
ఫార్మా పరిశ్రమలో భారీ ప్రమాదం
చౌటుప్పల్: నల్లగొండ జిల్లా టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డికి చెందిన శ్రీని ఫార్మాస్యూటికల్స్‌లో సోమవారం సాయంత్రం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. చౌటుప్పల్ పట్టణ శివారులో ఉన్న ఈ కంపెనీ ప్రొడక్షన్ బ్లాక్‌లో రియాక్టర్ పేలుడు సంభవించింది. భారీగా మంటలు ఎగసిపడుతుండడంతో పొగ దట్టంగా వ్యాపించింది. ఈ పొగతో సమీపంలోని ప్రజలకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ప్రాథమికంగా ఎవరికీ ప్రాణ ప్రమాదం లేదంటున్నారు. మంటలు అదుపులోకి వస్తేగానీ ప్రాణ, ఆస్తి నష్టం స్పష్టంగా తెలిసే అవకాశం లేదు.