
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ పథకాల పేరుతో ఉచితాలు ఇస్తూ రాష్ట్రఖజానాను ఖాళీ చేసి ప్రభుత్వం అప్పుల పాలు కావొద్దని సుపరిపాలన వేదిక కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి కోరారు. ప్రభుత్వం ఇచ్చే జీవోలన్నీ వెబ్‌సైట్‌లో పెట్టాలని, విద్య, వైద్యం కొరకు అధిక నిధులు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఫ్యాప్సీ హాల్‌లో ఈనెల 19 నుంచి 25 వరకు సుపరిపాలన వారోత్సవాల నిర్వహిస్తున్న నేపథ్యంలో మంగళవారం ‘ప్రశాసన్ గావ్ కి ఓర్’(ప్రభుత్వ పాలన గ్రామాల దిశగా) అంశంపై పద్మనాభరెడ్డి వర్క్‌షాపు ప్రారంభించారు.
ఒక అధికారి ఒకే పోస్టులో ఉండాలని, ఒకవేళ ఏదైనా కారణాలతో అదనపు బాధ్యత నిర్వహించినా అది నెలలోపే ఉండాలని సూచించారు. గ్రామాల్లో పేదలకు నాణ్యమైన విద్య, వైద్యం అందక పేదరికంలో మగ్గిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక సంఘం సూచించిన విధంగా గ్రామాలకు నిధుల విడుదల దయాదాక్షిణ్యంగా కాకుండా హక్కుగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment