈరోజు సాయంత్రంలోగా వీకే సింగ్‌ను కేంద్ర మంత్రివర్గం నుంచి బయటకు పంపెయ్యాలని డిమాండ్ చేశారు. VK Singh's statement is shameful and prosecutable under SC/ST Act. A case should be registered against him immediately(1/4) — Arvind Kejriwal (@ArvindKejriwal) October 22, 2015 Aaj Dussehra hai, burai aur ahankar par achhai ki jeet ka prateek(2/4) — Arvind Kejriwal (@ArvindKejriwal) October 22, 2015 Agar Modiji sach mein Dusshera manana chahte hai to unko apne cabinet ko burai aur AHANKAAR se mukt karna chahiye(3/4) — Arvind Kejriwal (@ArvindKejriwal) October 22, 2015 Aaj shaam se pehle, VK Singh ko Cabinet se bahar nikaal dena chahiye(4/4) — Arvind Kejriwal (@ArvindKejriwal) October 22, 2015