
యాదాద్రి భువనగిరి జిల్లా : చౌటుప్పల్ మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలను ఆస్ట్రేలియా మిస్ వరల్డ్-2017 ఎస్మా వోలోడేర్ సోమవారం సందర్శించారు. అనంతరం పాఠశాలలో జరిగిన డాన్స్ పోటీలలో బాలికలతో కలసి డాన్స్ చేశారు. హైదరాబాద్‌లోని నారాయణ కాలేజీలో జరిగే ఓ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎస్మా హాజరయ్యారు. గురుకుల పాఠశాల అధికారుల విజ్ఞప్తి మేరకు చౌటుప్పల్‌లోని గురుకుల పాఠశాలకు వచ్చారు. ఆమెతో కలిసి ఫోటోలు దిగేందుకు పలువురు ఉత్సాహం చూపారు.
Comments
Please login to add a commentAdd a comment