‘ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు బాబు కృషిచేస్తానన్నారు’ | chandrababu naidu promises the protection of seemandhra employees, says murali krishna | Sakshi
Sakshi News home page

‘ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు బాబు కృషిచేస్తానన్నారు’

Published Wed, Aug 7 2013 8:18 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

chandrababu naidu promises the protection of seemandhra employees, says murali krishna

హైదరాబాద్:  సీమాంధ్ర ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తానని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తమతో చెప్పారని సచివాలయ ఉద్యోగుల సంఘం నేత మురళీకృష్ణ తెలిపారు. చంద్రబాబుతో సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు బుధవారం భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మురళీకృష్ణ.. ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, సీమాంధ్ర ప్రజల రక్షణ కోసం మాట్లాడతానని చంద్రబాబు హామి ఇచ్చారని తెలిపారు.

 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేక వేదికలపై చర్చించి తీసుకున్న నిర్ణయమని , ప్రత్యేక రాష్ర్ట ఏర్పాటుకు తాను కట్టుబడి ఉన్నానని చెప్పారన్నారు. గతంలో తెలంగాణ ఏర్పాటుకు మాటను ఇచ్చామని, ఆ మాటను వెనక్కు తీసుకోలేనని చంద్రబాబు చెప్పినట్లు మురళీకృష్ణ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement