నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ ఓ విద్యార్థినితో వెకిలిచేష్టలకు పాల్పడ్డాడు.
చౌటుప్పల్ (నల్లగొండ) : నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ ఓ విద్యార్థినితో వెకిలిచేష్టలకు పాల్పడ్డాడు. దీంతో బాధితురాలి కుటుంబసభ్యులు పాఠశాలపై దాడిచేసి, సదరు ప్రిన్సిపాల్‌కు దేహశుద్ధి చేశారు. వివరాల్లోకి వెళ్తే.. గణేష్ అనే వ్యక్తి చౌటుప్పల్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ప్రిన్సిపాల్, కరస్పాండెంట్‌గా పని చేస్తున్నాడు.
కాగా అదే పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థినితో గణేష్ వెకిలిగా ప్రవర్తించాడు. సదరు బాలిక తన తల్లిదండ్రులకు విషయం తెలిపింది. దాంతో వారు గురువారం ఉదయం 10 గంటల ప్రాంతంలో స్కూలు వద్దకు చేరుకుని గణేష్‌తో వాగ్వాదానికి దిగారు. అతనికి దేహశుద్ధి చేయటంతోపాటు పాఠశాల ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు.