ఎన్నికల అక్రమాలపై నిఘా | Surveillance on election irregularities | Sakshi
Sakshi News home page

ఎన్నికల అక్రమాలపై నిఘా

Published Thu, Oct 25 2018 6:05 AM | Last Updated on Thu, Oct 25 2018 6:05 AM

Surveillance on election irregularities - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రానున్న ఎన్నికల్లో జరిగే అక్రమాలపై నిరంతరం నిఘా ఉంచటంతోపాటు ఓటరు చైతన్య కార్యక్రమాలను నిర్వహించేందుకు ఎన్నికల నిఘా కమిటీ ఏర్పాటైంది. ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ కార్యదర్శి పద్మనాభరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కమిటీలో వివిధ రంగాల ప్రముఖులు ఉండనున్నారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా ఓటరు చైతన్య కార్యక్రమాలు నిర్వహించనుంది. ఓటరు జాబితాలో అవకతవకలు, పార్టీల మేనిఫెస్టోలు, ప్రచారం, డబ్బు, మద్యం పంపిణీ తదితర అంశాలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుందని పద్మనాభరెడ్డి తెలిపారు. అవసరమైతే ఎన్నికల కమిషన్, పోలీసు, ఇతర అధికారుల దృష్టికి ఈ అంశాలు తీసుకెళ్తామని చెప్పారు. అలాగే అభ్యర్థులతో ఉమ్మడి వేదికలు నిర్వహించడం, ఓటింగ్‌ శాతం పెంచడానికి ఓటర్లను చైతన్యం చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. 20 స్వచ్ఛంద సంస్థలతో కలసి రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామని వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement