Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Indian students shift to Bangladesh And Uzbekistan1
మోజు తగ్గుతోంది.. మొగ్గు మారుతోంది..!

విదేశాల్లో చదువు కోవడం అంటే భారత విద్యార్థులకు మోజు.. అందులోనూ అమెరికా, కెనడా, యూకే వంటి దేశాల్లో చదవడం అంటే అది మరింత క్రేజు. మరి ఇప్పుడు భారత విద్యార్థుల అభిరుచి మారిందా? అంటే అవుననక తప్పదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విదేశాల్లో చదవడం కష్టతరంగా మారింది. ప్రధానంగా వీసా నిబంధనలు కఠినతరం కావడం, ఖర్చులు పెరగడం వంటి తదితర కారణాలతో భారత విద్యార్థులు విదేశాల్లో చదవాలనే ఆసక్తి తగ్గిపోతోంది. అదే సమయంలో భారతదేశంలోనే మెరుగైన అవకాశాలు లభించడం వంటి కారణాలతో విదేశాల్లో చదువుకు వెనకడుగు వేస్తున్నారు. విదేశాల్లో భారత విద్యార్థుల చదువుల అంశానికి సంబంధించి పలు నివేదికలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. యూఎస్‌, యూకేను వదిలేద్దాం..!గత కొన్నేళ్లుగా విదేశాల్లో చదివే భారత విద్యార్థుల సంఖ్య గణనీయకంగా తగ్గింది. 2023 నాటికి విదేశాల్లో చదివే భారత విద్యార్థుల సంఖ్య 8.92 లక్షలు ఉండగా, అది 2024 నాటికి 7.59 లక్షలకు తగ్గింది. దీనికి కారణాలు మాత్రం ప్రధానంగా అగ్రదేశాలైన యూఎస్‌ఏ, యూకే, కెనడాల్లో చదవాలనే కోరిక ఒకటి. అయితే ఈ దేశాల్లో వీసాల నిబంధనలు కఠినతరంగా మారాయి. దాంతో అమెరికా, యూకే, కెనడాలపై దృష్టి పెట్టడం లేదు. దాంతో విదేశాల్లో చదవాలనుకునే భారత్‌ విద్యార్థుల సంఖ్య తగ్గడానికి ఇదొక కారణంగా మారింది. ప్రస్తుతం పలువురు విద్యార్థుల మాత్రమే యూఎస్‌, యూకేలపై దృష్టి సారిస్తుండగా, అధిక శాతం మంది మాత్రం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందులో కొంతమంది భారత్‌లోనే ఉన్నత చదువులకు ఆసక్తి చూపిస్తుండగా, మరి కొంతమంది మాత్రం వీసా నిబంధనలు సులభతరంగా ఉండి ఫీజులు తక్కువగా ఉండే దేశాల వైపు మొగ్గు చూపిస్తున్నారు.కెనడా అసలే వద్దు..!గతంలో అమెరికాలో చదువు కోవడానికి వీలు లేకపోతే, కెనడా వైపు దృష్టి సారించే వారు అధిక శాతం మంది భారత విద్యార్థులు. అయితే జస్టిన్‌ ట్రూడో హయాంలో భారత్‌-కెనడా దౌత్స సంబంధాలు దెబ్బ తినడంతో పాటు అక్కడ వీసా నిబంధనలు కూడా కఠినతరంగా మారాయి.ట్రూడో హయాంలో వీసా పరిమితులు, ఎస్‌డీఎస్‌ (Student Direct Stream ప్రోగ్రాం రద్దు, వర్క్ పరిమితులు వంటి మార్పులు భారత విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపించాయి. ఒక విషయాన్ని గమనిస్తే 2023లో 2.33 లక్షల మంది విద్యార్థులు కెనడా వెళ్లగా, 2024లో అది కాస్తా1.37 లక్షలకు పడిపోయింది. అంటే కెనడా అసలే వద్దు అనే నిర్ణయానికి అధిక శాతం భారత విద్యార్థులు వచ్చారనేది ఈ గణాంకాల్ని బట్టి అర్ధమవుతోంది.బంగ్లా, ఉజ్బెకిస్థాన్‌లో ఉన్నత చదువులు..విదేశాల్లో చదువాలనుకునే భారత విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గడం ఒకటైతే, అభివృద్ధి చెందిన దేశాలకు వెళ్లడానికి వీసా తదితర ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో బంగ్లదేశ్‌, ఉజ్భెకిస్తాన్‌, సింగపూర్‌, రష్యా వైపు మొగ్గు చూపిస్తున్నారు. 2023లో 20,368 మంది భారత విద్యార్థులు బంగ్లాదేశ్‌ వైపు మొగ్గు చూపగా, మరుసటి ఏడాదికి అది కాస్త పెరిగి 29,232కు చేరింది. 2023 నాటికి ఉజ్బెకిస్థాన్‌లో చదువుకునే భారత విద్యార్థుల సంఖ్య 6, 601 ఉంగా, అది 2024 నాటికి 9,915 చేరింది. ఇక 2023లో రష్యా వైపు 25,503లో భారత విద్యార్థులు ఆసక్తి చూపగా, 2024 నాటికి 31,444 విద్యార్థులకు చేరింది. ఇక సింగపూర్ విషయానికొస్తే ఏడాదిలో 12,000 నుంచి 14,000 మంది విద్యార్థులకు చేరింది. ఎందుకీ మార్పు..?అసలు విదేశాల్లో చదువు అనేది భారీ ఖర్చుతో కూడుకున్నదైతే, అందులో వీసా తదితర నిబంధనల్లో భారీగా మార్పులు చేయడం మరొకటి. ఇది ప్రధానంగా అభివృద్ధి చెందిన దేశాల్లో కనిపిస్తోంది. యూఎస్‌, యూకే, కెనడాల్లోనే వీసా నిబంధనల్లో కఠినమైన మార్పులు వచ్చాయి. దాంతో ‘ ఎందుకీ తలనొప్పి’ అని భావించే చిన్న దేశాల వైపు చూస్తున్నారు. తక్కువ ఖర్చుతో మెడికల్, టెక్నికల్ విద్య పూర్తి చేసే అవకాశాలు అధికంగా ఉండటంతో పాటు వీసా ప్రక్రియ సులభతరంగా ఉండటం మరొక కారణం. భారతీయ విద్యార్థులకు అనుకూలమైన కోర్సులు కూడా ఆయా దేశాల్లో ఉండటం కూడా ప్రత్యామ్నాయంగా వాటివైపు చూడటానికి ప్రధానమైన అంశంగా మారింది ఇక భద్రత పరంగా కూడా అక్కడ పెద్దగా ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు ఉండవని భావించే బంగ్లాదేశ్‌, సింగపూర్‌, రష్యా, ఉజ్బెకిస్థాన్‌ తదితర దేశాల వైపు చూడటానికి మరొక కారణంగా చెప్పవచ్చు.

Sundar Pichai Becomes Billionaire After 10 Years As Alphabet CEO2
సుందర్‌ పిచాయ్‌ ఇక బిలియనీర్‌..

ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ బిలియనీర్స్‌ క్లబ్‌లోకి చేరారు. 1 బిలియన్ డాలర్ల నికర సంపద పరిమితిని అధిగమించి బిలియనీర్‌గా అవతరించారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. ఆల్ఫాబెట్ షేర్లు ఆల్‌టైమ్ గరిష్టానికి చేరుకోవడంతో, భారత్‌కు చెందిన 53 ఏళ్ల పిచాయ్‌ నెట్‌వర్త్‌ 1.1 బిలియన్ డాలర్లకు పెరిగింది.2023 ప్రారంభం నుంచి ఆల్ఫాబెట్ స్టాక్ 120 శాతానికి పైగా పెరగడం, కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1 ట్రిలియన్ డాలర్లకు పైగా పెరగడం ఈ ఆర్థిక పురోగతికి ప్రధాన కారణమని బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. ముఖ్యంగా టెక్ రంగంలో ఒక వ్యవస్థాపకేతర సీఈఓకు ఇది అరుదైన ఘనత. మెటాకు చెందిన మార్క్ జుకర్ బర్గ్, ఎన్‌విడియాకు చెందిన జెన్సెన్ హువాంగ్ వంటి ఉన్నత స్థాయి ఎగ్జిక్యూటివ్ లు బిలియనీర్స్‌గా ముందు వరసలో ఉన్నప్పటికీ వారు తమ కంపెనీల్లో ఈక్విటీ వాటాలను కలిగి ఉన్నారు.సీఈవోగా పదేళ్లుఆల్ఫాబెట్‌ సీఈవోగా సుందర్ పిచాయ్ ఇటీవలే పదేళ్లు పూర్తి చేసుకుని కంపెనీలో ఎక్కువ కాలం చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేసిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. పిచాయ్ 2004లో ఆల్ఫాబెట్ ప్రధాన అనుబంధ సంస్థ గూగుల్ లో చేరారు. క్రోమ్, ఆండ్రాయిడ్ లకు ఆయన తొలినాళ్లలో చేసిన సేవలు 2015లో సీఈఓగా ఎదగడానికి పునాది వేశాయి. తర్వాత 2019లో ఆల్ఫాబెట్ సీఈఓగా సుందర్ పిచాయ్ నియమితులయ్యారు.నిరాడంబర నేపథ్యం..సుందర్ పిచాయ్ తమిళనాడులోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించి రెండు గదుల అపార్ట్ మెంట్ లో పెరిగారు. వారి కుటుంబానికి కారు ఉండేది కాదు. ఆయనకు 12 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు తొలిసారిగా ఇంటికి టెలిఫోన్ వచ్చింది. 1993 లో సుందర్ పిచాయ్ స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి స్కాలర్‌షిప్ సాధించగా ఆయన్ను కాలిఫోర్నియా పంపించడానికి విమాన టికెట్ కోసం ఆయన తండ్రి ఏడాది మొత్తం జీతం కంటే కూడా పైగానే ఆ కుటుంబం ఖర్చుపెట్టాల్సి వచ్చింది.

Veda Krishnamurthy Retired From All Forms Of Cricket3
32 ఏ‍ళ్లకే రిటైర్మెంట్‌ ప్రకటించిన టీమిండియా ప్లేయర్‌

భారత మహిళా క్రికెటర్‌ వేద కృష్ణమూర్తి 32 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటించింది. రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వేద ఇవాళ (జులై 25) సోషల్‌మీడియా వేదికగా పంచుకుంది. రైట్‌ హ్యాండ్‌ బ్యాటర్‌, అకేషనల్‌ లెగ్‌ స్పిన్‌ బౌలర్‌ అయిన వేద 2011లో టీమిండియా అరంగేట్రం చేసింది. అప్పటి నుంచి తొమ్మిదేళ్ల పాటు భారత జట్టుకు ప్రాతినథ్యం వహించి 48 వన్డేలు, 76 టీ20లు ఆడింది. ఇందులో 10 హాఫ్‌ సెంచరీల సాయంతో 1704 పరుగులు చేసి 3 వికెట్లు తీసింది. వేద భారత మహిళా జట్టు రన్నరప్‌గా నిలిచిన 2017 వన్డే వరల్డ్‌కప్‌, 2020 టీ20 వరల్డ్‌కప్‌ జట్లలో సభ్యురాలిగా ఉంది.కర్ణాటకలోని కడూర్‌ అనే చిన్న పట్టణం నుంచి వచ్చిన వేద టీమిండియా సాధించిన అనేక విజయాల్లో కీలక సభ్యురాలిగా ఉంది. వేద తన రిటైర్మెంట్‌ సందేశంలో తనకు సహకరించిన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, కోచ్‌లు, మెంటర్లు, సహచర క్రికెటర్లు, కెప్టెన్లకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపింది. అలాగే తనకు అవకాశమిచ్చిన బీసీసీఐ, కర్ణాటక క్రికెట్‌ బోర్డు, రైల్వేస్‌ క్రికెట్‌ బోర్డుకు కూడా ధన్యవాదాలు తెలిపింది.వేద దేశవాలీ క్రికెట్‌లో కర్ణాటక, రైల్వేస్‌ జట్లకు నాయకత్వం వహించింది. వేద చివరిగా 2020 టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించింది. అంతకు రెండేళ్ల ముందు (ఏప్రిల్‌, 2018) భారత్‌ తరఫున తన చివరి వన్డే ఆడింది. వేదకు అత్యంత చురుకైన ఫీల్డర్‌గా పేరుంది. మహిళల టీ20ల్లో ఆమె సంయుక్తంగా అత్యధిక క్యాచ్‌లు పట్టుకున్న నాన్‌ వికెట్‌కీపర్‌గా కొనసాగుతుంది.గత కొంతకాలంగా జాతీయ జట్టు అవకాశాలు రాకపోవడంతో వేద వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుంది. వేద మహిళల ఐపీఎల్‌ రెండో సీజన్‌లో (2024) గుజరాత్‌ జెయింట్స్‌ తరఫున ఆడింది. ఆ సీజన్‌లో చెప్పుకోదగ్గ ప్రదర్శనలు (4 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 22 పరుగులు) చేయకపోవడంతో ఆమెను తదుపరి సీజన్‌లో ఏ ఫ్రాంచైజీ తీసుకోలేదు. వేద మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌లో కూడా ఆడింది. 2017-18 సీజన్‌లో ఆమె హోబర్ట్‌ హరికేన్స్‌కు ప్రాతినిథ్యం వహించింది.

Bhumana Karunakar Reddy Questioning On Chandrababu Government Over Tirupati stampede4
తిరుమల తొక్కిసలాట ఘటన.. అసలు దోషులెక్కడా చంద్రబాబు

సాక్షి,తిరుపతి: తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై కంటి తుడుపు చర్యలకు చంద్రబాబు ప్రభుత్వం జ్యుడిషియల్ కమీషన్ ఏర్పాటు చేసిందని మాజీ మంత్రి, టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు. ఈ ఏడాది జనవరి 8వ తేదీన వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై విశ్రాంత న్యాయమూర్తి ఎం.సత్యనారాయణ మూర్తి కమిషన్‌ ఆధ్వర్యంలో జరిగిన విచారణపై భూమన మీడియాతో మాట్లాడారు.ఆయన ఏమన్నారంటే.. ‘‘ శ్రీరంగ పట్టణం ఆదర్శంగా తీసుకుని ఆ వైష్ణవ సంప్రదాయం తిరుమలలో 10 రోజుల పాటు వైకుంఠ ఏకాదశి దర్శనం అవకాశం కల్పించాము. 23 మంది పీఠాధిపతులు హర్షించారు. జనవరి 8 న జరిగిన జరిగిన తొక్కిసలాట పై కంటి తుడుపు చర్యలు కు జ్యుడిషియల్ కమీషన్ ఏర్పాటు చేసింది.సంఘటన జరిగిన తర్వత రోజు కలెక్టర్, ఎస్పీ, ఈవోలుపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటన పై ఈవో ఛైర్మన్ల మధ్య అవగాహన లేదు, క్షమాపణ చెప్పాలని డిప్యూటీ సీఎం పవన్ సూచించారు. ఆరోజు గోశాల డైరెక్టర్ హరినాధ రెడ్డి, డీఎస్పీ రమణ సస్పెండ్ చేశారు.చంద్రబాబు ముందే నిర్ణయించుకుని ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. తమకు కావాల్సిన వారితో సాక్షులు ఇప్పించారు హరినాథ్ రెడ్డి, రమణ కుమార్‌లను బలి ఇచ్చారు. అసలు నిందితులను వదిలి వేశారు. ఆరు మంది చనిపోయి, 50 మందికి పైగా తీవ్ర గాయాలు ఐతే పాక్షికంగా నివేదిక ఇచ్చారుఆ నివేదికను దురుద్దేశ పూర్వకంగా ఇచ్చిన నివేదికగా వైఎస్సార్‌సీపీ భావిస్తోంది. విజిలెన్స్ నివేదికలు బట్టి చూస్తే.. చంద్రబాబు నియమించిన ఏ విచారణ అయిన ఒక కేస్ స్టడీగా చేశారు. ఆయన కోరుకున్నట్లుగానే విచారణ కమిషన్ ఫలితం వస్తుంది అనడానికి ఇది ఒక కేస్ స్టడీ.హరినాధ రెడ్డికు 21.12.24 నా జరిగిన సమావేశంలో సూర్య ప్రకాష్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌కు సమాన బాధ్యత ఇచ్చారులా అండ్ ఆర్డర్, విజిలెన్స్ వాళ్లకు క్యూ లైన్ బాధ్యతలు ఇచ్చారు. అండ్ ఆర్డర్ బాధ్యత ఎస్పీ, సీవీ అండ్‌ ఎస్వో ది కూడా బాధ్యత. వైఎస్సార్‌సీపీ పాలనలో ఏ ఒక్క చిన్న సంఘటన జరగలేదు.జనవరి 10, 11, 12 తేదీలు మాత్రమే ఎస్‌ఎస్‌డీ టోకెన్లు ఇస్తామని చెప్పారు. అధికార యంత్రాంగం ఈ ఘటనకు కారణం, దీనికి సమాధానం లేదు. చంద్రబాబు పాలనలో తొక్కిసలాట ఘటన జరిగితే ఈవోనే బాధ్యత వహించాలని గతంలో చందన ఖాన్ ఒక నివేదిక ఇచ్చారు. కౌంటర్ల వద్ద విధుల్లో ఉన్న వారిని ఎలా చర్యలు తీసుకుంటారు? క్యూ లైన్‌లో హోల్డింగ్ పాయింట్ అనేది ఎందుకు పెట్టారు.తొక్కిసలాట జరిగిన సమయంలో పోలీసులు చోద్యం చూశారు. వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు. మీ బాధ్యత నిర్లక్ష్యం వల్ల తొక్కిసలాట ఘటన జరిగింది. భక్తుల మనోభావాలను దెబ్బతీసిన జ్యుడిషియల్ కమీషన్ నివేదిక సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాము. మా పాలనలో వైకుంఠ ఏకాదశికు పదిలక్షలు మందికి దర్శనం చేయించాము. 23 మంది పీఠాధిపతులు స్వహస్తాలతో ఇచ్చిన సూచన ప్రకారం పదిరోజుల దర్శనం జరిగింది.పీఠాధిపతులు ఆలోచనలను పక్కన పడేస్తారా.. కేసులు పెట్టాలనే , జైలుకు తరలించాలని చూస్తున్నారు.నా గొంతు కోస్తే తప్ప నేను పోరాటం ఆగదు’’ అని స్పష్టం చేశారు.

Operation Sindoor still on shastra shaastra both key CDS Anil Chauhan5
ఆపరేషన్‌ సిందూర్‌ ఆన్‌లోనే ఉంది: సీడీఎస్‌

న్యూఢిల్లీ: పహల్గామ్‌ ఉగ్రదాడిలో తర్వాత పాకిస్తాన్‌లో ఉగ్రస్ధావరాలే లక్ష్యంగా భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ అనేది ఇంకా ఆన్‌లోనే ఉందని సీడీఎస్‌(చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాప్‌) జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ స్పష్టం చేశారు. ఈరోజు(శుక్రవారం జూలై 25) ఢిల్లీలో జరిగిన డిఫెన్స్‌ సెమినార్‌కు హాజరైన అనిల్‌ చౌహాన్‌ మాట్లాడుతూ..ఆపరేషన్‌ సిందూర్‌ అనేది అవసరమైన సందర్భంలో మళ్లీ జూలు విదల్చడానికి ఇంకా సిద్ధంగానే ఉందన్నారు.అది నిరంతరం నేర్చుకునే ప్రక్రియఇక భారతదేశ యుద్ధ సామర్థ్యం గురించి ఆయన పలు కీలక విషయాలను చెప్పుకొచ్చారు. యుద్ధ సంసిద్ధత అనేది చాలా హైలెవెల్‌లో ఉండాలన్నారు. యుద్ధ సామర్థ్యాన్ని పెంపుదించుకోవడానికి ప్రతి గడియా, ప్రతి నిమిషం కూడా చాలా అవసరమన్నారు. అటు సస్త్ర(యుద్ధం) ఇటు శాస్త్రం(జ్ఞానం) అనేవి మిలటరీకి 24x7, 365 రోజులు చాలా కీలకమన్నారు.మూడు స్థాయిల్లో మాస్టర్‌ కావాలి..యుద్ధ రంగంలోకి దిగే సైనికుడు న్రధానంగా మూడు స్థాయిల్లో మాస్టర్‌ కావాల్సిన అసవరం ఉందన్నారు. అందులో , నిర్ధిషమైన ప్రణాళిక, వ్యూహాత్మకత, కార్యాచరణ, అనేవి యుద్ధ రంగంలో ప్రధాన భూమిక పోషిస్తాయన్నారు. వీటిలో ప్రతీ సైనికులు ఆరితేరి ఉండాలన్నారు. ఇది ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ముందకు సాగడమే తప్ప ఇందులో షార్ట్‌ కట్స్‌ అంటూ ఏమీ ఉండవన్నారు. ప్రస్తుత రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానం యొక్క నిరంతర పురోగతి ద్వారా మనం అపూర్వమైన వేగాన్ని చూస్తున్నామని, దాన్ని అందిపుచ్చకుంటూ ముందుకు సాగితేనే యుద్ధంలో పైచేయి సాధిస్తామన్నారు. కాగా, ఏప్రిల్‌ 22వ తేదీన పహల్గామ్‌ ఉగ్రదాడిలో 26 మంది అసువులు బాసారు. కశ్మీర్‌ పర్యాటక ప్రాంతాల్నిచూడటానికి వెళ్లిన పర్యాటకులు ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్సోయారు. ఈ క్రమంలోనేఆపరేషన్‌ సిందూర్‌ను భారత్‌ చేపట్టింది.మే 7వ తేదీన భారత్‌ చేపట్టిన ఈఆపరేషన్‌ సిందూర్‌తో పాకిస్తాన్‌ ఉనికిలో లేకుండా పోయే ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది.ఆపరేషన్‌ సిందూర్‌ దెబ్బకు పాక్‌ అతాలకుతలమైంది. భారత్‌ దాడుల్ని తిప్పి కొట్టలేక ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఆపరేషన్‌ సింధూర్ తర్వాత పాకిస్తాన్‌ కాస్త దారికొచ్చింది.ఆపరేషన్‌ సింధూర్‌తో పాకిస్తాన్‌లోకి చొచ్చుకుపోయిని భారత ఆర్మీ బలగాలు అక్కడ కీలక ఉగ్రస్థావరాలను చిన్నాభిన్నం చేశారు. సుమారు వందమందికి పైగా ఉగ్రవాదుల్ని మట్టుబెట్టడం ఒకటైతే, ఉగ్రస్థావరాలు ఉన్న చోటల్లా భారత్‌ చేసిన దాడులకు పాకిస్తాన్‌ ఊపిరి తీసుకోలేకపోయింది. అలాగే పాక్‌ ఆర్మీ క్యాంపుల్ని కూడా భారత్‌ టార్గెట్‌ చేసి పైచేయి సాధించింది. భారత్‌ దాడులకు గుక్క తిప్పులేకపోయిన పాకిస్తాన్‌.. మే 10వ తేదీన కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చింది. పాకిస్తాన్‌ మిలటరీ ఆపరేషన్‌ డైరెక్టర్‌ జనరల్‌.. భారత్‌ ఆర్మీకి ఫోన్‌ చేసి కాల్పుల విరమణ ఒప్పందానికి తమ సంసిద్ధతను వ్యక్తం చేశారు.. అదే సమయంలో పాకిస్తాన్‌ మళ్లీ ఎటువంటి దుస్సాహసానికి పాల్పడ్డాఆపరేషన్‌ సిందూర్‌ ఆన్‌లోనే ఉందని గట్టి హెచ్చరికల నడుమ కాల్పుల విరమణకు అంగీకరించింది భారత్‌.

Indian Government Bans Ullu ALTT Other Apps For This Reason6
ఉల్లూ, ఏఎల్‌టీటీ సహా 25 యాప్‌లపై బ్యాన్‌

అశ్లీల కంటెంట్‌ను కట్టడి చేసే క్రమంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అభ్యంతర కంటెంట్‌ను ప్రొత్సహిస్తున్న ఉల్లూ, ఏఎల్‌టీటీ సహా 25 వీడియో యాప్‌లు, వెబ్‌సైట్‌ల మీద నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది.పోర్నోగ్రఫిక్‌ సహా అభ్యంతకర కంటెంట్‌ను ప్రదర్శిస్తున్న క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే.. ఆయా యాప్‌ల, వెబ్‌సైట్‌ల లింకులను ప్రజలకు అందుబాటులో ఉంచకుండా బ్యాన్‌ చేయాలని ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్స్‌(ISPs)కు ఆదేశాలు జారీ చేసింది.భారత్‌లో పోర్న్‌సైట్లపై నిషేధం అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ప్రత్యామ్నాయ మార్గాల్లో కోట్ల మంది ఆ సైట్లను వీక్షిస్తున్నారు. అయితే.. కఠిన చట్టాలు లేకపోవడంతో కొన్ని యాప్‌లు అధికారికంగానే పోర్న్‌, సాఫ్ట్‌ పోర్న్‌ను ప్రొత్సహిస్తూ వస్తున్నాయి. ఇందులో ఉల్లూ, ఏల్‌టీటీ(ఏక్తాకపూర్‌కు చెందిన బాలాజీ టెలిఫిలింస్‌కు చెందిన యాప్‌, అశ్లీలంతో పాటు సాదారణ సినిమాలూ అందిస్తోంది) తదితరాలు ప్రముఖంగా ఉన్నాయి. ఈ ప్లాట్‌ఫారమ్‌లు డబ్బులు తీసుకుని ఇంతకాలం యూజర్లకు అశ్లీల కంటెంట్‌ విచ్చలవిడిగా అందిస్తూ వచ్చాయి.అయితే రాను రాను.. ఈ వ్యవహారం మరింత ముదిరిపోయింది. ఏకంగా పోర్న్‌ కంటెంట్‌ ఇదే తరహా యాప్‌ల ద్వారా ప్రమోట్‌ అయ్యింది. ఇది హద్దులు దాటి ‘ఎక్స్‌’(ట్విటర్‌) లాంటి పాపులర్‌ ఓపెన్‌ మాధ్యమానికి కూడా చేరడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ తరుణంలో కేంద్రం నిషేధం విధించడం గమనార్హం. ఈ నిర్ణయంపై సోషల్‌ మీడియాలో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.తాజా నిషేధిత జాబితాలో.. ఉల్లూ, ఏఎల్‌టీటీ, బిగ్‌ షాట్స్‌ యాప్‌, దేశీఫ్లెక్స్‌, బూమెక్స్‌, నవరసా లైట్‌, గులాబ్‌ యాప్‌, కంగన్‌ యాప్‌, బుల్‌ యాప్‌, జల్వా యాప్‌, వావ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, లుక్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, హిట్‌ప్రైమ్‌, ఫెనియో, షో ఎక్స్‌, సోల్‌ టాకీస్‌, అడ్డా టీవీ, హాట్‌ఎక్స్‌ వీఐపీ, హల్‌చల్‌ యాప్‌, మూడ్‌ఎక్స్‌, నియోన్‌ ఎక్స్‌ వీఐపీ, ఫూగీ, మోజ్‌ఫ్లిక్స్‌, ట్రిఫ్లిక్స్‌ తదితరాలు ఉన్నాయి.ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ యాక్ట్‌ 2000 సెక్షన్‌ 67, 67 ఏ.. లాగే భారత న్యాయ సంహిత సెక్షన్‌ 294, మహిళలను అభ్యంతరకరంగా చూపించడం(The Indecent Representation of Women (Prohibition) Act, 1986 సెక్షన్‌ 4).. ఉల్లంఘనల కింద ఈ యాప్‌లను నిషేధిస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.

Indian Origin Entrepreneur Who Served Tea To PM Modi Goes Viral7
ఎవ‌రీ లండ‌న్ చాయ్‌వాలా.. ఏంటి ప్ర‌త్యేక‌త‌?

