హైకోర్టు సీనియర్ న్యాయవాది పద్మనాభరెడ్డి మృతి
హైదరాబాద్: హైకోర్టు సీనియర్ న్యాయవాది పద్మనాభరెడ్డి (83) ఆదివారం మృతి చెందారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంగా బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. హైకోర్టులో పలు కీలక కేసులను ఆయన వాదించారు. పద్మనాభరెడ్డి క్రిమినల్ న్యాయశాస్త్రంలో నిష్ణాడుతుడిగా పేరు గడించాడు.
గత నాలుగు దశాబ్దాలుగా ఆయన న్యాయ సేవలందించారు. ఆయన కుమారుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం హైకోర్టుకు జడ్జిగా వ్యవరిస్తున్నారు.