చౌటుప్పల్‌లో ఐటీ దాడులు
అర్ధరాత్రి వరకు కొనసాగిన సోదాలు
వ్యాపార వర్గాల్లో హడల్
చౌటుప్పల్: చౌటుప్పల్‌లో మంగళవారం హైదరాబాద్‌కు చెందిన ఐటీ(ఇన్‌కమ్‌టాక్స్) అధికారులు తనిఖీలు నిర్వహించారు. స్థానికంగా దాడులు సంచలనం రేకెత్తించాయి. వ్యాపారుల గుండెల్లో రైళ్లను పరుగెత్తించాయి. చౌటుప్పల్‌కు చెందిన వ్యాపారులు చంద్రారెడ్డి, నర్సిరెడ్డిలకు చెందిన ఇళ్లల్లో, సునీల్ ట్రిపుల్‌ఎక్స్ డిటర్జెంట్ గోదాంలో, సునీల్ బేకరీలో తనిఖీలు నిర్వహించారు. రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి వరకు తనిఖీలు కొనసాగుతున్నాయి. తనిఖీలు పూర్తయ్యాక వివరాలను వెళ్లడిస్తామని ఐటీ అధికారులు తెలిపారు.