భర్త వివాహేతర సంబంధం: భార్యాపిల్లల నిరసన | Woman along with children stages dharna in front of husband's house | Sakshi
Sakshi News home page

భర్త వివాహేతర సంబంధం: భార్యాపిల్లల నిరసన

Published Tue, Apr 19 2016 4:21 PM | Last Updated on Sat, Jul 28 2018 3:15 PM

Woman along with children stages dharna in front of husband's house

హైదరాబాద్ : మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న భర్త తీరుపై ఓ మహిళ, ఆమె పిల్లలు నిరసన తెలిపారు. బేగంపేట్ పీఎస్ పరిధిలోని చంద్రబాబు నగర్‌లో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. రాణిగంజ్-2 డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న బండి యాదగిరి భార్యాపిల్లలను పట్టించుకోకుండా మరో మహిళతో సంబంధం కొనసాగిస్తున్నాడు. 
 
దీంతో భార్య నాగమణి తన ముగ్గురు పిల్లలతో కలసి భర్త ఉండే చంద్రబాబు నగర్‌లోని ఇంటి వద్ద ఆందోళనకు దిగింది. ఆమెకు మహిళా సంఘాలు మద్దతుగా నిలిచాయి. వారి నిరసనతో రాములమ్మ అనే మహిళ ఇంటికి తాళం వేసుకుని వెళ్లిపోయింది. అయితే ఈ విషయమై తాడోపేడో తేల్చుకునే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని నాగమణి అంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement