
నల్గొండ: తాటిచెట్టు ఎక్కుతుండగా మోకు జారడంతో గీతకార్మికుడు చెట్టుపైనే తలకిందులుగా వేలాడుతూ నరకాన్ని చూశాడు. ఈ సంఘటన మంగళవారం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తంగడపల్లి గ్రామానికి చెందిన ఇట్టగోని ముత్యాలు కల్లు గీసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
రోజుమాదిరిగా మంగళవారం గ్రామ సమీపంలో తాటిచెట్టు ఎక్కుతుండగా ఒక్కసారిగా మోకు జారడంతో చెట్టుపైనే తలకిందులుగా వేలాడాడు. కొంతసేపటి తర్వాత స్థానికులు గమనించి హుటాహుటిన గ్రామం నుంచి నిచ్చెనలు తీసుకొచ్చి ముత్యాలును కిందికి దింపి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. స్థానికులు సకాలంలో స్పందించడంతో ప్రాణాపాయం తప్పింది.