padmanabha reddy
-
BRS Party: ఎకరం రూ.50 కోట్లుంటే.. ‘కారు’ చౌకగా 11 ఎకరాలా?
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట సర్వే నంబర్ 239, 240లో అత్యంత విలువైన 11 ఎకరాల భూమిని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కి రాష్ట్ర ప్రభుత్వం ఎలా కేటాయిస్తుందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎన్జీవో) కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ఆయన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ‘ప్రజా నాయకులు, సామాజిక కార్యకర్తలు, విద్యావేత్తలకు శిక్షణ ఇచ్చేందుకు ‘ఇన్స్టిట్యూట్ ఫర్ ఎక్సలెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్’ ఏర్పాటు చేస్తామని.. దీని కోసం 11 ఎకరాలను కేటాయించాలని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తూ రెండు నెలల క్రితం నిర్ణయం తీసుకుంది. దాదాపు రూ.50 కోట్లు ఎకరం మార్కెట్ విలువైన స్థలాన్ని.. కేవలం ఎకరం రూ.3,41,25,000కే ముట్టజెప్పేందుకు అంగీకరించింది. అధికారంలో మనమే ఉన్నాం కదా.. అని తమ పారీ్టకి ఇష్టారాజ్యంగా భూమి కేటాయించి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడింది. పూర్తి కేటాయింపు జరిగే వరకు మీడియాకు, ఇతరులకు తెలియకుండా గోప్యంగా వ్యవహరించింది. మే 12న ప్రతిపాదన.. మే 16న కలెక్టర్ అనుమతి... మే 17న సీసీఎల్ఏ అనుకూల నివేదిక.. ఈ తర్వాత ఒకరోజులో తెలంగాణ రాష్ట్ర ల్యాండ్ మేనేజ్మెంట్ అథారిటీ(టీఎస్ఎల్ఎంఏ) మిగతా తతంగాన్ని పూర్తి చేసింది. అనంతరం కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రతిపాదన నుంచి కేటాయింపు వరకు సాధారణంగా నాలుగైదు నెలలు పట్టే తతంగమంతా కేవలం 5 రోజుల్లో ముగించారు’ అని పిటిషన్ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హెచ్ఎండీఏ కమిషనర్, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మిని్రస్టేషన్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిలను ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్‌పై త్వరలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచారణ చేపట్టనుంది. -
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయాలి
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని సుపరిపాలన వేదిక(ఎఫ్‌జీజీ) కోరింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి ఎఫ్‌జీజీ కార్యదర్శి పద్మనాభరెడ్డి శనివారం లేఖ రాశారు. ఈఎన్సీ సమగ్ర సర్వే జరిపి జూరాల నుంచి 70 టీఎంసీల నీటిని వాడుకోవచ్చని డీపీఆర్ తయారు చేయగా.. దానిని సీఎం కేసీఆర్ కాదని శ్రీశైలం నుంచి నీటిని తీసుకోవాలని సూచించారన్నారు. ఇంత పెద్ద ప్రాజెక్టుపై నిపుణుల రిపోర్టు కాదని రాజకీయ నిర్ణయం తీసుకోవడం సరైంది కాదన్నారు. సర్వేకు భిన్నంగా కార్యాలయంలోనే మ్యాపుల ఆధారంతో ఆదరాబాదరాగా రెండు వారాల్లో శ్రీశైలం నుంచి 90 టీఎంసీల నీటిని తీసుకోవడానికి డీపీఆర్ తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. మరోవైపు ఇంత పెద్ద ప్రాజెక్టుకు ఎటువంటి పర్యావరణ, ఇతర అనుమతుల్లేకుండా మొదలు పెట్టారన్నారని ఆరోపించారు. ఈ ప్రాజెక్టు కోసం బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పు, సాలీనా కడుతున్న వడ్డీ, ప్రాజెక్టుకు కావాల్సిన 4,560 మెగావాట్ల విద్యుత్ ఎక్కడి నుంచి తెస్తారో ప్రజలకు వివరించాలన్నారు. -
కొత్త కార్పొరేషన్లు ఇవ్వొద్దు.. ప్రజాధనం వృథా చేయొద్దు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖలకు కార్పొరేషన్ల చైర్మన్లను నియమించి ప్రజాధనం వృథా చేయొద్దని ఫోరం ఫర్ గుడ్ గవ ర్నెన్స్ (ఎఫ్‌జీజీ) తెలిపింది. రాష్ట్రంలో కార్పొరేషన్లు, డెవలప్మెంట్ అథా రిటీలు కలిపి 70 వరకు ఉన్నాయని, కొన్ని మినహాయిస్తే చాలా కార్పొ రేషన్లు కేవలం కళ తప్పిన రాజకీయ నాయకులను చైర్మన్లుగా నియమిండానికి మాత్రమే ఏర్పాటు చేసినట్లు ఉన్నాయని విమర్శించింది. దీంతో ప్రభుత్వ ఖజానాకు భారం పడుతోందని ఆందోళన వ్యక్తంచేసింది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు ఎఫ్‌జీజీ కార్యదర్శి పద్మనాభరెడ్డి లేఖరాశారు. కార్పొరేషన్లు, డెవలప్మెంట్ అథా రిటీల పనితీరు ఎప్పుడు, ఎవరూ కూడా విశ్లేషణ చేయలేదని, కొన్ని అయితే శాఖల పనిని డూప్లికేట్ చేయగా, మరికొన్ని ఏ పనీ లేకుండా ఉన్నాయని ఆరోపించారు. కార్పొరేషన్ చైర్మన్లకు జీతాలు, కార్యాలయం, తగిన సిబ్బంది, ప్రభుత్వ వాహనం, డ్రైవర్, వారి జీతభత్యాలతో రూ.2 కోట్ల వరకు ప్రజాధనం వృథా అవుతోందని తెలిపారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని పని లేని కార్పొరేషన్లను మూసేయా లని, ఎలాంటి కార్పొరేషన్లు నెలకొల్పవద్దని సీఎస్‌కు రాసిన లేఖలో పద్మనాభరెడ్డి కోరారు. -
ఉచితాలతో ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేయొద్దు
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ పథకాల పేరుతో ఉచితాలు ఇస్తూ రాష్ట్రఖజానాను ఖాళీ చేసి ప్రభుత్వం అప్పుల పాలు కావొద్దని సుపరిపాలన వేదిక కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి కోరారు. ప్రభుత్వం ఇచ్చే జీవోలన్నీ వెబ్సైట్లో పెట్టాలని, విద్య, వైద్యం కొరకు అధిక నిధులు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఫ్యాప్సీ హాల్లో ఈనెల 19 నుంచి 25 వరకు సుపరిపాలన వారోత్సవాల నిర్వహిస్తున్న నేపథ్యంలో మంగళవారం ‘ప్రశాసన్ గావ్ కి ఓర్’(ప్రభుత్వ పాలన గ్రామాల దిశగా) అంశంపై పద్మనాభరెడ్డి వర్క్‌షాపు ప్రారంభించారు. ఒక అధికారి ఒకే పోస్టులో ఉండాలని, ఒకవేళ ఏదైనా కారణాలతో అదనపు బాధ్యత నిర్వహించినా అది నెలలోపే ఉండాలని సూచించారు. గ్రామాల్లో పేదలకు నాణ్యమైన విద్య, వైద్యం అందక పేదరికంలో మగ్గిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక సంఘం సూచించిన విధంగా గ్రామాలకు నిధుల విడుదల దయాదాక్షిణ్యంగా కాకుండా హక్కుగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
సామాన్యులకు వెలుగు రేఖ పద్మనాభరెడ్డి
విశాఖ లీగల్: హైకోర్టు సీనియర్ న్యాయవాది, దివంగత సి.పద్మనాభరెడ్డి సామాన్యుల జీవితాల్లో వెలుగు రేఖగా నిలిచారని హైకోర్టు న్యాయమూర్తులు పేర్కొన్నారు. శనివారం విశాఖలో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ఆధ్వర్యంలో పద్మనాభరెడ్డి స్మారక ఉపన్యాస కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పద్మనాభరెడ్డి తనయుడు, హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. న్యాయవాదిగా తన తండ్రి నుంచి నేర్చుకున్న అనుభవ పాఠాల గురించి వివరించారు. న్యాయవాదులు, న్యాయమూర్తుల మధ్య సత్సంబంధాలు అవసరమన్నారు. న్యాయవాదులు కోర్టులో ప్రవర్తించే తీరు చాలా ముఖ్యమన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.వి.శేషసాయి మాట్లాడుతూ.. మహిళలు, చిన్నారులు, వృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యలు, న్యాయపరమైన అంశాలు, చట్టాల గురించి వివరించారు. సమాజంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావడం వల్ల నేడు అనేక సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. చట్టం అందరికీ సమానమేనన్నారు. మహిళల చట్టాలు సమర్థవంతంగా అమలు జరగాలన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్.. ఎన్నికల నేరాలు, తప్పుడు హామీలు తదితరాల గురించి వివరించారు. పద్మనాభరెడ్డి భారత న్యాయవ్యవస్థకు కరదీపిక అని చెప్పారు. న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ మన్మథరావు మాట్లాడుతూ.. పద్మనాభరెడ్డి 60 వేలకు పైగా కేసులను వాదించారని చెప్పారు. న్యాయమూర్తి జస్టిస్ బి.శ్యామ్‌సుందర్ మాట్లాడుతూ.. సత్వర న్యాయం పొందాలంటే.. కేసు దాఖలు చేసే సమయంలో సీనియర్ల సలహాలు, సరైన ధ్రువీకరణ పత్రాలు అవసరమన్నారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.నగేష్ మాట్లాడుతూ.. కులాలు, మతాలు వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నాయన్నారు. కార్యక్రమంలో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ అధ్యక్షుడు సురేశ్‌కుమార్, జాతీయ కార్యవర్గ సభ్యులు బొమ్మకంటి ప్రభాకర్, ముప్పాళ్ల సుబ్బారావు, చెలసాని అజయ్‌కుమార్, వి.చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు -
ప్రభుత్వ భూముల అమ్మకం ఆపేయాలి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ భూముల అమ్మకం ఆపేయాలని, ఉచితాల పేరుతో అయ్యే ఖర్చును తగ్గించుకోవాలని సర్కార్‌కు సుపరిపాలన వేదిక (ఎఫ్‌జీజీ) సూచించింది. ఈ మేరకు శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు ఎఫ్‌జీజీ ఎం.పద్మనాభరెడ్డి లేఖ రాశారు. ప్రభుత్వ ధనాన్ని రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరిట ప్రజలకు ఉచితాల రూపంలో ఇచ్చేస్తుందని, దీంతో ప్రభుత్వం అప్పుల పాలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 1923 ఫ్లాట్లు, 18.05 ఎకరాల భూమి వేలం కోసం ఈనెల 11న నోటిఫికేషన్ ఇచ్చిందని లేఖలో వెల్లడించారు. ప్రభుత్వ అభివృద్ధి కోసం సరిపోయే స్థలం కావాలని ప్రైవేటు వ్యక్తుల నుంచి అధిక ధరకు భూములు కొనుగోలు చేస్తుంటే మరో దిక్కు ఉన్న భూములను అమ్మాలని చూడటం ఏమిటని ప్రశ్నించారు. మున్ముందు పట్టణ పరిసరాల్లో ఆస్పత్రులు, పాఠశాలలు, శ్మశాన వాటికలు, ఉద్యానవనాలకు, ఇతర ప్రభుత్వ అవసరాలకు భూములు అవసరం ఉంటుందని గుర్తు చేశారు. ఉన్న కొద్దిపాటి భూములను అమ్మేస్తే భవిష్యత్తుల్లో భూములను ఎక్కడి నుంచి తెస్తారో చెప్పాలని లేఖలో కోరారు. -
117 బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ
సాక్షి, అమరావతి: శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీతో పాటు వర్సిటీ పరిధిలోని కళాశాలల్లో బోధన విభాగంలో ఖాళీగా ఉన్న 117 బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. సుమారు 8 ఏళ్ల తర్వాత ఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు కేటాయించిన ఈ పోస్టుల భర్తీకి ఇటీవలే యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో 47 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 70 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులున్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించి వెటర్నరీ సైన్స్‌లో 40, ఫిషరీస్ సైన్స్‌లో 4, డెయిరీ సైన్స్‌లో 2, వ్యవసాయ విభాగంలో ఒక పోస్టు ఉన్నాయి. అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించి వెటర్నరీ సైన్స్‌లో 64, ఫిషరీస్ సైన్స్‌లో 4, డెయిరీ సైన్స్‌లో 2 పోస్టులు ఉన్నాయి. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 22వ తేదీ సాయంత్రం 4.30 గంటలలోగా ది రిజిస్ట్రార్, శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, డాక్టర్ వైఎస్సార్ భవన్, తిరుపతి–517502 చిరునామాకు దరఖాస్తులు పంపాలని యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ వి.పద్మనాభరెడ్డి చెప్పారు. వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎస్వివియూ.ఈడీయూ.ఇన్‌లో చూడాలని ఆయన సూచించారు. -
సీఈఓకి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ప్రచారం సందర్భంగా పెద్ద ఎత్తున డబ్బు దొరికిన వాళ్లపై కేసులు పెట్టడం లేదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి మండిపడ్డారు. డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కోడ్ అమల్లో ఉన్న సమయంలో పలు పార్టీల నాయకులు, కార్యకర్తల వద్ద పట్టుకున్న డబ్బు వివరాలపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పరిశీలన చేసిందన్నారు. అదేవిధంగా డబ్బు ఎన్నికలను శాసిస్తోందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో డబ్బు విపరీతంగా పంచుతున్నారని.. డబ్బు నియంత్రణ కోసం ఎన్నికల కమిషన్ ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల సమయంలో తెలంగాణలో 640 కేసులు, సుమారు రూ. 84 కోట్ల 34 లక్షలు పట్టుకున్నారని తెలిపారు. రూ.28 కోట్లకు 159 కేసులను మాత్రమే నమోదు చేశారని పేర్కొన్నారు. కేవలం 24 శాతం మాత్రమే కేసులు పెట్టారని తెలిపారు. నమోదైన కేసుల్లో దాదాపు రూ. 56 కోట్లు వదిలేశారని ఆగ్రహించారు. ఎన్నికల నిబంధనలను సరిగా అమలు చేయటం లేదని.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఎన్నికలు సక్రమంగా నిర్వహిస్తున్నప్పటికి.. అమలు చేస్తున్న విధానం సరిగా లేదన్నారు. ఎన్నికలు పూర్తయ్యాక ప్రతి ఆరు నెలలకు ఎన్నికల కమిషనర్ జిల్లా ఎస్పీలతో సమీక్ష నిర్వహించాలని సూచించారు. ఎన్నికల సమయంలో పట్టుబడిన డబ్బు, కేసులపై చర్చించాలని పద్మనాభరెడ్డి అన్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి తెచ్చిన డబ్బును ఐటీకి బదిలీ చేయటం సరికాదన్నారు. భారీగా డబ్బు పట్టుబడినప్పటికీ ఎన్నికల్లో పోటీ చేసిన ఏ అభ్యర్థిపై కేసులు నమోదు చేయకపోవటంపై ప్రశ్నించారు. ఎన్నికల సందర్భంగా డబ్బు పాత్రను తగ్గించుటకు ఎన్నికల కమిషన్ చేపట్టిన చర్యలు తెలంగాణ రాష్ట్రలో సరైన ఫలితాలు ఇవ్వలేదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ విశ్లేషణలో తేలిందన్నారు. ఇప్పటికైనా ఎన్నికల్లో పట్టుకున్న డబ్బుపై విచారణ పూర్తి చేసి కేసు నమోదు చేయాలన్నారు. కేసు నమోదు చేసిన వివరాలను మీడియాలో తెలిపాలని ఆయన అభిప్రాయపడ్డారు. నమోదు చేసిన కేసులను రాష్ట్ర చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తరచుగా పోలీసు అధికారులతో విశ్లేషించి.. ఆ కేసులన్నింటికి త్వరగా తీర్పు వచ్చేటట్టు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ మేరకు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి ఎన్నికల కమిషనర్‌కి లేఖ రాశారు. -
అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది
‘‘యంగ్ హీరోలందరూ కలిసి డబ్బులు పెట్టి ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ అనే సినిమా చేశారు. నేనూ అటువంటి మనస్తత్వం ఉన్న హీరోనే. ఇప్పటికీ చెబుతుంటా... నాకు కథ నచ్చితే రెమ్యునరేషన్ ఇవ్వొద్దు అని. కొత్త దర్శకులు, నిర్మాతలకు డబ్బులొస్తేనే ఇవ్వమని చెబుతా. డబ్బులు వస్తేనే తీసుకోవాలి అనే మనస్తత్వం నాది. అందరూ ఇదే పద్ధతి పాటిస్తే ఇండస్ట్రీ బాగుంటుంది’’ అని నటుడు రాజశేఖర్ అన్నారు. ఆది సాయికుమార్ హీరోగా, రచయిత అబ్బూరి రవి ప్రతినాయకుడిగా సాయికిరణ్ అడివి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’. ప్రతిభా అడివి, కట్టా ఆశిష్‌రెడ్డి, కేశవ్ ఉమా స్వరూప్, పద్మనాభ రెడ్డి, గ్యారీ బీహెచ్, సతీష్ డేగలతో పాటు నటీనటులు, సాంకేతిక నిపుణులు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో సాయి కిరణ్ అడివి మాట్లాడుతూ– ‘‘1990లలో కశ్మీర్లో పండిట్లకు ఏం జరిగిందో అందరికీ తెలియాలని చేసిన ప్రయత్నం ఇది. ఆది ఈ సినిమా చేయడానికి ముఖ్య కారణం సాయికుమార్‌గారు.. ఆయనకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘కశ్మీర్ పండిట్ల ఎమోషన్‌ను క్యాష్ చేసుకోవడానికి ఈ సినిమా తీయలేదు. మాకు తెలిసిన విషయాలను పదిమందికి చెబుదామని తీశాం’’ అన్నారు అబ్బూరి రవి. ‘‘నాకు ఈ సక్సెస్ చాలా ఇంపార్టెంట్’’ అన్నారు ఆది సాయికుమార్. ‘‘ఆది మా అబ్బాయిలాంటివాడు’’ అన్నారు జీవితారాజశేఖర్. ‘‘ఈ ఫంక్షన్‌కి నేను ఆది కుటుంబ సభ్యుడిగా వచ్చాను.’’ అన్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ‘‘ప్రతి భారతీయుడు గర్వపడే చిత్రమిది’’ అన్నారు నిర్మాతల్లో ఒకరైన పద్మనాభరెడ్డి. నిర్మాతలు కేశవ్, ప్రతిభ, హీరో అడివి శేష్, నటులు కృష్ణుడు, మనోజ్ నందం, పార్వతీశం, కార్తీక్ రాజు, అనీష్ కురువిళ్ల, సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల, నిర్మాత రాజ్ కందుకూరి పాల్గొన్నారు. కెమెరా: జైపాల్‌రెడ్డి నిమ్మల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిరణ్‌రెడ్డి తుమ్మ, సహ నిర్మాత: దామోదర్ యాదవ్ (వైజాగ్). -
నయీం కేసులో రాజకీయ నాయకులపై చర్యలేవీ?