ఇండియ‌న్ కల్చ‌ర్‌లో టీకి ప్ర‌త్యేక‌మైన స్థానం ఉంది. ఇంటికి గెస్టులు ఎవ‌రు వ‌చ్చినా ముందుగా టీయిచ్చి మాట‌లు క‌లుపుతాం. మిత్రులు, సావాస‌గాళ్ల‌తో చాయ్‌లు తాగుతూ చేసే చ‌ర్చ‌ల‌కు అంతే ఉండ‌దు. న‌రేంద్ర మోదీ ప్ర‌ధాన‌మంత్రి అయిన త‌ర్వాత చాయ్ పే చ‌ర్చ చాలా ఫేమ‌స్ అయింది. త‌న‌ను తాను చాయ్‌వాలాగా ఆయ‌న ఎన్నోసార్లు చెప్పుకున్నారు. పీఎం మోదీకి చాయ్ అందించి వైర‌ల్ అయ్యాడో యువ చాయ్‌వాలా. అది కుడా లండ‌న్‌లోని బ్రిట‌న్ ప్ర‌ధాని అధికారిక నివాసంలో. ఇద్ద‌రు ప్ర‌ధానుల‌కు చాయ్ పోసిన కుర్రాడి పేరు అఖిల్ పటేల్.భార‌త్‌, బ్రిట‌న్ దేశాల మ‌ధ్య గురువారం చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కుదిరింది. ఈ సంద‌ర్భంగా లండ‌న్‌లోని బ్రిట‌న్ ప్ర‌ధాని అధికారిక నివాసం అయిన చెకర్స్‌లో కీల‌క భేటీ జ‌రిగింది. యూకే పీఎం కీర్ స్టార్మర్, ప్ర‌ధాని మోదీ కీలకాంశాల‌పై చ‌ర్చ‌లు సాగించారు. ప‌చ్చిక‌లో ఏర్పాటు చేసిన ఒక టీ స్టాల్‌లో తాజాగా తయారు చేసిన భారతీయ మసాలా చాయ్‌ను ఇరువురు అగ్ర‌నేత‌లు ఆస్వాదించారు. త‌ర్వాత ఈ ఫొటోల‌ను మోదీ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. "చెకర్స్‌లో ప్రధానమంత్రి కీర్ స్టార్మర్‌తో 'చాయ్ పే చర్చా'... భార‌త్‌-యూకే సంబంధాల‌ను మ‌రింత బ‌లోపేతం చేస్తుంద‌ని రాశారు. View this post on Instagram A post shared by Amala Chai | Masala Chai (@amala_chai)మోదీ షేర్ చేసిన ఫొటోలో.. సాంప్రదాయ భారతీయ కుర్తాలో ఒక యువ‌కుడు.. ఇద్దరు ప్ర‌ధానుల‌కు చాయ్ స‌ర్వ్ చేస్తున‌ట్టు క‌న‌బ‌డింది. ముఖ్యంగా టీస్టాల్ బ్యానర్‌పై రాసివున్న క్యాప్ష‌న్ అంద‌రినీ ఆక‌ర్షించింది. "తాజాగా తయారుచేసిన మసాలా చాయ్. భారతదేశం నుంచి వచ్చించి, లండన్‌లో తయారైంది అని రాసుంది. ఇరువురు అగ్ర‌నేత‌ల‌కు చాయ్ అందించిన ఆ యువ‌కుడి పేరు అఖిల్ పటేల్. అమలా చాయ్ పేరుతో యూకేలో ఆయ‌న బిజినెస్ చేస్తున్నారు.‘Chai Pe Charcha’ with PM Keir Starmer at Chequers...brewing stronger India-UK ties! @Keir_Starmer pic.twitter.com/sY1OZFa6gL— Narendra Modi (@narendramodi) July 24, 2025 ఒక చాయ్‌వాలాకు మ‌రో చాయ్‌వాలా..భార‌త్‌, బ్రిట‌న్ ప్ర‌ధానుల‌కు చాయ్ అందించి అప‌రూప క్ష‌ణాల‌కు సంబంధించిన వీడియోను అఖిల్ సోష‌ల్ మీడియాలో పంచుకున్నారు. అమలా చాయ్ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో రీల్‌ను షేర్ చేశారు. కీర్ స్టార్మర్‌తో క‌లిసి మోదీ.. టీస్టాల్ వ‌ద్ద‌కు రావ‌డం.. మీరు ఇండియా రుచులను ఆస్వాదిస్తారు అంటూ స్టార్మర్‌తో మోదీ చెప్పడం వంటివి వీడియోలో ఉన్నాయి. "ఇందులో ఏలకులు, జాజికాయ, నల్ల మిరియాలు ఉన్నాయి" అని కప్పుల్లో టీ పోస్తూ పటేల్ చెప్పాడు. ప్రధాని మోదీకి టీ గ్లాస్ అందిస్తూ.. ఒక చాయ్‌వాలాకు మ‌రో చాయ్‌వాలా (Chaiwala) టీ అందిస్తున్నాడు అన‌గానే.. మోదీ గ‌ట్టిగా న‌వ్వేశారు. కీర్ స్టార్మర్ చాయ్ తాగుతూ చాలా బాగుంద‌ని కితాబిచ్చారు. ఎవ‌రీ అఖిల్ పటేల్?భార‌త మూలాలు క‌లిగిన అఖిల్ పటేల్.. 2019లో తన అమ్మమ్మ ప్రేరణతో అమలా చాయ్‌ను ప్రారంభించాడు. అత‌డి అమ్మ‌మ్మ 50 ఏళ్ల క్రితం లండ‌న్‌కు వ‌ల‌స‌వచ్చి స్థిర‌ప‌డ్డారు. ప‌టేల్‌ లింక్డ్ఇన్ బయో ప్రకారం.. అతడు లండన్‌లోని హాంప్‌స్టెడ్‌లోని యూనివర్సిటీ కాలేజ్ స్కూల్‌లో చదువుకున్నాడు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ (LSE) నుంచి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (BSc), మేనేజ్‌మెంట్ చేశాడు. గ్రాడ్యుయేషన్ వివిధ సంస్థల్లో ఇంటర్న్‌షిప్‌లు పూర్తి చేశాడు.చ‌ద‌వండి: మీరు ఎలా చనిపోవాల‌నుకుంటున్నారు?చిన్న‌త‌నంలో త‌న అమ్మ‌మ్మ పెట్టే మసాలా చాయ్ అంటే అఖిల్‌కు చాలా ఇష్టం. అయితే బ‌య‌ట తాగే చాయ్‌ల‌లో ఇలాంటి రుచి లేద‌ని గ‌మ‌నించాడు. తన అమ్మమ్మ ఫార్ములాతో బ్రిక్ లేన్ ప్రాంతంలో అమల చాయ్ పేరుతో టీస్టాల్‌ ప్రారంభించాడు. అస్సాం, కేరళ రైతుల నుంచి నేరుగా తేయాకులు, సుగంధ ద్రవ్యాలు తెప్పించుకుని వాటితోనే మాసాలా చాయ్ త‌యారు చేస్తాడు. అందుకే అమ‌ల చాయ్‌కు త‌క్కువ కాలంలోనే బాగా పేరొచ్చింది. తాజాగా ఇద్ద‌రు ప్ర‌ధాన మంత్రుల‌కు మ‌సాలా చాయ్ అందించి ప్ర‌పంచం దృష్టిలో ప‌డ్డాడు అఖిల్ ప‌టేల్‌.

