సాక్షి, న్యూఢిల్లీ : పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో భారత్ చేపట్టిన మెరుపు దాడులలో ఎంతమంది ఉగ్రవాదులు మరణించారనే దానిపై పాలక, విపక్షాల మధ్య వాగ్వాదం జరుగుతున్న క్రమంలో కేంద్ర మంత్రి వీకే సింగ్ విపక్షాలపై ఎదురుదాడికి దిగారు. ‘దోమల’ ట్వీట్‌తో విపక్షాన్ని ఎండగట్టే ప్రయత్నం చేశారు. గత రాత్రి తాను దోమలతో ఇబ్బంది పడుతూ హిట్ వాడానని..తానిప్పుడు ఎన్ని దోమలను చంపానో లెక్కించాలా..? లేక తిరిగి నిద్రపోవాలా..? అంటూ ఆర్మీ మాజీ చీఫ్ సింగ్ ట్వీట్ చేశారు.
కాగా, పాక్‌లో జైషే శిబిరాలపై చేపట్టిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్యపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న విపక్షాలే లక్ష్యంగా ఆయన దోమల ట్వీట్ చేసినట్టు స్పష్టమవుతోంది. మరోవైపు పాక్‌లోని బాలాకోట్‌లో భారత్ చేపట్టిన వైమానిక దాడుల్లో ఎంత మంది ఉగ్రవాదులు మరణించారో స్పష్టంగా వెల్లడించాలని విపక్షాలు మోదీ సర్కార్‌ను డిమాండ్ చేస్తుండగా, విపక్షాలు సేనల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని పాలక పక్ష నేతలు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment