సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ భూముల అమ్మకం ఆపేయాలని, ఉచితాల పేరుతో అయ్యే ఖర్చును తగ్గించుకోవాలని సర్కార్‌కు సుపరిపాలన వేదిక (ఎఫ్‌జీజీ) సూచించింది. ఈ మేరకు శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు ఎఫ్‌జీజీ ఎం.పద్మనాభరెడ్డి లేఖ రాశారు. ప్రభుత్వ ధనాన్ని రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరిట ప్రజలకు ఉచితాల రూపంలో ఇచ్చేస్తుందని, దీంతో ప్రభుత్వం అప్పుల పాలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
దాదాపు 1923 ఫ్లాట్లు, 18.05 ఎకరాల భూమి వేలం కోసం ఈనెల 11న నోటిఫికేషన్ ఇచ్చిందని లేఖలో వెల్లడించారు. ప్రభుత్వ అభివృద్ధి కోసం సరిపోయే స్థలం కావాలని ప్రైవేటు వ్యక్తుల నుంచి అధిక ధరకు భూములు కొనుగోలు చేస్తుంటే మరో దిక్కు ఉన్న భూములను అమ్మాలని చూడటం ఏమిటని ప్రశ్నించారు. మున్ముందు పట్టణ పరిసరాల్లో ఆస్పత్రులు, పాఠశాలలు, శ్మశాన వాటికలు, ఉద్యానవనాలకు, ఇతర ప్రభుత్వ అవసరాలకు భూములు అవసరం ఉంటుందని గుర్తు చేశారు. ఉన్న కొద్దిపాటి భూములను అమ్మేస్తే భవిష్యత్తుల్లో భూములను ఎక్కడి నుంచి తెస్తారో చెప్పాలని లేఖలో కోరారు.
Comments
Please login to add a commentAdd a comment