సాక్షి, హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో ప్రమేయం ఉన్న రాజకీయ నాయకులపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ పద్మనాభరెడ్డి ప్రశ్నించారు. నయీం కేసు వివరాలు ఇవ్వాలని ఫోరం ఫర్ గుడ్ గవర్ననెన్స్ అధికారులను ఆర్టీఐ ద్వారా కోరింది. దీంతో అధికారులు నయీం కేసులో పలువురు రాజకీయ నాయకులు, పోలీసు ఉన్నతాధికారుల పేర్లు వెల్లడించారు. అయితే ఈ సమాచారంపై తమకు కొన్ని అనుమానాలు ఉన్నాయని తెలిపిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్, పలు అంశాలతో గవర్నర్ నరసింహన్‌కు ఓ లేఖ రాసింది. దీనిపై పద్మనాభరెడ్డి గురువారం సాక్షి టీవీతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు సందేహాలను వెలిబుచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ‘నయీం ఎన్కౌంటర్ జరిగి మూడేళ్లు గడిచిన తరువాత ఈ కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. నయీంతో పోలీసులు, రాజకీయ నాయకులు సంబంధాలు పెట్టుకుని అరాచకాలకు పాల్పడ్డారని సిట్ ఏర్పాటు చేశారు. సిట్ దర్యాప్తు నివేదికలో రూ. 3.74 లక్షలు సీజ్ చేసినట్టు చెప్తున్నారు. కానీ నాడు నయీం ఇంట్లో పెద్ద ఎత్తున డబ్బు దొరికిందని కౌంటింగ్ మెషిన్లు తీసుకొచ్చి డబ్బులు లెక్కించారు. మరీ ఇంత తక్కువ మొత్తం లెక్కించడానికేనా కౌంటింగ్ మెషిన్లు తీసుకెళ్లింది?. రాజకీయ నాయకులకు ఎనిమిది మందికి ఈ కేసుతో ప్రమేయం ఉన్నట్టు చెప్పారు. మరి వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదు?. నయీం ఇంట్లో సెర్చ్ చేసినప్పుడు ఒక డైరీ దొరికిందని అన్నారు. మేము అందులో ఏముందో చెప్పాలని ఆర్టీఐ ద్వారా అడిగాం. కానీ దర్యాప్తు సమయంలో సమాచారం ఇవ్వలేమని చెప్పారు. డైరీలో ఉన్న సమాచారాన్ని ప్రజల ముందు ఉంచాలి. 2003 నుంచి నయీంపై 8 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కానీ వాటిని అతను చనిపోయాక రీ ఓపెన్ చేశారు. నయీం చనిపోయిన తరువాత 250 కేసులు నమోదైనట్టు చెబుతున్న పోలీసులు.. అతడు బతికి ఉన్నప్పుడు ఏం చేశారు?. ఇప్పటికే నయీం కేసులో తమకున్న అనుమానాలపై గవర్నర్‌కు లేఖ రాశామ’ని తెలిపారు. చదవండి : నయీం కేసులో బయటపడ్డ సంచలన విషయాలు -
మహిళలు, పిల్లలకు రక్షణలేని దేశం ముందుకు పోలేదు
హైదరాబాద్: మహిళలకూ, పిల్లలకూ రక్షణ కల్పించలేని దేశం ఎన్నటికీ ముందుకు పోలేదని ఫోరం ఫర్ గుడ్ గవ ర్నెన్స్ సెక్రటరీ పద్మనాభరెడ్డి అన్నారు. మహిళలు ఎక్కడ గౌరవిస్తారో అక్కడ దేవతలు కొలువుదీరుతారని పురాణాల్లో ఉందని, చదువుల కోసం సరస్వతిని, డబ్బు కోసం లక్ష్మీదేవిని పూజించడం మన సంస్కృతిలోనే ఉందని, కానీ ఆ మహిళలకూ, పిల్లలకూ రక్షణ లేకుండా పోయిందన్నారు. కైలాస్ సత్యార్థి పిల్లల ఫౌండేషన్, నెట్వర్క్ ఆఫ్ ప్రొటెక్షన్ చైల్డ్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘అత్యాచార రహిత భారతదేశం’కోసం అన్ని రాజకీయ పార్టీల నాయకుల ప్రతిజ్ఞ పోస్టర్‌ను ఆయన శుక్రవారం ఇక్కడ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళలు, పిల్లల భద్రత కోసం రాజకీయ నాయకుల వద్ద ప్రతిజ్ఞ తీసుకోవడం ఎంతో మంచి కార్యక్రమమే, కానీ నేతలు మాటపై నిలబడతారన్న నమ్మకం ఉండటంలేదన్నారు. పిల్లల రక్షణలో భారతదేశం ప్రపంచంలో 97వ స్థానంలో ఉందని, ఇది విచారకరమని పేర్కొన్నారు. మహిళలపై అత్యాచార కేసుల సత్వర పరిష్కారానికి ప్రతిరాష్ట్రంలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని, బాధితులకు ఏడాదిలోపు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలు, పిల్లల రక్షణ, భద్రత, చదువు కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని సూచించారు. రాజకీయ పార్టీలతోనే పరిష్కారం.. కైలాస్ సత్యార్థి పిల్లల ఫౌండేషన్ ప్రతినిధి రమణ్ చావ్లా మాట్లాడుతూ పిల్లలు, మహిళల భద్రతలేమి అనేది సామాజిక సమస్య అనీ, దీన్ని రాజకీయ పార్టీల నేతల చొరవతోనే పరిష్కరించగలమని అన్నారు. అత్యాచారరహిత భారతదేశం కోసం అన్ని రాజకీయ పార్టీల నేతల చేత ప్రతిజ్ఞ చేయిస్తున్నామని, ఎన్నికల్లో గెలవగానే పార్లమెంట్లో గళం విప్పేలా చూడటం, కేంద్ర బడ్జెట్లో పిల్లలు, మహిళల భద్రత కోసం 10 శాతం బడ్జెట్ కేటాయించే విధంగా కృషి చేయడం తమ ముఖ్య లక్ష్యమని తెలిపారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 450 మంది ఎంపీలు, పార్టీల ప్రముఖులు ప్రతిజ్ఞాపత్రంపై సంతకం చేసినట్లు చెప్పారు. తెలంగాణలో కిషన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి లాంటి ప్రముఖులతోపాటు 34 మంది ఎంపీ అభ్యర్థులు, నేతలు ప్రతిజ్ఞాపత్రంపై సంతకం చేసి తమ ఉద్యమంలో భాగస్వామ్యం అయినట్లు తెలిపారు. తమతోపాటు సుమారు 50 వరకు స్వచ్ఛంద సంస్థలు ఈ ప్రచార ఉద్యమంలో పాల్గొంటున్నాయ ని చెప్పారు. ఎన్నికల ఫలితాలు రాగానే గెలిచిన ఎంపీలతో ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసి మహిళలు, పిల్లల రక్షణ కోసం పార్లమెంటులో గళం విప్పేలా చొరవ తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆశ్రిత, ఎస్ఆర్డీ, బచ్పన్ బచావో ఆందోళన్, ఎంబీ ఫౌండేషన్ ప్రతినిధులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ప్రజలు కోరుకున్నదే చట్టం కావాలి
హైదరాబాద్: ప్రజాస్వామ్యంలో ప్రజలు కోరుకున్నదే చట్టం కావాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు పద్మనాభ రెడ్డి అన్నారు. మహిళలపై అత్యాచారం జరిగితే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసే ధైర్యం రావాలన్నారు. రేప్ ఫ్రీ ఇండియా పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరం సహకరించాలన్నారు. 50 స్వచ్ఛంద సంస్థలు కలిసి ‘రేప్ ఫ్రీ ఇండియా’పేరుతో సంస్థ ఏర్పాటు చేసుకుని మహిళలు, పిల్లలపై జరుగుతున్న వేధింపులపై ప్రత్యేక చట్టం తయారుచేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. దీనికోసం దేశవ్యాప్తంగా ప్రస్తుతం బరిలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులతో సంతకాల సేకరణ నిర్వహించి మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సాక్షి జర్నలిజం స్కూల్ ప్రిన్సిపాల్ దిలీప్‌రెడ్డి మాట్లాడుతూ సమాజంలో అన్ని వర్గాల వారూ రేప్ ఫ్రీ ఇండియా ఉద్యమానికి సహకరించాలన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులను ఆపేందుకు చేస్తున్న ఏ చిన్న ప్రయత్నమైనా అభినందించాలన్నారు. ప్రస్తుతం సినీ పరిశ్రమలో 70 నుంచి 80 శాతం మంది డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు కాలేజ్ డ్రాప్ అవుట్ అయినవారే ఉన్నారని, వారు తీసే సినిమాలవల్ల సమాజంపై ఎలాంటి ప్రభావం పడుతుందో వారికి అవగాహన లేదని, అందుకే కమర్షియల్ సినిమాలను నిర్మిస్తున్నారన్నారు. కైలాష్ సత్యార్థి ఫౌండేషన్ రీజినల్ డైరెక్టర్ ఓం ప్రకాష్ మాట్లాడుతూ, మహిళలపై అత్యాచారాలు నిరోధించేందుకు తాము చేపట్టిన భారత యాత్ర విజయవంతమైందని తెలిపారు. ఎంవీ ఫౌండేషన్ నేషనల్ కన్వీనర్ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. బాల్య వివాహాలను ఆపాలని, మహిళలపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలపై అవగాహన కల్పించాలన్నారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ శ్యామల మాట్లాడుతూ.. చట్టాలు పిల్లలకు అనుకూలంగా ఉండాలన్నారు. హ్యూమన్ రైట్స్ ఫోరం ప్రతినిధి జీవన్‌కుమార్ మాట్లాడుతూ.. పోలీసుల మైండ్ సెట్లో మార్పు రాలేదని, అత్యాచార కేసుల్లో ఇప్పటికీ ఫిర్యాదులు స్వీకరించడం లేదన్నారు. తరుణి స్వచ్ఛంధ సంస్థ అధ్యక్షురాలు మమతా రఘువీర్, అసోసియేషన్ ఫర్ ప్రమోటింగ్ సోషల్ యాక్షన్ డైరెక్టర్ ఎస్. శ్రీనివాస్‌రెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
గొప్ప మానవతావాది పద్మనాభరెడ్డి
సాక్షి, హైదరాబాద్: నీతి, నిజాయితీ, విలువలకు తుదివరకు కట్టుబడి త్రికరణశుద్ధిగా న్యాయవాద వృత్తిని కొనసాగించిన అరుదైన అతికొద్దిమంది న్యాయవాదుల్లో చాగరి పద్మనాభరెడ్డి ఒకరు. ఉభయ రాష్ట్రాల్లో పద్మనాభరెడ్డి గురించి తెలిసిన ప్రతీఒక్కరూ చెప్పేమాట ఇదే. తాను నమ్మిన విలువలద్వారా ప్రజల హక్కుల్ని కాపాడిన గొప్ప మానవతావాది ఆయన. కేసుల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయడం మొదలు ఆపన్నులకు ఉచిత న్యాయ సహాయం అందించడంలో ఆయన తరువాతే ఎవరైనా. ఆయన్నుంచీ నేర్చుకోవాల్సిన సుగుణాలెన్నో ఉన్నాయని విశ్రాంత న్యాయమూర్తులు, ప్రస్తుత న్యాయమూర్తులు ముక్తకంఠంతో చెబుతారు. వామపక్షవాదిగా చివరివరకు ప్రజా ఉద్యమాలకు తన అండదండలు అందించారు. 2013, ఆగస్టు 4న ఆయన తుదిశ్వాసవిడిచారు. ఆయనకు గురువే దైవం.. అనంతపురంజిల్లా యాడికి గ్రామంలో 1931, మార్చి 18న మధ్యతరగతి కుటుంబంలో పద్మనాభరెడ్డి జన్మించారు. తండ్రి ఓబుల్‌రెడ్డి, తల్లి సోమక్క. 5వ తరగతి వరకు యాడికి వీధి బడిలో చదివారు. 6 నుంచి 8 తరగతుల్ని తాడిపత్రి మున్సిపల్ హైస్కూలులో చదివారు. గుత్తిలోని లండన్ మిషన్ హైస్కూల్లో ఎస్ఎస్ఎల్సీ పూర్తి చేశారు. తరువాత గుంటూరు ఏసీ కాలేజీలో ఇంటర్ పూర్తి చేసి, అనంతపురం గవర్నమెంట్ కాలేజీలో బీఎస్సీ, మద్రాస్ వర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. 1953లో మద్రాస్ హైకోర్టులో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. కొంతకాలం అక్కడే ప్రాక్టీస్ చేసి 1954లో గుంటూరు(ఆంధ్ర హైకోర్టు)లో, 1956లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ప్రాక్టీస్ మార్చారు. ప్రముఖ న్యాయకోవిదులు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఓ.చిన్నపరెడ్డిని ఆయన దైవంగా భావించారు. చిన్నపరెడ్డే తన గురువూ, మార్గదర్శకుడిగా చెప్పేవారు. తాను సాధించినదంతా చిన్నపరెడ్డి చలవేనని, ఆయన చూపిన ప్రేమాభిమానాల్ని ఎన్నటికీ మరిచిపోలేమని ఎంతో వినమ్రంగా చెప్పేవారు. సుదీర్ఘ ప్రస్థానం..: పద్మనాభరెడ్డిది న్యాయవాదిగా 60 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం. అంతకాలంపాటు ఆయన క్రిమినల్ లాయర్‌గా న్యాయవ్యవస్థకు సేవలందించారు. ఎంతోమంది న్యాయమూర్తులు తమ సందేహాలను ఆయనద్వారా నివృత్తి చేసుకునేవారు. హైకోర్టులో అరవై వేలకుపైగా కేసులు వాదించిన ఆయన.. ఫీజులతో నిమిత్తం లేకుండా కేసుల్ని వాదించేవారు. ఎన్నడూ ఫీజుకోసం అడిగింది లేదు. ఫీజు ఇవ్వలేని స్థితిలో ఉన్నవారు ఒకవేళ అప్పోసొప్పో చేసి ఫీజు తెచ్చి ఉంటే.. ఆ విషయాన్ని ఆయన వెంటనే గ్రహించి ఆ డబ్బును వారికే తిరిగిచ్చేవారు. ఒక్కోసారి చార్జీలకు సైతం ఆయన తన జేబులోనుంచి డబ్బుతీసి వారికిచ్చేవారని ఆయన్ను దగ్గరనుంచి చూసిన న్యాయవాదులు చెబుతుంటారు. ఎన్కౌంటర్ల సమయంలో ఎదురుకాల్పులు జరిగినప్పుడు, పోలీసుల కాల్పుల్లో ఎవరైనా చనిపోతే, అందుకు బాధ్యులైన పోలీసులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలా? వద్దా? అన్న సందేహం హైకోర్టుకు వచ్చింది. సందేహనివృత్తికి వెంటనే హైకోర్టుకు గుర్తుకొచ్చేది పద్మనాభరెడ్డే. ఈ అంశంపై విచారణ జరిపిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం కోర్టు సహాయకారి(అమికస్ క్యూరీ)గా పద్మనాభరెడ్డిని నియమించింది. ఆత్మరక్షణకోసం ఎదురుకాల్పులు జరిపామని పోలీసులు కోర్టులో నిరూపించుకోవాలని, కేసు నమోదు చేయకుండా పోలీసులే తీర్పునివ్వడం చట్టవ్యతిరేకమని ఆయన వాదించారు. ఆయన వాదనల్ని అంగీకరించిన ధర్మాసనం.. ఎన్కౌంటర్లలో అవతలి వ్యక్తులు మృతిచెందితే అందులో పాల్గొన్న పోలీసులపై కేసు నమోదు చేయాలని సుదీర్ఘమైన తీర్పును వెలువరించింది. అపార పరిజ్ఞానం ఆయన సొంతం తనకున్న అపార పరిజ్ఞానంతో కేసులో వైరుధ్యాలను, చట్టవ్యతిరేక అంశాలను, సాక్ష్యాలను, సహజ న్యాయశాస్త్ర ఉల్లంఘనలను పద్మనాభరెడ్డి సులభంగా ఎత్తిచూపేవారు. ఇంత పరిజ్ఞానము న్నా ఆయన అతి సాధారణ వ్యక్తిగానే చెలామణి అయ్యారు. ఎవరిపైనా కోపాన్ని ప్రదర్శించి ఎరుగరు. ఎవరు ఏ సలహా అడిగినా విసుగూ, విరా మం లేకుండా చెప్పడం ఆయనకే చెల్లింది. రాజకీయ విశ్వాసాలకు సంబంధించిన కేసుల్ని వాదిం చారంటూ ఇంటెలిజెన్స్ వర్గాలు ఆయనకు వ్యతిరేకంగా నివేదికివ్వడంతో పద్మనాభరెడ్డి హైకోర్టు జడ్జి కాలేకపోయారు. కానీ ఆయన కుమారుడు జస్టిస్ ప్రవీణ్‌కుమార్ ఏపీ హైకోర్టు తొలి తాత్కాలిక సీజే గా నియమితులై చరిత్ర సృష్టించారు. -
ఆద్యంతం ధన ప్రవాహమే
సాక్షి, హైదరాబాద్: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ఆద్యంతం డబ్బు, మద్యం పంపిణీ చుట్టూనే తిరిగిందని తెలంగాణ ఎన్నికల నిఘా వేదిక పేర్కొంది. పార్టీలతో సంబంధం లేకుండా అభ్యర్థులు విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేశారని తెలిపింది. అధికారుల తనిఖీల్లోనూ రికార్డు స్థాయిలో నగదు దొరికిందని, ఇంత పెద్దమొత్తంలో ధన ప్రవాహం ఇప్పటివరకూ జరగలేదని వ్యాఖ్యానించింది. ఈ అక్రమాలను అరికట్టడంలో ఎన్నికల సంఘం సైతం పూర్తిగా విఫలమైందని నిఘా వేదిక అభిప్రాయపడింది. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం జరిగిన తెలంగాణ ఎన్నికల నిఘా వేదిక సమావేశంలో రాష్ట్ర కోఆర్డినేటర్లు ఎం.పద్మనాభ రెడ్డి, డాక్టర్ రావు చెలికాని, బండారు రామ్మోహన్రావు, బి.శ్రీనివాస్‌రెడ్డి, వై.రాజేంద్రప్రసాద్ పాల్గొని తాజా అసెంబ్లీ ఎన్నికల్లో పరిశీలించిన అంశాలను జిల్లాల వారీగా నివేదించారు. ఓటరు జాబితాలో భారీగా అక్రమాలు ఓటరు జాబితాలో భారీగా అవకతవకలు జరిగాయని, కొత్తగా ఓటర్లు నమోదై స్లిప్పులు పొందినప్పటికీ చివరి నిమిషంలో వారి ఓట్లు గల్లంతయ్యాయని నిఘా వేదిక సభ్యులు తెలిపారు. ఈ అంశాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తే సీఈఓ రజత్‌కుమార్ క్షమాపణ చెప్పి చేతులెత్తేశారన్నారు. చాలాచోట్ల కొత్త ఓటర్లు నమోదు కాగా...పాత ఓటర్లు భారీగా తొలగించబడ్డారని, కొన్నిచోట్ల ఉద్దేశపూర్వకంగా తొలగించినట్లు కనిపించిందన్నారు. నగదు, మద్యం పంపిణీ, ఓటరు జాబితాలో అవకతవకలపై కనీసం వచ్చే ఎన్నికల్లోనైనా సమూల మార్పులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఓటరు జాబితాను ఆన్లైన్లో ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో పెడితే డ్యూయల్ ఓట్లు తగ్గిపోతాయని, ఓటరు కార్డును ఆధార్ నంబర్‌తో అనుసంధానం చేయాలని సూచించారు. రాజకీయ పార్టీల ఖర్చుపై సీలింగ్ విధించాలని, నామినేషన్ ప్రక్రియలో అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్లను పూర్తిస్థాయిలో పరిశీలించాలన్నారు. త్వరలో గ్రామ పంచాయతీ, పార్లమెంటు, సహకార, మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం పక్కాగా పనిచేయాలని కోరారు. త్వరలో జరిగే ఎన్నికలకు తెలంగాణ ఎన్నికల నిఘా వేదిక ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తుందని, ఓటర్లలో అవగాహన పెంచడంతో పాటు ఓటు వేసేలా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. ఈ నివేదిక ప్రతులను త్వరలో జిల్లా కలెక్టర్లకు అందజేయనున్నట్లు తెలిపారు. -
ఎన్నికల్లో ప్రజా సంఘాల భాగస్వామ్యం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో ప్రజా ఎన్నికల నిఘా వేదికతో సమన్వయం చేసుకుంటామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) రజత్‌కుమార్ హామీనిచ్చినట్లు సుపరిపాలన వేదిక అధ్యక్షుడు పద్మనాభరెడ్డి తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో 20 స్వచ్ఛంద సంస్థల కలయికతో ఎన్నికల నిఘా వేదిక ఏర్పా టు చేశామన్నారు. ఎన్నికల్లో అక్రమాలు, ఓటర్ల కు ప్రలోభాలను నిర్మూలించడం ద్వారా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిం చేందుకు వేదిక తరఫున కృషి చేస్తామన్నారు. సీఈఓతో సోమవారం సచివాలయంలో సమావేశమై ఈ మేరకు సహకారం కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. ఓటరు జాబితాలో పేర్ల చేర్పు, ఓటర్లను చైతన్యపరచడంతో పాటు ఎన్నికల అక్రమాలపై నిరంతర నిఘా పెట్టేందుకు వేదిక ద్వారా ఎన్నికల యం త్రాంగానికి సహకరిస్తామన్నారు. నవంబర్ 1న సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి వచ్చే ఎన్నికల నిఘా కార్యకర్తల శిక్షణ సమావేశానికి హాజరు కావడానికి సీఈఓ అంగీకరించినట్లు తెలిపారు. సమావేశంలో లోక్‌సత్తా ఉభయ తెలుగు రాష్ట్రాల కన్వీనర్ బండా రు రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల అక్రమాలపై నిఘా
సాక్షి, హైదరాబాద్: రానున్న ఎన్నికల్లో జరిగే అక్రమాలపై నిరంతరం నిఘా ఉంచటంతోపాటు ఓటరు చైతన్య కార్యక్రమాలను నిర్వహించేందుకు ఎన్నికల నిఘా కమిటీ ఏర్పాటైంది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కమిటీలో వివిధ రంగాల ప్రముఖులు ఉండనున్నారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా ఓటరు చైతన్య కార్యక్రమాలు నిర్వహించనుంది. ఓటరు జాబితాలో అవకతవకలు, పార్టీల మేనిఫెస్టోలు, ప్రచారం, డబ్బు, మద్యం పంపిణీ తదితర అంశాలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుందని పద్మనాభరెడ్డి తెలిపారు. అవసరమైతే ఎన్నికల కమిషన్, పోలీసు, ఇతర అధికారుల దృష్టికి ఈ అంశాలు తీసుకెళ్తామని చెప్పారు. అలాగే అభ్యర్థులతో ఉమ్మడి వేదికలు నిర్వహించడం, ఓటింగ్ శాతం పెంచడానికి ఓటర్లను చైతన్యం చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. 20 స్వచ్ఛంద సంస్థలతో కలసి రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామని వెల్లడించారు. -
రేవంత్ రెడ్డి మామను విచారించిన ఐటీ అధికారులు
సాక్షి, హైదరాబాద్: గత కొద్ది రోజులుగా రాజకీయ నాయకుల ఇళ్లపై ఐటీ దాడులు పొలిటికల్‌గా హాట్ అండ్ హీట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ‘ఓటుకు కోట్లు కేసు’ కు సంబంధించి జరిగిన సోదాల్లో పలు కీలకపత్రాలు, సమాచారం లభించిందని ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం తెలిపింది. ఇప్పటికే ఈ కేసులో ఏ1 గా ఉన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో సహా, అయన బంధవులకు, అనుచరులకు నోటీసులు జారీ చేసింది. దీనిలో భాగంగా రేవంత్ రెడ్డి మామ పద్మనాభ రెడ్డి సోమవారం ఐటీ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘గత నెల 28న నా ఇంటిపై అధికారులు సోదాలు చేసి ఐటీ కార్యాలయాలకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. దానిలో భాగంగా విచారణ నిమిత్తం ఐటీ అధికారులు ముందు హాజరయ్యాను. రేవంత్ రెడ్డి ఆస్తులకు సంబంధించిన వివరాలు అడిగారు. దీంతో పాటు ‘ఓటుకు కోట్లు కేసు’ వివరాలు అడిగారు. ఆ వివరాలు నాకు తెలియదని చెప్పాను. రేవంత్ రెడ్డికి మా కూతురును ఇవ్వక ముందే నేను ఐటీ రిటర్న్స్ కట్టేవాడిని. ప్రస్తుతం రేవంత్ ఉంటున్న ఇల్లు నా కూతురుదే. మళ్లీ కొన్ని ప్రశ్నలతో కూడిన నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులపై ఈ నెల 20లోపు వివరణ ఇవ్వాలని ఐటీ అధికారులు కోరారు’అంటూ విచారణ వివరాలను పద్మనాభ రెడ్డి మీడియాకు తెలిపారు. -
చాటుమాటు పాలన..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రహస్య పాలన సాగుతోంది. ప్రభుత్వ పరిపాలన రోజురోజుకు గోప్యమవుతోంది. సర్కారు జారీ చేసే ఉత్తర్వులు ప్రజలు తెలుసుకోడానికి అందుబాటులో తెచ్చిన జీఓఐఆర్ (గవర్నమెంట్ ఆర్డర్స్ ఇష్యూ రిజిస్టర్) వెబ్సైట్లో జీవోల నమోదు క్రమంగా తగ్గిపోతోంది. గత మూడేళ్లలో వెబ్సైట్లో జీవోల అప్లోడ్ తంతు మూడో వంతుకు పడిపోయింది. చిన్నాచితకా అంశాల జీవోలు మినహా.. పాలనాపరమైన అంశాలు, అభివృద్ధి కార్యక్రమాలు, నియామకాలకు సంబంధించిన కీలక జీవోలను బహిర్గతం చేయడం లేదు. పాలనలో పారదర్శకత పాటిస్తున్నామని గొప్పలు చెబుతున్న సర్కారు.. కీలక నిర్ణయాలు, ఆదేశాల జారీలో మాత్రం గోప్యత పాటిస్తోంది. 2017లో 8,600 జీవోలే 2015 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు అన్ని ప్రభుత్వ శాఖలు కలిపి 21,702 జీవోలు వెబ్సైట్లో అప్లోడ్ చేయగా.. 2017లో కేవలం 8,696 జీవోలే అప్లోడ్ అయ్యాయి. ఈ లెక్కన మూడేళ్లలో జీవోల సంఖ్య మూడో వంతుకు పతనమైంది. పాలనాపర అంశాలపై సరైన సమయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకొని జీవోలు జారీ చేస్తున్నా.. వాటిని వెబ్సైట్లో మాత్రం అప్లోడ్ చేయడం లేదు. సాంకేతిక విభాగం క్రియాశీలకంగా వ్యవహరించకపోవడంతోనే జీవోలు ప్రజల్లోకి వెళ్లడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల బదిలీలకు సంబంధించి ఉత్తర్వులు రెండు, మూడేళ్లుగా వెబ్సైట్లో కనిపించడం లేదు. ఉన్నతాధికారుల బదిలీలు, కొందరి నియామకాలు, పదోన్నతులు, శాఖాపరమైన అంశాలు, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల జీవోలు కూడా వెబ్సైట్లో అప్లోడ్ చేయడం లేదు. కొన్ని ఆయా శాఖల ప్రత్యేక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నా ఆ వెబ్సైట్లపై అవగాహన లేక వివరాలు ప్రజల్లోకి వెళ్లడం లేదు. కుప్పలుతెప్పలుగా సాధారణ జీవోలు చిన్నాచితకా ఉత్తర్వులే వెబ్సైట్లో కుప్పలుతెప్పలుగా కనిపిస్తున్నాయి. అధికారులు, ఉద్యోగులకు టీఏ, డీఏ మంజూరు, పేపర్ బిల్లుల చెల్లింపులు, స్టేషనరీ, లేబర్ కేసుల వివరాలు వందల్లో దర్శనమిస్తున్నాయి. ఇవి ప్రజలకు పెద్దగా ఉపయోగపడనప్పటికీ.. ప్రత్యేకంగా అప్లోడ్ చేస్తుండటం విశేషం. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలు ప్రజలకు అందుబాటులో ఉంచాలంటూ గవర్నర్‌కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ ఇటీవల ఫిర్యాదు చేసింది. త్వరలో ఈ అంశంపై న్యాయపోరాటానికి కూడా సిద్ధమవుతున్నట్లు సంస్థ కార్యదర్శి, మాజీ ఐఎఫ్ఎస్ అధికారి ఎం.పద్మనాభరెడ్డి చెప్పారు. -
పద్మనాభరెడ్డి సేవలు మరువలేనివి
తిరుమలగిరి : తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసినగొప్ప వ్యక్తి సంకెపల్లి పద్మనాభరెడ్డి అని.. ఆయన సేవలు మరువలేనివని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి కొనియాడారు. మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన మాజీ ఎంపీపీ పద్మనాభరెడ్డి సంతాపసభకు మంత్రి హాజరై నివాళులర్పించి మాట్లాడారు. పదవుల కోసం పాకులాడకుండా నిస్వార్థంగా సేవలందించిన వ్యక్తి పద్మనాభరెడ్డి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌కుమార్, వేముల వీరేశం, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పాశం విజయయాధవరెడ్డి, గాదె నిరంజన్‌రెడ్డి, ఎస్.రఘునందన్‌రెడ్డి, ఉప్పలయ్య, ఎంపీపీ కొమ్మినేని సతీష్, జెడ్పీటీసీ పేరాల పూలమ్మ, మార్కెట్ కమిటీ వైస్‌చెర్మన్ యుగేంధర్‌రావు, పీఏసీఎస్ చైర్మన్ అశోక్‌రెడ్డి, శోభన్‌బాబు తదితరులు పాల్గొన్నారు. సంకెపల్లి మృతి..కాంగ్రెస్‌కు తీరని లోటు : ఎమ్మెల్సీ మాజీ ఎంపీపీ సంకెపల్లి పద్మనాభరెడ్డి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో గురువారం పద్మనాభరెడ్డి సంతాప సభకు హాజరైన అనంతరం స్థానికంగా విలేకరులతో మాట్లాడారు. తిరుమలగిరిలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, వ్యవసాయ మార్కెట్, వాణిజ్య బ్యాంకుల ఏర్పాటుకు పద్మనాభరెడ్డి ఎంతో కృషిచేశారని పేర్కొన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ నియోజక ఇన్చార్జి గుడిపాటి నర్సయ్య, చెవిటి వెంకన్న యాదవ్, సంకెపల్లి కొండల్‌రెడ్డి, సీహెచ్ రాజగోపాల్‌రెడ్డి, చంద్రశేఖర్, రాజయ్య, రాంబాబు, హఫీజ్, నరేష్, సోమేష్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్రావు కూడా హాజరై నివాళులర్పించారు. -
మంచి పాలన కోసం ‘టీఎలక్షన్ వాచ్’
‘మంచి మున్సిపల్ కార్పొరేషన్ కావాలంటే మంచి కార్పొరేటర్‌ను ఎన్నుకోవాలి. అంటే ఆ అభ్యర్థికి నేరచరిత్ర ఉండకూడదు.కాంట్రాక్టర్ కాకూడదు. చదువుకున్నవాడై ఉండాలి. నలుగురికీ సేవ చేయాలన్న తపన ఉండాలి. ఇటువంటి అభ్యర్థులను గెలిపించుకునేందుకు సిటీ వాసులు కూడా ఓటింగ్‌కు పోటెత్తాలి. గతంలో నమోదైన 35 శాతం పోలింగ్‌ను 70 శాతం వరకు పెంచాలి. యువత ఇందులో ప్రధాన పాత్ర పోషించాలి..’అని పిలుపునిస్తోంది 20 పౌరసేవా సంస్థలు, 30 మంది సామాజిక కార్యక్రమాలతో ఏర్పాటైన తెలంగాణ ఎలక్షన్ వాచ్. ఈ కార్యక్రమ ఉద్దేశాలను లక్డీకాపూల్‌లోని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యాలయంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆ సంస్థ కన్వీనర్ పద్మనాభ రెడ్డి, ఆర్డబ్ల్యూఏ ప్రతినిధి డాక్టర్ రావ్ చెలికాని, అప్పా డెరైక్టర్ శ్రీనివాస్, లెట్స్ వోట్ నిర్వాహకుడు రాఘవేంద్ర మీడియాకు తెలిపారు. తమ సంస్థ ఏ రాజకీయ పార్టీకి, వ్యక్తికి సంబంధించింది కాదని స్పష్టం చేశారు. నేర చరితులు పాలకులుగా ఎంపిక కాకూడదనే ఉద్దేశంతో హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్లకు లేఖలు రాసి నేరగాళ్ల జాబితాను తీసుకుంటున్నామని తెలిపారు. నామినేషన్ సమయాల్లో అభ్యర్థులు సమర్పించే ఆఫిడవిట్లతో వారికి ఏమైనా నేరచరిత్ర ఉందో తెలుసుకుంటామన్నారు. ఒక వేళ నేరచరితులు ఎన్నికల్లో పాల్గొంటే.. ఓటింగ్ కి నాలుగు రోజుల ముందు నుంచి అభ్యర్థుల నేర చరిత్రను జనానికి చెబుతామన్నారు. నో యువర్ క్యాండిడేట్ పేరుతో ఉమ్మడి చర్చా వేదిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కాగా.. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రచారం చేయనున్నట్లు వివరించారు. ఎన్నికల ముందు, పోలింగ్ రోజు జరిగే అక్రమాలపై ప్రజలకు సమాచారం ఇచ్చేలా నిఘావేదికను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాగా.. కార్పోరేటర్ కావాలంటే రాజకీయ పార్టీలన్నీ మంచివారికే టికెట్ ఇవ్వాలనీ.. స్థానికులకే టికెట్ ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలకు లేఖలు రాశామని తెలిపారు. కొన్ని రాజకీయ పార్టీలు తమ లేఖకు సానుకూలంగా స్పందించినట్లు వివరించారు. -
ప్రాణహితకు జాతీయ హోదా కష్టమే
సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు జస్టిస్ రెడ్డపరెడ్డి, కార్యదర్శి పద్మనాభరెడ్డి వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కడం కష్టమేనని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ రాష్ట్ర అధ్యక్షుడు జస్టిస్ రెడ్డపరెడ్డి, కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి అభిప్రాయపడ్డారు. అంతర్రాష్ట్ర వివాదాలు, పర్యావరణ, అటవీ, నీతి ఆయోగ్ అనుమతులు, ప్రాజెక్టుకయ్యే వ్యయం తేలకుండా జాతీయ హోదా ఎలా దక్కుతుందని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. 2004 నుంచి ప్రాజెక్టుకు జాతీయ హోదా అంటూ ప్రకటనలు చేస్తూ వచ్చారని, వాస్తవాలు ప్రజలకు తెలిసేలా ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జస్టిస్ రెడ్డపరెడ్డి, పద్మనాభరెడ్డి గురువారమిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదంటూనే ప్రాజెక్టును ఎలా పూర్తి చేస్తారని పలు ప్రశ్నలు సంధించారు. * ప్రాజెక్టుకు రూ.50 వేల కోట్ల వ్యయమవుతుంది. ఆలస్యమైతే వ్యయం మరింత పెరగవచ్చు. ప్రాజెక్టు పూర్తయితే 12 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది. ప్రస్తుత అంచనా ఖర్చు మేరకు ఎకరానికి రూ.4 లక్షల ఖర్చు అవుతోంది. ఇక 1,200 అడుగుల ఎత్తు నుంచి నీటిని ఎత్తిపోయాలంటే 2,527 మెగావాట్ల విద్యుత్ అవసరం. దీనికి ఏడాదిలో ఒక్కో ఎకరానికి లెక్కిస్తే రూ.15 వేల మేర ఖర్చువుతుంది. ఈ స్థాయిలో విద్యుత్, నిధులు ఎక్కడి నుంచి తెస్తారు? ఇంత ఆర్థిక భారం ఎలా మోస్తారు? * ప్రాజెక్టుతో ముంపునకు గురయ్యే అటవీ భూమికి ఇంతవరకూ పరిహార భూమిని ఇవ్వలేదని అటవీ శాఖ చెబుతోంది. పర్యావరణ అనుమతులు సైతం లభించలేదు. ఎత్తుపై మహారాష్ట్ర అంగీకరించాలి. ఇలా 18 అంశాలపై ఏమీ తేలకుండా జాతీయ హోదా దక్కడం సాధ్యం కాదు. అంతర్రాష్ట్ర వివాద పరిష్కారం కోసం గతంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో చర్చలు జరిగి మండలి ఏర్పాటుకు ఒప్పందం కుదిరినా, అది ఒక్కమారు సైతం సమావేశం కాలేదు. అలాంటప్పుడు కొత్తగా ఏర్పాటు చేసే ఉన్నత స్థాయి కమిటీ ఎంతవరకు పనిచేస్తుంది? * వ్యాప్కోస్ సర్వే నివేదిక ప్రకారం ప్రాణహిత నదిపై ఆనకట్ట అవసరం లేదు. మరి 152 మీటర్ల ఎత్తుతో ఆనకట్ట కట్టాలని, దానికి మహారాష్ట్ర అభ్యంతరం తెలిపిందని, ఎత్తు తగ్గించుకునేందుకు తెలంగాణ ఒప్పుకుందన్న కథనాలపై వివరణ ఇవ్వాలి. * ఒకవేళ ప్రాజెక్టుకు జాతీయ హోదా లభించని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం సాధ్యమేనా? * మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్లకు నాలుగేళ్లలో 48 వేల కోట్లు అంటే సాలీనా 12 వేల కోట్లు అవసరం. అలాంటప్పుడు ప్రాజెక్టుకు ఏడాదికి రూ.5 వేల కోట్లు కేటాయించినా 2025 నాటికైనా ప్రాజెక్టు పూర్తవుతుందా? * పర్యావరణానికి సంబంధించి మొదటి దశ అనుమతులు కూడా ఇవ్వలేదని అటవీ శాఖ చెబుతోంది.. ఇది నిజమేనా? -
మిషన్ కాకతీయ నుంచి మోడల్ విలేజ్
సందర్భం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయలో చెరువుల పునరుద్ధరణ అనేది మొదటి దశ మాత్రమే. తర్వాత చెరువును కేంద్ర బిందువుగా చేసి, గ్రామాలను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి వాటిని మోడల్ గ్రామాలుగా మార్చాలి. ఈ మధ్యకాలంలో దేశం మొత్తంమీద ఆయా ప్రభుత్వా లు చేపట్టిన పథకాలలో తెలం గాణ ప్రభుత్వం ప్రకటించిన ‘మిషన్ కాకతీయ’ ప్రథమ స్థా నంలో నిలుస్తుంది. సేద్యమే జీవనాధారమైన తెలంగాణలో పూర్వకాలం నుంచి వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనడానికి నీటి నిల్వలపై ఎంతో శ్రద్ధ కనపరిచారు. గ్రామ గ్రామాన చిన్న కుంటల నుంచి పెద్ద చెరువుల వరకు అలాగే భౌగోళిక పరిస్థితులను బట్టి ఒక దాని కింది భాగాన ఇంకొకటి చొప్పున గొలు సుకట్టు చెరువుల నిర్మాణం జరిపారు. గత 50, 60 సంవత్సరాలలో ఈ చెరువులు నిరాద రణకు గురయ్యాయి. చెరువులోకి నీరు పారే కాలువలు పూడిపోవడం, చెరువులలో పూడిక నిండటం, కబ్జాలు వంటి పలు కారణాలతో వందల ఎకరాలకు నీరు అం దించే చెరువులు పదుల ఎకరాలకే పరిమితమయ్యాయి. చెరువులలో నీటి నిల్వ తగ్గడంతో భూగర్భ జలాలు అడుగంటి దిగుబడులు తగ్గిపోయాయి. ఇక బోరు బావులలో కూడా వందల అడుగుల మేరకు తవ్వినా నీరు లేని పరిస్థితి ఏర్పడింది. చిన్న నీటిపారుదలపై శ్రద్ధ లేకపోవడంతో చెరువులు మరమ్మతులకు నోచుకోక పూడికతో, పిచ్చి మొక్కలతో నిండిపోయాయి. చెరువు నీటిపై ఆధారపడ్డ వ్యవసాయ రంగం కుదేలైంది. ఈ నేపథ్యంలో మిషన్ కాకతీయ ప్రణాళికను స్వాగతించాలి. చెరువుల పునరుద్ధరణతో గ్రామాల్లో వ్య వసాయం, మంచినీటి లభ్యత మెరుగుపరచవచ్చు. పైగా చెరువును కేంద్రబిందువుగా చేసి గ్రామం అన్ని రంగాలలో అభివృద్ధి చెందేలా కార్యక్రమం చేపట్టాలి. దానితో ఒక మోడల్ గ్రామం రూపొందాలంటే మిషన్ కాకతీయను, స్వచ్ఛభారత్ లాంటి కార్యక్రమాలతో అనుసంధానం చేయాలి. స్వచ్ఛభారత్ కార్యక్రమం కింద గ్రామంలో చేయవలసిన పనులలో ముఖ్యమైనవి. 1) మిషన్ కాకతీయ కింద ఎంపికైన గ్రామంలో 100% మరుగుదొడ్ల నిర్మాణం జరగాలి. 2) ఇప్పటికీ గ్రామాలలో 50% జనాభా కట్టెలతోనే వంట చేస్తారు. దానితో ఇల్లంతా పొగచూరడం, పిల్లలకు శ్వాసకోశ జ బ్బులు రావడం జరుగుతుంది. దీనిని నివారించడానికి పొగరాని పొయ్యిల నిర్మాణం జరగాలి. 3) ఇంటిలో వీలును బట్టి పొట్టి రకాలైన బొప్పాయి, జామ, మునగ, కరివేపాకు వంటి చెట్లు నాటాలి. వీటిలో పోషక విలు వలు అధికంగా ఉండి పిల్లలకు పోషకాహార లభ్యత మెరుగుపడుతుంది. 4) చెరువులో పూడిక తీసిన తరు వాత పెద్ద ఎత్తున తుమ్మచెట్లు నాటాలి. ఇవి నీటి పైభా గంలో ఒక గొడుగు మాదిరిగా విస్తరించి నీరు ఆవిరి కాకుండా ఆపుతాయి. 5) ప్రస్తుతం 5 హెచ్.పి. సౌరశక్తి మోటారు మొత్తం ఖర్చు సుమారు 5 లక్షలపైబడి ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీ పోను రైతుకు సుమారు రూ.2 లక్షల వరకు వస్తుంది. దీనిపై మోడల్ గ్రామాల రైతులకు లక్ష కు ఒక సౌరశక్తి మోటారు అందజేస్తే4, 5 ఏళ్లలో సౌరశక్తితో నడిచే బోరుబావులు వాడకంలోనికి వస్తాయి. 6) మిషన్ కాకతీయ కింద ఎంపికైన గ్రామంలోని అన్ని వ్యవసాయ భూములలో భూసార పరీక్ష జరిపి, ప్రతి సర్వే నంబర్‌కు భూసార పరీక్ష కార్డు అందజేయాలి. 7) చెరువులో పూడిక తీసిన మట్టిని పొలాలలోనికి తరలిం చిన రైతులను ఆదర్శ రైతులుగా గుర్తించాలి. 8) రసాయ న ఎరువులు వాడని వారికి తాలూకా/ జిల్లా స్థాయిలో ప్రశంసాపత్రాలు ఇవ్వాలి. 9) గ్రామంలో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ వంటి కార్యక్రమాలు వీలును బట్టి చేప ట్టాలి. 10) ప్రతి బడిలో మరుగుదొడ్లు నిర్మించి, వాటిని ప్రతిదినం శుభ్రపరిచే వ్యవస్థ ఏర్పాటు చేయాలి. 11) శాసనసభ్యుల, పార్లమెంట్ సభ్యుల ఫండ్ నుంచి మిషన్ కాకతీయ గ్రామాలలో మాత్రమే ఖర్చు చేయాలి. 12) గ్రామాల్లో మహిళా మండళ్లు, యూత్ క్లబ్‌లు, డ్వాక్రా గ్రూపులు, అంగన్వాడీ కేంద్రాలు వంటివి బాగా పని చేయడానికి సంబంధిత శాఖల సిబ్బంది మిషన్ కాకతీయ గ్రామాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. 13) వ్యవసాయరంగంలో నీటి పొదుపు కొరకు బిందు, తుంపర్ల సేద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. 14) చెరువు బాగు కాగానే రెండు పంటలు వరి వేయ కుండా, రెండవ పంట ఆరుతడి పంటలు వేసే విధంగా చర్యలు చేప ట్టాలి. 15) చెరువులో నీళ్లుంటే చేపల పెంపకం ఒక లాభ సాటి వృత్తి. దీనికి జిల్లా మత్స్యశాఖ మిషన్ కాకతీయ గ్రామాలలో దృష్టి కేంద్రీకరించాలి. 16) చెరువుగట్టుపై వెదురు మొక్కలు నాటాలి. గ్రామ స్థాయిలో వెదురు కుటీర పరిశ్రమకు ముడిసరుకు. 17) విద్యాశాఖ, గ్రామ పంచాయతీ మిషన్ కాకతీయ గ్రామంలో 100% పిల్లలు బడిలోనికి వెళ్లేలా చూడాలి. ఇలా జిల్లాస్థాయిలో, గ్రామాభివృద్ధికి సంబంధిం చిన అన్ని ప్రభుత్వ శాఖలు మిషన్ కాకతీయ గ్రామంలో పనిచేసి అట్టి గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా అభి వృద్ధి చేయడానికి ప్రణాళిక ఏర్పాటు కావాలి. జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమాలు కొత్త కాదు కాని ఒక సరైన ప్రణాళికతో మిషన్ కాకతీయలో ఎంపికైన గ్రామాలలో కేంద్రీకరించిన ఫలితాలు వస్తాయి. గ్రామాల్లో వ్యవసా యం చాలామటుకు యాంత్రీకరణకు గురైంది. ఈ నేప థ్యంలో గ్రామం మొత్తం ఒక ఆదర్శ గ్రామంగా అభి వృద్ధి చెందాలంటే స్వచ్ఛభారత్ కార్యక్రమంతో అను సంధానం చేస్తూ, ఒకటి లేక రెండేళ్ల గ్రామీణ అభివృద్ధికి సంబంధించిన అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. (వ్యాసకర్త కార్యదర్శి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్) -
ఎంఎంటీఎస్-2కు రూ.20.83 కోట్లు
బడ్జెట్లో కేటాయింపులతో పనులు వేగిరమయ్యే అవకాశం సాక్షి, సిటీబ్యూరో: ఎంఎంటీఎస్ రెండో దశకు బడ్జెట్లో రూ.20.83 కోట్లు కేటాయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి భాగస్వామ్యంతో చేపట్టిన ఎంఎంటీఎస్ రెండో దశకు అప్పటి రాష్ట్రప్రభుత్వం గతేడాది రూ.190 కోట్లు కేటాయించింది. తాజాగా మరోసారి కేటాయించిన రూ.20.83 కోట్ల నిధులతో రాష్ట్రం ఇప్పటి వరకు రూ.210.83 కోట్లు కేటాయించినట్లయింది. రేల్వేశాఖ తన వాటా కింద గత బడ్జెట్లో రూ.99 కోట్ల నిధులు అందజేసింది. మొత్తం రూ.648 కోట్ల అంచనాలతో రూపొందించిన రెండో దశ ప్రాజెక్టు కోసం రాష్ట్రం 2/3 వంతు, రైల్వేశాఖ 1/4 వంతు చొప్పున నిధులు అందజేయవలసి ఉంటుంది. ఇప్పటి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేసిన నిధులతో వివిధ మార్గాల్లో పనులు ప్రారంభమయ్యాయి. 10 కిలోమీటర్లు ఉన్న పటాన్చెరు-తెల్లాపూర్ రైలు మార్గం పునరుద్ధరణ పనులను చేపట్టారు. అలాగే సికింద్రాబాద్ నుంచి బొల్లారం వరకు ఉన్న 15 కి.మీ లైన్ ల డబ్లింగ్, విద్యుదీకరణ పనులు కూడా మొదలయ్యాయి. ఆ మార్గంలో కొన్ని కొత్త రైల్వేస్టేషన్లను నిర్మించడంతో పాటు, ప్లాట్‌ఫామ్‌ల ఎత్తు పెంచడం, అదనపు షెడ్లు ఏర్పాటు చేయడం వంటి రీమోడలింగ్ పనులు చేపట్టారు. గత సంవత్సరం టెండర్లను ఆహ్వానించిన అధికారులు ఈ ఏడాది నిర్మాణ పనులను ప్రారంభించారు. దశలవారీగా 2016-17 నాటికి రెండో దశ పూర్తి చేయాలన్నది ఈ ప్రాజెక్టు లక్ష్యం. రవాణా రంగానికి బాగానే ఇచ్చారు మొత్తంగా తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన బడ్జెట్ ఫర్వాలేదు. ప్లానింగ్ కోసం నిధులు బాగా కేటాయించారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. రవాణా రంగానికి సంబంధించి నిధులు బాగానే కేటాయించారు. తెలంగాణలో కొత్త బస్సుల కోసం రూ.345 కోట్ల మేరకు కేటాయించడం సంతోషదాయకం. మెట్రోరైలుకు రూ.436 కోట్లు కేటాయించి ప్రభుత్వం మెట్రో రైలుకు తాను ఇస్తోన్న ప్రాధాన్యతను చాటింది. ఎమ్మెల్యేలకు ఇచ్చే నిధులను రూ.కోటి నుంచి రూ.కోటిన్నరకు పెంచడం పట్ల మాత్రం భిన్నాభిప్రాయం ఉంది. ఈ నిధులు సక్రమంగా వినియోగించేందుకు సరైన మార్గదర్శకాలను రూపొందించాలి. -పద్మనాభరెడ్డి, ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రతినిధి -
పద్మనాభరెడ్డి అంత్యక్రియలు
సాక్షి, హైదరాబాద్: గుండెపోటుతో హఠాన్మరణం చెందిన హైకోర్టు సీనియర్ న్యాయవాది సి.పద్మనాభరెడ్డి అంత్యక్రియలు సోమవారం ఈఎస్ఐ శ్మశానవాటికలో నిర్వహించారు. పద్మనాభరెడ్డి చితికి ఆయన కుమారుడు, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ నిప్పంటించారు. అంతకుముందు పద్మనాభరెడ్డి పార్థివదేహాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి వైఎస్.వివేకానందరెడ్డి, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, డీజీపీ దినేష్‌రెడ్డితో పాటు పలువురు న్యాయమూర్తులు, రాజకీయ నాయకులు, న్యాయవాదులు సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం జూబ్లీహిల్స్‌లోని జస్టిస్ ప్రవీణ్‌కుమార్ ఇంటి నుంచి ప్రారంభమైన పద్మనాభరెడ్డి అంతిమయాత్ర మధ్యాహ్నం ఈఎస్ఐ శ్మశానవాటికకు చేరుకుంది. అక్కడ ప్రజాగాయకుడు గద్దర్, వామపక్ష నాయకులు నివాళులర్పించారు. న్యాయవాదిగా పద్మనాభరెడ్డి ప్రజలకు అందించిన సేవలపై కరపత్రాలను ఓపీడీఆర్ కమిటీ సభ్యులు పంచారు. ఆయన సేవలు అజరామరం: ఐఏఎల్ న్యాయవాద వృత్తిలో పద్మనాభరెడ్డి సేవలు అజరామరమని ఇండియన్ అసోిసియేషన్ ఆఫ్ లాయర్స్(ఐఏఎల్) కార్యనిర్వాహక అధ్యక్షుడు చలసాని అజయ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి బి.ప్రభాకర్ పేర్కొన్నారు. హైకోర్టు సీనియర్ న్యాయవాది పద్మనాభరెడ్డి సంతాపసభ సోమవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఐఏఎల్ ఆధ్వర్యంలో జరిగింది. న్యాయవాదిగా పద్మనాభరెడ్డి సేవలను అజయ్‌కుమార్ కొనియాడారు. న్యాయవాదుల హక్కుల కోసం కృషి చేశారని చెప్పారు. డబ్బు గురించి పద్మనాభరెడ్డి ఎప్పుడూ ఆలోచించలేదని, న్యాయం పక్షానే నిలిచారని వివరించారు. న్యాయవాదులు ఆయననొక మార్గదర్శిగా తీసుకొని, ఆయన ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు ఎస్.సత్యంరెడ్డి, విద్యాసాగర్‌రావు, మాజీ ప్రధాన కార్యదర్శి బ్రహ్మారెడ్డిలతో పాటు ఒ.అబ్బాయిరెడి ్డ, చల్లా శ్రీనివాస్‌రెడ్డి తదితర న్యాయవాదులు పాల్గొన్నారు. -
నేడు పద్మనాభరెడ్డి అంత్యక్రియలు
-
హైకోర్టు సీనియర్ న్యాయవాది పద్మనాభరెడ్డి మృతి
హైదరాబాద్: హైకోర్టు సీనియర్ న్యాయవాది పద్మనాభరెడ్డి (83) ఆదివారం మృతి చెందారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంగా బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. హైకోర్టులో పలు కీలక కేసులను ఆయన వాదించారు. పద్మనాభరెడ్డి క్రిమినల్ న్యాయశాస్త్రంలో నిష్ణాడుతుడిగా పేరు గడించాడు. గత నాలుగు దశాబ్దాలుగా ఆయన న్యాయ సేవలందించారు. ఆయన కుమారుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం హైకోర్టుకు జడ్జిగా వ్యవరిస్తున్నారు.