Adarsha raitu
-
ఎన్నికల అక్రమాలపై నిఘా
సాక్షి, హైదరాబాద్: రానున్న ఎన్నికల్లో జరిగే అక్రమాలపై నిరంతరం నిఘా ఉంచటంతోపాటు ఓటరు చైతన్య కార్యక్రమాలను నిర్వహించేందుకు ఎన్నికల నిఘా కమిటీ ఏర్పాటైంది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కమిటీలో వివిధ రంగాల ప్రముఖులు ఉండనున్నారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా ఓటరు చైతన్య కార్యక్రమాలు నిర్వహించనుంది. ఓటరు జాబితాలో అవకతవకలు, పార్టీల మేనిఫెస్టోలు, ప్రచారం, డబ్బు, మద్యం పంపిణీ తదితర అంశాలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుందని పద్మనాభరెడ్డి తెలిపారు. అవసరమైతే ఎన్నికల కమిషన్, పోలీసు, ఇతర అధికారుల దృష్టికి ఈ అంశాలు తీసుకెళ్తామని చెప్పారు. అలాగే అభ్యర్థులతో ఉమ్మడి వేదికలు నిర్వహించడం, ఓటింగ్ శాతం పెంచడానికి ఓటర్లను చైతన్యం చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. 20 స్వచ్ఛంద సంస్థలతో కలసి రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామని వెల్లడించారు. -
చంద్రబాబుకు కృష్ణయ్య ఝలక్!
హైదరాబాద్: ఆదర్శ రైతుల రద్దు అంశపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడుకి స్వంత పార్టీ ఎమ్మెల్యేల నుంచే వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. చంద్రబాబుకు స్వంతపార్టీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఝలక్ ఇచ్చారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు తమ పథకాన్ని కొనసాగించాలని ఇందిరాపార్క్ వద్ద ఆదర్శ రైతులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమంలో పార్టీ విధానానికి వ్యతిరేకంగా ఆర్.కృష్ణయ్య పాల్గొనడం రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఆదర్శ రైతుల తొలగింపులో చంద్రబాబు తీరును కృష్ణయ్య తప్పుపట్టారు. ఆదర్శ రైతుల పథకంలో లోపాలుంటే సరిదిద్దాలని.. కాని వ్యవస్థనే రద్దు చేయడం సబబు కాదని కృష్ణయ్య అభిప్రాయపడ్డారు. -
ఆదర్శ రైతుల ఆగ్రహం
సిద్దిపేట జోన్: రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆదర్శ రైతులు కన్నెర్ర చేశారు. ఆరు సంవత్సరాలుగా గ్రామాల్లో రైతులకు, ప్రభుత్వానికి మధ్య అనుసంధానంగా ఉంటున్న ఆదర్శ రైతు వ్యవస్థను తొలగించే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. సోమవారం సిద్దిపేట ఏడీఏ కార్యాలయం ముట్టడికి యత్నించారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో శాంతి యుతంగా ర్యాలీ నిర్వహించారు. స్థానిక పాత బస్టాండ్ వద్ద ప్రభుత్వ చర్యను నిరసిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీఓ కార్యాలయంలో అందజేశారు. ఆదర్శ రైతు వ్యవస్థ రద్దు చేసి, వారి స్థానంలో వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యార్హత కలిగిన వారిచే ఏఈఓల వ్యవస్థను నిర్మించేం దుకు ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ఈ విషయంపై రాష్ట్ర ఆదర్శ రైతు సంఘం నిరసనకు పిలుపునిచ్చింది. అందులో భాగంగానే సిద్దిపేట సబ్ డివిజన్ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన ఆదర్శ రైతులు సోమవారం స్థానిక మార్కెట్ యార్డులోని వ్యవసాయ శాఖ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఒక దశలో కార్యాలయ ముట్టడికి యత్నించారు. విధుల్లోకి వచ్చే అధికారులను అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న టూ టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వారిని శాంతింపజేసేందుకు యత్నించారు. నిరసన శాంతియుతంగా కొనసాగాలని సూచించారు. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులతో పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. మార్గ మధ్యలో స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీఓ కార్యాలయ అధికారులకు అందజేసి ఆదర్శ రైతు వ్యవస్థను యథాతథంగా కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఆదర్శ రైతు సంఘం ప్రతినిధులు వెంకట్రాంరెడ్డి, సత్యం, మహేందర్, పరశురాములు, మల్లయ్య, కనకయ్య, మధు, యాదయ్య, రాజు పాల్గొన్నారు. ఆదర్శ రైతులపై కేసు అనుమతి లేకుండా సీఎం దిష్టిబొమ్మను దహనం చేసి పట్టణంలో ర్యాలీ నిర్వహించినందుకు గాను 12 మంది ఆదర్శ రైతులపై టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. టూటౌన్ ఎస్ఐ వరప్రసాద్ కథనం మేరకు.. తెలంగాణ రాష్ట్ర ఆదర్శ రైతు సంఘం ఉపాధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి ఆధ్వర్యంలో పలువురు ఆదర్శ రైతులు సోమవారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద సీఎం దిష్టిబొమ్మను అనుమతి లేకుండా దహనం చేసి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సంఘటనలో వెంకట్రాంరెడ్డితో పాటు మరో 11 మంది ఆదర్శ రైతులపై టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఆదర్శ రైతులకు ఉద్వాసన
జిల్లాలో 1,040 మంది రైతుల సేవలు బంద్ సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఆదర్శ రైతులకు ప్రభుత్వం మంగళం పాడింది. వీరితో వ్యవసాయ రంగానికి పెద్దగా ప్రయోజనం చేకూరలేదని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవస్థను రద్దు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో దాదాపు ఏడేళ్లుగా కొనసాగుతున్న ఆదర్శ రైతుల సేవలు నిలిచిపోయినట్టయింది. సాగులో నూతన ఒరవడులతో దూసుకెళ్తున్న రైతులకు సేవలను విస్తృతం చేసేందుకు ఏడేళ్ల క్రితం దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆదర్శ రైతుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సరికొత్త పద్ధతులతో అధిక దిగుబడులు సాధిస్తున్న రైతులను ఈ కార్యక్రమం కింద ఎంపికచేశారు. అయితే వైఎస్సార్ మరణంతో ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఈ పథకంపై నిర్లక్ష్యం చూపారు. నిధులు సకాలంలో విడుదల చేయకపోవడం.. వారికిచ్చే గౌరవ వేతన చెల్లింపుల్లో జాప్యం చేయడం.. ప్రభుత్వ కార్యక్రమాల్లో క్రమంగా వారి ప్రాధాన్యత తగ్గించడంతో ఈ కార్యక్రమం వెనకబడిపోయింది. తాజాగా అధికారం చేపట్టిన టీఆర్ఎస్ ఈ కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలోనే తప్పుకున్న కొందరు.. ఆదర్శ రైతుల కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 1,350 మంది రైతులను ఎంపిక చేశారు. వ్యవసాయ శాఖ కార్యక్రమాల్లో వీరిని భాగస్వామ్యం చేస్తూ.. వారి సలహాలు, సూచనలు తీసుకునేవారు. ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరవుతున్నందుకు ప్రభుత్వం ప్రతి ఆదర్శ రైతుకు నెలకు రూ.వెయ్యి చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలోని ఆదర్శ రైతులకు ప్రతినెల రూ.13.50లక్షలు ఖర్చు చేస్తోంది. అయితే వివిధ కారణాల వల్ల వీరిలో 310 మంది రైతులను విధుల నుంచి తప్పించారు. దీంతో ప్రస్తుతం ఈ సంఖ్య 1,040కు తగ్గింది. తాజాగా ఆదర్శ రైతుల విధానాన్ని పూర్తిగా రద్దు చేయడంతో 1,040 మంది రైతుల ‘ఆదర్శ’ సేవలు నిలిచిపోయాయి. -
సేవలు.. చాలిక!
మహబూబ్నగర్ వ్యవసాయం: ఆదర్శ రైతులను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగంసిద్ధం చేసింది. రైతులకు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ పంటలసాగు, సస్యరక్షణ చర్యలను తెలియజేసేందుకు నియమితులైన వీరంతా ఇక ఇంటిబాట పట్టనున్నారు. ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో జిల్లా లో 2747మంది ఆదర్శరైతులపై వేటుపడనుంది. 2008లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆదర్శరైతులను నియమించారు. రైతులకు అందుబాటులో ఉంటూ తగిన సమయంలో సూచనలు, సలహాలు ఇస్తున్న వీరికి ప్రభుత్వం వెయ్యి రూపాయల గౌరవవేతనం ఇస్తోంది. ఇలా నెలకు రూ.27.47లక్షల చొప్పున ఏడాదికి రూ.3.29 కోట్లను వీరికి కోసం చెల్లిస్తున్నారు. మొదట్లో నెలనెలా ఇచ్చిన గౌరవవేతనాన్ని ఆ తరువాత ఆరేడు నెలల కు ఒకమారు ఇస్తున్నారు. వీరిని జిల్లా, డివి జన్ స్థాయి వ్యవసాయశాఖ అధికారు లు ఎంపికచేసేవారు. గ్రామాల్లో 250 మంది రైతులకు ఒక ఆదర్శరైతును నియమించారు. కాగా, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శ రైతుల నుంచి ఎలాంటి ఉపయోగం లేదని, రాజకీయ పలుకుబడి కలిగిన ఆదర్శరైతులు వ్యవసాయశాఖ అధికారులపై పెత్త నం, అజమాయిషీ చెలాయిస్తున్నరని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచా రం. పంట నష్టపరిహారం, రుణమాఫీ విషయాల్లోనూ ఆదర్శరైతులు అధికారులను తప్పుదోవపట్టించారనే నెపం తో తొలగింపునకు సిద్ధమయ్యారు. ఆదర్శ రైతుల విధులు గ్రామాల్లో రైతులకు ఎప్పటికప్పుడు వ్యవసాయంలో వచ్చిన నూతన పద్ధతులు, మార్పులను తెలియజేయడం లో కీలకంగా వ్యవహరిస్తారు.ప్రభుత్వ రైతు సంక్షేమ పథకాలను అన్నదాతలకు చేరవేయడంలో ప్రభుత్వం, రైతులకు మధ్య అనుసంధాన కర్తగా వ్యవహరిస్తారు. పొలంబడి, సీడ్ విలేజ్ పథకాల ద్వారా రైతులకు క్షేత్రస్థాయి అవగాహన కార్యక్రమాల్లో కీలకంగా వ్యవహరిస్తారు. అలాగే ఇన్పుట్ సబ్సి డీ పంపిణీ, పంటల బీమా, విత్తనాలు, ఎరువుల పంపిణీ వంటి కార్యక్రమాల్లో అధికారులకు చేదోడువాదోడుగా ఉం టారు. ఆదర్శ రైతులను తొలగించడంతో రైతుల దరికి ప్రభుత్వ పథకాలు చేరే అవకాశం లేకుండా పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.