చంద్రబాబుకు కృష్ణయ్య ఝలక్!
చంద్రబాబుకు కృష్ణయ్య ఝలక్!
Published Thu, Sep 25 2014 8:10 PM | Last Updated on Sat, Sep 2 2017 1:57 PM
హైదరాబాద్: ఆదర్శ రైతుల రద్దు అంశపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడుకి స్వంత పార్టీ ఎమ్మెల్యేల నుంచే వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. చంద్రబాబుకు స్వంతపార్టీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఝలక్ ఇచ్చారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు తమ పథకాన్ని కొనసాగించాలని ఇందిరాపార్క్ వద్ద ఆదర్శ రైతులు ధర్నా చేపట్టారు.
ఈ ధర్నా కార్యక్రమంలో పార్టీ విధానానికి వ్యతిరేకంగా ఆర్.కృష్ణయ్య పాల్గొనడం రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఆదర్శ రైతుల తొలగింపులో చంద్రబాబు తీరును కృష్ణయ్య తప్పుపట్టారు. ఆదర్శ రైతుల పథకంలో లోపాలుంటే సరిదిద్దాలని.. కాని వ్యవస్థనే రద్దు చేయడం సబబు కాదని కృష్ణయ్య అభిప్రాయపడ్డారు.
Advertisement
Advertisement