Mahavatar Narsimha Movie Review In Telugu8
'మహావతార్‌: నరసింహ' మూవీ రివ్యూ

ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ కొన్నాళ్ల క్రితం మహావతార్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ (ఎంసీయూ) అనే ప్రాజెక్ట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రీ మహావిష్ణువు దశావతారాలపై ఏడాదికో యానిమేటెడ్‌ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఇందులో భాగంగా తొలి సినిమా 'మహావతార్‌: నరసింహ' నేడు(జులై 25) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ యూనిమేటెడ్‌ ఫిల్మ్‌ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.'మహావతార్‌: నరసింహ' కథేంటంటే..పురాణాల్లో ఉన్న భక్త ప్రహ్లాద, నరసింహ స్వామి కథ గురించి తెలిసిందే. విష్ణువు మూర్తి నరసింహ అవతారం(సగం మనిషి, సగం సింహం) ఎత్తి, భక్తుడైన ప్రహ్లాదుడిని హింసించిన హిరణ్యకశిపుడిని సంహరిస్తారు. ఇదే కథను యానిమేషన్‌లో చూస్తే.. అదే మహావతార్‌: నరసింహ సినిమా.విశ్లేషణభక్త ప్రహ్లాద కథతో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. అందులో ఎస్వీ రంగారావు, అంజలీదేవి, రోజా రమణి ప్రధాన పాత్రలు పోషించిన 'భక్త ప్రహ్లాద' బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో ప్రహ్లాద కథ దాదాపు తెలుగు ప్రేక్షకులందరికి తెలిసింది. ఇలాంటి కథలు నేటి తరానికి తెలియజేయాలనే ఉద్దేశంతో తీసిన సినిమా'మహావతార్‌: నరసింహ'. కథనం మొత్తం యానిమేషన్‌తో నడుస్తుంది. విజువల్‌ వండర్‌గా ఈ సినిమాను తీర్చిదిద్దారు.కశ్యప మహాముని భార్య కడుపున హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు పుట్టడానికి గల కారణాలను వివరిస్తూ ఈ సినిమా కథ ప్రారంభం అవుతుంది. మహా విష్ణువుపై ద్వేషం పెంచుకున్న ఈ ఇద్దరు అన్నదమ్ములు..తమకున్న శక్తులతో దేవతలను సైతం భయబ్రాంతులకు గురిచేస్తారు. ఒకానొక సమయంలో హిరణ్యాక్షుడు భూదేవికి అపహరించి సముద్ర గర్భంలో బంధిస్తాడు. దీంతో విష్ణు మూర్తి వరాహావతారంలో వచ్చి హిరణ్యాక్షుడు సంహరించి భూదేవిని తీసుకొస్తాడు. సోదరుడి మరణంతో విష్ణుపై హిరణ్యకశిపుడు మరింత పగను పెంచుకుంటాడు. తీవ్రమైన తప్పస్సు చేసి బ్రహ్మాదేవుడి నుంచి తనకు భూమి, అకాశం పైన,దేవతలతో గాని, పశువులతోగానీ, పగలు గానీ రాత్రి గానీ మరణం లేకుండా వరం పొందుతాడు. ఆ శక్తులతో ఇంద్రలోకాన్ని సైతం తన ఆధీనంలోకి తెచ్చకుంటాడు. అతని కొడుకే ప్రహ్లాదుడు. పుట్టుకతోనే విష్ణుమూర్తి భక్తుడిగా మారతాడు. తండ్రికేమో విష్ణువు అంటే పడదు.. కొడుకుకేమో విష్ణుమూర్తే సర్వస్వం అన్నట్లుగా బతుకుతాడు. ఎంత నచ్చజెప్పిన విష్ణుమూర్తి పేరు తలచకుండా ఉండడు. చివరకు కొడుకునే సంహరించాలని చూస్తాడు. ఆ సమయంలో విష్ణుమూర్తి నరసింహా అవతారంలో వచ్చి హిరణ్యకశిపుడిని సంహరిస్తాడు. ఒక కమర్షియల్‌ సినిమాకు కావాల్సిన అంశాలన్నీ ఈ కథలో ఉన్నాయి. దాన్ని దర్శకుడు అశ్విన్‌ కుమార్‌ చక్కగా వాడుకున్నాడు. భారీ ఎలివేషన్స్‌, యాక్షన్‌ సీన్స్‌తో అద్భుతంగా తీర్చిదిద్దాడు. క్లైమాక్స్‌లో నరసింహ స్వామి ఎంట్రీ ఇచ్చే సీన్‌ అదిరిపోతుంది.హిరణ్యకశిపుడితో నరసింహాస్వామి చేసే యాక్షన్‌ తెరపై చూస్తుంటే గూస్‌ బంప్స్‌ వస్తాయి. యానిమేటెడ్‌ సినిమా అయినా సరే కొన్ని యాక్షన్‌ సీన్లకు థియేటర్స్‌లో విజిల్స్‌ పడతాయి. యానిమేషన్ పర్ఫెక్ట్‌గా కుదిరింది. తెరపై చూస్తుంటే కమర్షియల్‌ సినిమా చూస్తున్నట్లే ఉంటుంది. తెలుగు డబ్బింగ్‌ చక్కగా కుదిరింది. సామ్‌ సీ.ఎస్‌ నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం. బీజీఎం అదిరిపోయింది. చిన్నపిల్లలు ఈ సినిమాను బాగా ఎంజాయ్‌ చేస్తారు.

Thailand Cambodia Row: Advisory to Indians is This Details9
థాయ్‌-కంబోడియా ఘర్షణలు.. భారతీయులకు అడ్వైజరీ

థాయ్‌లాండ్‌, కంబోడియా దేశాలు సరిహద్దు వివాదంతో పరస్పర దాడులకు తెగబడుతున్న సంగతి తెలిసిందే. దశబ్దాలుగా కొనసాగుతున్న ఈ వివాదం.. తాజాగా తీవ్ర రూపం దాల్చింది. ఈ నేపథ్యంలో భారతీయుల కోసం అడ్వైజరీ జారీ అయ్యింది.భారత పౌరులు థాయ్‌లోని ఏడు ప్రావిన్స్‌ల వైపు ప్రయాణం చేయొద్దని శుక్రవారం థాయ్‌లాండ్‌లోని భారత రాయబార కార్యాలయం సూచింది. అంతేకాదు మార్గదర్శకాల కోసం థాయ్‌ అధికారుల సహకారం కోరవచ్చని అందులో స్పష్టం చేసింది. ట్రాట్‌, సురిన్‌, సిసాకెట్‌, బురిరామ్‌, సా కవావో, ఛంథాబురి, ఉవోన్‌ రట్చథాని..ప్రావిన్స్‌లు ఈ జాబితాలో ఉన్నాయి.In view of the situation near Thailand-Cambodia border, all Indian travelers to Thailand are advised to check updates from Thai official sources, including TAT Newsroom.As per Tourism Authority of Thailand places mentioned in the following link are not recommended for… https://t.co/ToeHLSQUYi— India in Thailand (@IndiainThailand) July 25, 2025ఇదిలా ఉంటే.. మరోవైపు థాయ్‌లాండ్‌ తాత్కాలిక ప్రధాని పుమ్తోమ్‌ వెచయాచై కూడా ఆయా ప్రావిన్స్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నట్లు ప్రకటించారు. ప్రాచీన దేవాలయాల చుట్టూ ఉన్న భూభాగంపై ఆధిపత్యం కోసం కొన్ని దశాబ్దాలుగా థాయ్‌లాండ్ – కాంబోడియా మధ్య నడుస్తున్న వివాదం.. తాజాగా తీవ్రరూపం దాల్చింది.Ta Muen, Ta Moan Thom దేవాలయాలు తమవంటే తమవని ఇరు దేశాలు కొన్ని దశాబ్దాలుగా వాదించుకుంటున్నాయి. అయితే అంతర్జాతీయ న్యాయస్థానంలో కంబోడియాకు అనుకూలంగా తీర్పు వెలువడినప్పటికీ.. థాయ్‌లాండ్‌ నుంచి అభ్యంతరాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో.. మే నెలలో కంబోడియాకు చెందిన సైనికుడ్ని థాయ్‌ సైన్యం కాల్చి చంపింది. అప్పటి నుంచి ఇరు దేశాల సరిహద్దులో వాతావరణం వేడెక్కింది. అయితే ఈ పరిస్థితిని చల్లార్చేందుకు థాయ్‌ ప్రధాని షినవత్రా.. కంబోడియా మాజీ ప్రధాని హున్‌ సేన్‌తో రాయబారం చేయబోయారు. ఆ సమయంలో ‘అంకుల్‌’ అని సంబోధిస్తూ మాట్లాడిన ఫోన్‌కాల్‌ బయటకు వచ్చింది. ఈ పరిణామంపై థాయ్‌ సైన్యం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీంతో ఆమె బహిరంగ క్షమాపణలు చెప్పారు. అయితే ఈ అంశంపై అక్కడి రాజ్యాంగ న్యాయస్థానం విచారణకు ఆదేశించడంతో పాటు ఆమెను సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో జులై 3న పుమ్తోమ్‌ వెచయాచై థాయ్‌ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది.జూలై 23, 2025న ల్యాండ్‌మైన్ పేలడంతో థాయ్‌లాండ్‌కు చెందిన ఐదుగురు సైనికులు గాయపడ్డారు. ప్రతిగా.. థాయ్‌లాండ్ F-16 యుద్ధ విమానాలతో కాంబోడియా లక్ష్యాలపై బాంబుల దాడులు చేసింది. ఈ పరిణామంతో ఇరు దేశాల రాయబారులను ఉపసంహరించుకున్నారు.గురువారం నాటి ఘర్షణల్లో ఇరుదేశాలకు చెందిన 14 మంది మరణించగా.. పలువురు గాయపడ్డారు. ఈ సంక్షోభంతో సరిహద్దులో ఉంటున్న వేలమంది తమ తమ దేశాలకు పారిపోయారు. శుక్రవారం సైతం ఈ దాడులు కొనసాగుతున్నాయి. థాయ్‌లాండ్‌ కంబోడియన్‌ సరిహద్దులో వైమానిక దాడులు చేస్తోంది.

Vigilance Department raided six locations linked to a forest official10
ప్రభుత్వ అధికారుల అక్రమాల పుట్టపగులుతోంది.. తవ్వే కొద్దీ డబ్బే డబ్బు

భువనేశ్వర్‌: అవినీతికి పాల్పడుతున్న అటవీశాఖ అధికారుల్ని విజిలెన్స్‌ అధికారులు ఆట కట్టిస్తున్నారు. వారం రోజుల వ్యవధిలో ఇద్దరు అటవీ శాఖ అధికారుల ఇళ్లలో విజిలెన్స్‌ శాఖ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ఓ అధికారికి 116 ఫ్లాట్లు గుర్తించగా.. మరో అధికారి ఇంట్లో తవ్వే కొద్దీ నోట్ల కట్టలు, గోల్డ్‌ కాయిన్లు, ఇతర బంగారు ఆభరణాలు వెలుగులోకి వచ్చాయి. సదరు అధికారుల ఇళ్లల్లో సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లో విజిలెన్స్‌ అధికారులు శుక్రవారం ఆరో ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేశారు. ఈ సోదాల్లో అటవీశాఖ డిప్యూటీ రేంజర్‌ రామ చంద్ర నాయక్‌ నివాసంలో ఆదాయానికి మించిన రూ.1.44 కోట్ల క్యాష్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆయనకు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ ఆస్మిక తనిఖీలు చేపట్టారు అధికారులు.తనిఖీల్లో జయపూర్‌లోని ఆయన ఫ్లాట్‌లో రహస్య గదిలో దాచిన రూ. 1.44 కోట్ల నగదు, 4 బంగారు బిస్కెట్లు, 16 బంగారు నాణేలు (ప్రతి నాణెం 10 గ్రాములు),6 ప్రాంతాల్లోని జయపూర్, భువనేశ్వర్‌లోని ఆయన నివాసాలు, బంధువుల ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. కాగా, ఈ దాడుల్లో ఆరుగురు డీఎస్పీలు, ఐదుగురు ఇన్‌స్పెక్టర్లు, తొమ్మిదిమంది ఏఎస్‌ఐలు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. కరెన్సీ కౌంటింగ్ మెషీన్లు ఉపయోగించి నగదు లెక్కింపు కొనసాగుతోంది.ఈ దాడికి ముందు మరో అటవీ శాఖ అధికారి నివాసాల్లో విజిలెన్స్‌ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సదరు అధికారికి 119కి పైగా ప్లాట్లు ఉన్నట్లు తేలింది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement