
హెలికాప్టర్‌ను తరలిస్తున్న లారీ, సెల్ఫీ దిగుతున్న యువకుడు
సాక్షి, చౌటుప్పల్ : చౌటుప్పల్ మండలం ఎల్లగిరి వద్ద 65వ నంబరు జాతీయ రహదారిపై ఆదివారం హెలికాప్టర్‌ను తరలిస్తున్న ఓ లారీ ఆగింది. అమెరికాలో ప్రత్యేకంగా తయారు చేయించిన ఈ హెలికాప్టర్‌ను షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌ని విశాఖపట్నం వరకు తీసుకువచ్చారు. అక్కడి నుంచి లారీలో ముంబాయికి తీసుకెళ్తున్నారు. విశ్రాంతి కోసం డ్రైవర్ లారీని అక్కడ ఆపాడు. దీనిని చూసేందుకు ప్రజలు ఆసక్తి కనబరిచారు. పలువురు హెలికాప్టర్‌తో సెల్ఫీలు దిగారు.