సాక్షి ఎఫెక్ట్: ప్రిన్సిపాల్ పై కేసు నమోదు | case filed on principal of gowtami school in choutuppal | Sakshi
Sakshi News home page

సాక్షి ఎఫెక్ట్: ప్రిన్సిపాల్ పై కేసు నమోదు

Published Thu, Jul 16 2015 5:02 PM | Last Updated on Sun, Sep 3 2017 5:37 AM

case filed on principal of gowtami school in choutuppal

చౌటుప్పల్: నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ స్కూల్  ప్రిన్సిపాల్ గణేష్ విద్యార్థినిపై వెకిలిచేష్టలకు పాల్పడిన ఘటనకు సంబంధించి  'సాక్షి' కథనంపై పోలీసులు స్పందించారు. స్కూల్ ప్రిన్సిపాల్, కరస్పాండెంట్ గా ఉన్న గణేష్ పై కేసు నమోదు చేశారు. సెక్షణ్ 364 ఏ, నిర్భయ చట్టం కింద అతనిపై కేసు నమోదు చేశారు.

వివరాలు.. చౌటుప్పల్ మండల కేంద్రంలోని  ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్, కరస్పాండెంట్ గణేష్ 8వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థినితో వెకిలిగా ప్రవర్తించాడు. సదరు బాలిక తన తల్లిదండ్రులకు ఈ విషయం తెలిపింది. వారు ఆగ్రహం చెంది గురువారం ఉదయం 10 గంటల ప్రాంతంలో స్కూలు వద్దకు చేరుకుని, గణేష్‌తో వాగ్వాదానికి దిగారు. అతనికి దేహశుద్ధి చేయటంతోపాటు పాఠశాల ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement