ఉక్రెయిన్‌లో రష్యా భీకర దాడులు కొనసాగుతున్నాయి. బాంబులు, మిస్సైల్స్ అటాక్ చేస్తూ రష్యా బలగాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రష్యా దాడుల్లో ఉక్రెయిన్ తీవ్రంగా నష్టపోయింది. అటు ప్రాణ నష్టంతో పాటుగా భారీ ఆస్తి నష్టం జరిగింది.
ఇదిలా ఉండగా.. తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ గురువారం రాత్రి మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంతం డోన్‌బాస్ ప్రాంతాన్ని రష్యా బలగాలు పూర్తిగా ధ్వంసం చేశాయని ఆరోపించారు. రష్యా దాడులు బాంబు దాడులను తీవ్రతరం చేశాయని తెలిపారు. రష్యా బలగాలు అనేక మంది ఉక్రేనియన్లను చంపి, వీలైనంత మేరకు సంస్థలను నాశనం చేసి ఎక్కువ నష్టం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నాయని వెల్లడించారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు తూర్పున ఉన్న ఖార్కివ్ ప్రాంతాన్ని రష్యా నుంచి తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఉక్రెయిన్ దళాలు ప్రయత్నిస్తుండగా.. ఉక్రెయిన్ ఆగ్నేయంలో ఉన్న డాన్‌బాస్‌లో రష్యా మరింత ఒత్తిడిని పెంచడానికి ప్రయత్నిస్తోందని అన్నారు.
ఈ క్రమంలోనే ఒడెసా, సెంట్రల్ ఉక్రెయిన్ నగరాలపై నిరంతరం దాడులు జరుగుతున్నాయి. డోన్బాస్ పూర్తిగా నాశనమైంది. తాజాగా జరిగిన బాంబు దాడుల్లో 12 మంది ఉక్రేనియన్లు మరణించారి జెలెన్ స్కీ పేర్కొన్నారు. మరోవైపు.. ఉక్రెయిన్‌లో రష్యా దాడులు ప్రారంభమైన నాటి నుంచి 3,811 ఉక్రేనియులు మృతిచెందగా, 4,278 మంది పౌరులు గాయపడ్డారని యూఎన్ హ్యూమన్ రైట్స్ కమిషనర్ ఓ ప్రకటనతో తెలిపారు.
ఇక, ఉక్రెయిన్‌కు మద్దతుగా నార్వే దేశ మాజీ పార్లమెంట్ సభ్యురాలు సాండ్రా ఆండర్సన్ ఈరా యుద్ద రంగంలోకి దిగారు. రష్యా కు వ్యతిరేకంగా ఉక్రెయిన్ తరఫున పోరాడుతున్నారు.
Sandra Andersen Eira is a former member of the Sámi Parliament of #Norway. Just one week after #Russia's invasion of #Ukraine, she joined the International Legion as a combat medic. pic.twitter.com/TGsR34julm
— NEXTA (@nexta_tv) May 20, 2022
ఇది కూడా చదవండి: పామాయిల్ ఎగుమతులకు ఇండోనేసియా ఓకే
Comments
Please login to add a commentAdd a comment